నటీనటులు : రజిని కాంత్,సునీల్ శెట్టి, నయనతార, నివేదా థామస్ తదితరులు
దర్శకత్వం : ఏ ఆర్ మురుగదాస్
నిర్మాతలు : ఏ. శుభాస్కరన్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫర్ : సంతోష్ శివన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ముంబైలో పోలీసులకు సరైన గౌరవం లేక పోలీస్ వ్యవస్థ పూర్తిగా వీక్ అయిన పరిస్థితుల్లో.. అక్కడి యువత డ్రగ్స్ కి బానిసలుగా బతుకుతున్న స్థితిలో.. వెరీ సిన్సియర్ అండ్ పూర్తి ఆవేశపూరితమైన పోలీస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబైకి కమీషనర్ గా వస్తాడు. రావడంతోనే వేలమంది ఆడపిల్లలను సేవ్ చేస్తాడు. మరో పక్క తన కూతురు వల్లీ (నివేథా థామస్)తో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే లిల్లీ (నయనతార)తో పరిచయం అవుతుంది. ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం హరి చోప్రా(సునీల్ శెట్టి) ఆదిత్య అరుణాచలాన్ని టార్గెట్ చేస్తాడు. దాంతో ఆదిత్య అరుణాచలం జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి ప్రతీకారంగా హరి చోప్రా మీద ఆదిత్య అరుణాచలం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు హరి చోప్రా గతం ఏమిటి? ఆ గతానికి ముంబైకి సంబంధం ఏమిటి? చివరికి ఆదిత్య అరుణాచలం తానూ అనుకున్నది సాధించాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ తో పాటు కొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో అలాగే భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సూపర్ స్టార్ అభిమానులకు.. మురగదాస్ మొత్తానికి రజిని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైలిష్ ఎనర్జిటిక్ నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.
ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ లో మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో అండ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ లో రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. సినిమాకే అతి కీలక మైన పాత్రలో నటించిన నివేథా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో నివేథా నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ గా నయనతారకు పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న ఆ కొన్ని సీన్స్ లో తన గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీతో మెప్పించింది.
ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. విలన్ గా సునీల్ శెట్టి పర్వాలేదు. మురగదాస్ ఎక్కడా యాక్షన్ ట్రీట్ తగ్గకుండా.. మరియు కథలోని ఎమోషన్ని చాలా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు మురగదాస్ గుడ్ యాక్షన్ అండ్ బలమైన ఎమోషన్ తో ఆకట్టుకునప్పటికీ.. అయన స్క్రీన్ ప్లే మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథ మీద పెట్టలేదు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ స్లో అయింది. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. సినిమాలోని మెయిన్ విలన్ కు పెట్టిన ట్రాక్ కూడా ఎపెక్టివ్ గా అనిపించదు. పైగా సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం, అలాగే చివరికీ సినిమా రొటీన్ రివెంజ్ డ్రామాగానే ముగింపు పలకడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి.
వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా సినిమాటిక్ గా చూపించాడు. దీనికి తోడు కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. సినిమా లాస్ట్ నలభై నిముషాలు ఇంకా టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మురగదాస్ భారీ విజువల్స్ తో భారీ యాక్షన్ తో చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు పనితనం మెచ్చుకోని తీరాలి. అయితే కొన్ని సన్నివేశాలు మరియు కథ విషయంలో మాత్రం దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన సంగీతం చాల బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న యాక్షన్ ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కెమరామెన్, దర్శకుడి ఆలోచనకు తగ్గట్లు భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. మెయిన్ గా రజినిని చాల యంగ్ గా చూపించారు. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. సూపర్ స్టార్ తో ఇలాంటి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అందించినందుకు సుభాష్ శరన్ ను అభినందించాలి.
తీర్పు :
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అద్భుతమైన యాక్షన్ తో మరియు బలమైన కొన్ని సెంటిమెంట్ సీన్స్ తో సాగుతూ రజినీకాంత్ ఫ్యాన్స్ కు మంచి యాక్షన్ ట్రీట్ ఇస్తోంది. అయితే దర్శకుడు స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథ మీద పెట్టకపోవడం, సెకెండ్ హాఫ్ లో కీలక సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. కానీ రజిని మార్క్ యాక్టింగ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.
మెయిన్ గా రజిని అభిమానులకు ఈ సినిమా డీసెంట్ ఫీస్ట్ లా అనిపిస్తోంది. అయితే ఈ సంక్రాంతి పోటీలో నిలబడి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
‘దర్బార్’ : లైవ్ అప్డేట్స్ :
-
క్లైమాక్స్ లో ఒక భారీ పోరాట సన్నివేశంతో సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
-
క్లైమాక్స్ లో ఒక భారీ పోరాట సన్నివేశంతో సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:05 AM January 09, 2020 -
ఇప్పుడు చిత్రం క్లైమాక్స్ దిశగా చేరుకుంటుంది.సునీల్ శెట్టి గ్యాంగ్ పై దాడి చేసేందుకు రజిని సిద్ధం అవుతున్నారు.
Date & Time : 07:57 AM January 09, 2020 -
ఇప్పుడు పోలీసులు మరియు సునీల్ శెట్టిల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:50 AM January 09, 2020 -
ఇప్పుడు నివేత థామస్ కు సంబంధించి ఎమోషనల్ సీన్ అనంతరం రజినీ బ్యాడ్ కాప్ గా మళ్ళీ తన ఆట మొదలు పెట్టారు.
Date & Time : 07:40 AM January 09, 2020 -
ఇప్పుడు అన్ని ఎన్కౌంటర్స్ తో ఆదిత్య అరుణాచలం న్యాయం చేసాడు.ఇప్పుడు రజినీ సునీల్ శెట్టి కోసం వెతకడం స్టార్ట్ చేసారు.
Date & Time : 07:28 AM January 09, 2020 -
ఇప్పుడు మరో ఫైట్ కు రంగం సిద్ధం అయ్యింది…తలైవర్ థీమ్ సాంగ్ తో రజినీ మార్క్ డాన్స్ మూమెంట్స్ వేస్తున్నారు.
Date & Time : 07:15 AM January 09, 2020 -
ఇంటర్నేషనల్ డాన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) ఇండియాలో ల్యాండ్ అయ్యాడు.ఇప్పుడు అతను తన మనుషుల ద్వారా రజినీ వివరాలు కనుక్కుంటున్నాడు.
Date & Time : 07:11 AM January 09, 2020 -
ఇంటర్వెల్ అనంతరం నయన్ బంధువుల ఇంట్లో ఒక పెళ్లితో మొదలయ్యింది.ఇక్కడ డుం డుం వెడ్డింగ్ సాంగ్ వస్తుంది.
Date & Time : 07:07 AM January 09, 2020 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అంతా ఒకే అని చెప్పొచ్చు.రజినీను ఎలివేట్ చేసే సీన్స్ తో డీసెంట్ గా సాగింది.మరి సెకండాఫ్ ను మురుగదాస్ ఇంకా సంథింగ్ స్పెషల్ గా ఎమన్నా తెరకెక్కించారో లేదో చూడాలి.
Date & Time : 06:58 AM January 09, 2020 -
ఇప్పుడు రజిని మార్క్ డైలాగ్ “ఐమ్ ఏ బ్యాడ్ కాప్” చెప్తూ సినిమా సగానికి చేరుకుంది.
Date & Time : 06:55 AM January 09, 2020 -
ఇప్పుడు హరి చోప్రాగా నటుడు సునీల్ శెట్టి పరిచయం అయ్యారు.అతనికి సంబంధిత సీన్స్ వస్తూనే కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 06:50 AM January 09, 2020 -
ప్రతీక్ బాబర్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అయ్యింది.ఇప్పుడు తలైవర్ ఆట మొదలయ్యింది..
Date & Time : 06:36 AM January 09, 2020 -
రజినీ మరియు నయన్ ల మధ్య కొన్ని మంచి సన్నివేశాలు ప్రత్యేక మార్గం సాంగ్ వైపుగా తీసుకెళ్లాయి.
Date & Time : 06:30 AM January 09, 2020 -
రజినీ మరియు నయన్ ల మధ్య సీన్స్ కొనసాగుతున్నాయి.అలాగే రజినీ మరియు యోగి బాబుల మధ్య కామెడీ సీన్స్ బాగున్నాయి.
Date & Time : 06:19 AM January 09, 2020 -
ఇప్పుడు హీరోయిన్ నయనతార ఎంట్రీ ఇచ్చారు.రజినీ ఆమెను తన ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ “ఇప్పుడు చూడు” అంటూ కలిశారు.
Date & Time : 06:12 AM January 09, 2020 -
ఇప్పుడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ (అజయ్ మల్హోత్రా) అమ్మలనూ అక్రమంగా తరలించే మాఫియా హెడ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 06:06 AM January 09, 2020 -
ఇప్పుడు కథనం కాస్త సీరియస్ గా మారింది.ఓ డిప్యూటీ సీఎం కూతురు కిడ్నాప్ అవ్వగా ఆ కేసును రజినీ విచారిస్తున్నారు.మురుగదాస్ మార్క్ లో ఈ సీన్ ఆసక్తికరంగా సాగుతుంది.
Date & Time : 05:59 AM January 09, 2020 -
ఇప్పుడు స్టార్ కమెడియన్ యోగిబాబు రజిని అసిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:54 AM January 09, 2020 -
ఆదిత్య అరుణాచలం ముంబై నుంచి ఢిల్లీకి ట్రాన్సఫర్ కావడంతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తయ్యింది.
Date & Time : 05:52 AM January 09, 2020 -
ఇప్పుడు కత్తితో అసలు సిసలైన తలైవర్ రజినీ మార్క్ మాస్ ఎంట్రీ ఎంట్రీ పడింది.పోలీస్ గెటప్ లో రజినీ స్టైలిష్ కాప్ గా అదరగొడుతున్నారు.
Date & Time : 05:44 AM January 09, 2020 -
సూపర్ స్టార్ రజినీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.కొన్ని గ్యాంగ్ స్టర్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:39 AM January 09, 2020 -
సీక్రెట్ గా ఆదిత్య అరుణాచలం ఒక గ్యాంగ్ స్టర్ సెటప్ చెయ్యడంతో టైటిల్స్ మొదలయ్యాయి.
Date & Time : 05:35 AM January 09, 2020 -
హాయ్…160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:30 AM January 09, 2020
దర్బార్ రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 4
సాంకేతిక వర్గం పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 3.75
3.6
దర్బార్ రివ్యూ
దర్బార్ రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

