Templates by BIGtheme NET
Home >> GADGETS >> Xiaomi, Oneplusలకు భారీ షాక్.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన Realme X50

Xiaomi, Oneplusలకు భారీ షాక్.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన Realme X50


స్మార్ట్ ఫోన్ ప్రియులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రియల్ మీ ఎక్స్50 5జీ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించిన వివరాలను రియల్ మీ గతంలోనే ప్రకటించింది. అప్పట్నుంచి దీనిపై అంచనాలు నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. మరి ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేక ఫీచర్లేంటి? సాధారణ స్పెసిఫికేషన్లేంటి? దీని ధర ఎంత?

​ధర ఎంతంటే?

ఈ ఫోన్ మొత్తంగా మూడు వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయంది. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,499 యువాన్లుగా(సుమారు రూ.25,790)గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,699 యువాన్లుగా(సుమారు రూ.25,860) ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,999 యువాన్లుగా(సుమారు రూ.30,960) ఉంది. పోలార్ వైట్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ ను విక్రయించనున్నారు.

​డిస్ ప్లే, ప్రాసెసర్ లు ఎలా ఉన్నాయంటే..

రియల్ మీ ఎక్స్50 స్మార్ట్ ఫోన్ లో 6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ స్క్రీన్ ను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫీచర్ ఉన్న చవకైన ఫోన్ ఇదే కావడం విశేషం. అలాగే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పక్క భాగంలో అందించారు. 7 నానో మీటర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

​కెమెరాలు అదుర్స్!

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వెనకవైపు ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 12 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లను ఇందులో అందించారు. శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్ ను 64 మెగా పిక్సెల్ కెమెరాగా అందించడం విశేషం. ముందువైపు రెండు సెల్ఫీ కెమెరాలను అందించారు. ఇందులో ప్రధాన కెమెరాగా 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్ ను ఉపయోగించారు. 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న వైడ్ యాంగిల్ లెన్స్ ను కూడా ముందు వైపు అందించారు.

​30 నిమిషాల్లో 70 శాతం చార్జింగ్

ఈ ఈవెంట్లోనే రియల్ మీ యూఐ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టంను రియల్ మీ ప్రకటించింది. ఈ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే మొదటి ఫోన్ ఇదే. రియల్ మీ యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. అలాగే ఇందులో 4,200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 30W VOOC Flash Charge 4.0 ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ టెక్నాలజీ ద్వారా ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లోనే 70 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. ఫోన్ కు కుడివైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. అంతేకాకుండా ఇందులో డాల్బీ అట్మాస్, హై రిజల్యూషన్ ఆడియో ఫీచర్లు కూడా ఉన్నాయి.

​మిగతా ఫీచర్లు ఇవే!

SA/NSA(ఆప్షనల్)/డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై 802.11a/c, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, బైడు, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్-సీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ పొడవు 16.38 సెంటీమీటర్లు కాగా, 7.58 సెంటీమీటర్ల వెడల్పు, 0.89 మిల్లీ మీటర్ల మందం ఉండనుంది. అలాగే దీని బరువు 202 గ్రాములుగా ఉంది.

​మాస్టర్ ఎడిషన్ కూడా..

దీంతో పాటు రియల్ మీ ఎక్స్50 5జీ మాస్టర్ ఎడిషన్ ను కూడా రియల్ మీ విడుదల చేసింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను 3,099 యువాన్లుగా(సుమారు రూ.32,000)గా నిర్ణయించారు. దీన్ని ప్రముఖ జపనీస్ డిజైనర్ నవోటో ఫుకాసావా రూపొందించారు. బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఈ మాస్టర్ ఎడిషన్ లభించనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ అయింది. దీనిపై మనదేశంలో కూడా భారీ అంచనాలున్నాయి కాబట్టి త్వరలో మన దేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

realme x50 5G specs, realme x50 5G Specifications, realme x50 5G price, realme x50 5G price in india,realme x50 5G Features, realme x50 5G Battery, realme x50 5G pre-book, realme x50 5G booking, realme x50 5G flipkart, realme x50 5G amazon, realme x50 5G buy, realme x50 specs, realme x50 Specifications, realme x50 price, realme x50 price in india,realme x50 Features, realme x50 Battery, realme x50 pre-book, realme x50 booking, realme x50 flipkart, realme x50 amazon, realme x50 buy