నేనేం చిన్నపిల్లనా..? రివ్యూ

0

nenem-chinna-pillana-movie-reviewప్రివ్యూ: నేనేం చిన్నపిల్లనా?

అవార్డు చిత్రాల ద‌ర్శకుడిగా పి.సునీల్‌కుమార్‌రెడ్డికి మంచి పేరుంది. తాను న‌మ్మిక క‌థ‌ను ఆఫ్ బీట్ చిత్రంగా తీసి విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకొన్నారాయ‌న‌. సొంత ఊరు, గంగ‌పుత్రులు చిత్రాల‌కు అవార్డులొచ్చాయి. ఆ త‌ర‌వాత రొమాంటిక్ క్రైమ్ క‌థ లాంటి యూత్‌ఫుల్ సినిమా తీసీ క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శకుడు అనిపించుకొన్నారు. అందుకే ఇప్పుడు సురేష్ ప్రొడ‌క్షన్స్ సంస్థ నుంచి పిలుపొచ్చింది. ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన చిత్రం నేనేం చిన్నపిల్లానా. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని హైలెట్స్ ప‌రిశీలిస్తే…

* సురేష్ ప్రొడ‌క్షన్స్ సినిమా అంటే క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌నే ఆశిస్తారు. ఈ సినిమా కూడా ఆ కోవ‌కు చెందిన‌దే అని చిత్రబృందం చెబుతోంది. అయితే ఈసారి యూత్‌ని కూడా టార్గెట్ చేసిన‌ట్టు స్పష్టంగా క‌నిపిస్తోంది.

* త‌న్వీ ఈ చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ హీరో.

* నా జీవితం నా ఇష్టం అనుకొనే స్వప్న అనే ప‌ల్లెటూరి అమ్మాయి క‌థ ఇది. అనుకోండా స్వీడ‌న్ వెళ్లాల్సివ‌స్తుంది. ఆ నాగ‌రిక‌త ఈ ప‌ల్లెటూరి అమ్మాయిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? క్రిష్ అనే అబ్బాయితో ఏర్పడిన స్నేహం వ‌ల్ల స్వప్న జీవితం ఎలాంటి మ‌లుపు తిరిగింది అనేదే క‌థ‌.

* కుటుంబ బంధాల‌కూ చోటిచ్చామ‌ని, ప‌ల్లెటూరులో క‌నిపించే ఆప్యాయ‌తా, అనుబంధాలూ తెర‌పై చూపించామ‌ని ద‌ర్శకుడు చెబుతున్నారు.స్వీడ‌న్‌లో చిత్రీక‌రించిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదేన‌ట‌.

* శ్రీ‌లేఖ ఈ చిత్రానికి సంగీతం అందించింది. రెండు మూడు పాట‌లు విన‌డానికి బాగున్నాయి. మ‌రి తెర‌పై ఎలా ఉంటాయో చూడాలి.

* సురేష్ ప్రొడ‌క్షన్స్ సినిమాల్లో న‌టించ‌డం అల‌వాటుగా చేసుకొన్న సంజ‌న ఈ సినిమాలోనూ న‌టించింది.

* సుమ‌న్‌, స‌న‌, రఘుబాబు, ఎల్బీ శ్రీ‌రామ్ త‌దిత‌ర‌లు న‌టించారు.