‘బింబిసార’ – రివ్యూ

0

చిత్రం :‘బింబిసార’
నటీనటులు : నందమూరి కళ్యాణ్‌రామ్, కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వారినా హుస్సేన్, వెన్నెల, ప్రకాష్ రాజ్ తదితరులు.
దర్శకుడు : వశిష్ట
నిర్మాతలు హరికృష్ణ కె
సంగీతం M. M. కీరవాణి
సినిమాటోగ్రఫీ ఛోటా కె. నాయుడు

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార అంచనాలకు తగ్గట్లుగానే సాలిడ్ యాక్షన్ బ్లాక్‌తో అండ్ భారీ ఓపెనింగ్స్ తో మొదలైంది. చారిత్రక పాత్రను కల్పిత కథనంతో వెండితెరపై ఈ చిత్రాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. మరీ ఆ అద్భుతం ఏమిటో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

బింబిసార (కళ్యాణ్ రామ్) అనే గొప్ప చక్రవర్తి తనను తాను దేవుడిగా మరియు రాక్షసుడిగా ప్రకటించుకుని త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఎంతో ఘనంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనల అనంతరం బింబిసారాకు ఈ ప్రపంచాన్ని జయించాలనే కోరిక కలుగతోంది. దాంతో రాజ్యాల పై యుద్దానికి దిగుతాడు. అలాగే మరో టైమ్ లైన్ లో ప్రస్తుత ప్రపంచంలో ఒక వ్యక్తి అచ్చం బింబిసారుడిలా ఉంటాడు. కొంత మంది దుండగులు కారణం లేకుండా అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు ?, ఇతనికీ బింబిసారాకు ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు ఈ వ్యక్తి బింబిసారా నిధిని తెరవగలిగాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

అద్భుతమైన యాక్షన్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా సాగిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పెట్టిన ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. స్టార్ ఇమేజ్ లేకపోయినా.. భారీ బడ్జెట్ పెట్టి, స్టార్ వాల్యూకి అతీతంగా ఈ సినిమా చేసిన విధానం ఆకట్టుకుంది. కేవలం కంటెంట్ ను నమ్ముకుని మేకర్స్ ఈ సినిమా కోసం భారీ స్ధాయిలో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం ఈ చిత్రంలో ఉంది. మొదటి నుంచి ఈ సినిమాకి పాజిటివ్ బజే నడుస్తూ వచ్చింది.

ప్రివ్యూ ల్లో కూడా ఈ సినిమా పై పాజిటివ్ టాక్ మాత్రమే నడిచింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో పవర్ ఫుల్ ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కొత్త డైరెక్షన్ అయినప్పటికీ వశిష్ట.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాని అద్భుతంగా తెరకెక్కంచాడు. నటీనటుల నటన కూడా హృదయాలను హత్తుకుంది. ఇదరి హీరోయిన్ల పాత్రలకు హీరో పాత్రకు మధ్య ఎమోషన్స్ కూడా గుండె బరువెక్కేలా ఉన్నాయి. ఇక కళ్యాణ్ రామ్ కూడా తాను పోషించిన రెండు పాత్రల మధ్య బాండింగ్ ను చాలా బాగా ఎలివేట్ చేశాడు.

కళ్యాణ్ రామ్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇన్నాళ్లు అతన్ని దర్శకులు సరిగ్గా వాడుకోలేదు. కానీ ఈ సినిమాతో తన స్థాయి ఏమిటో కళ్యాణ్ రామ్ ఘనంగా చాటుకున్నాడు ఇక సినిమాలో మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే… ఇంటర్వెల్ కి ముందు వచ్చే భీకరమైన పోరు సీక్వెన్స్ అయితే వండర్ ఫుల్ గా ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్. ఇక సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సాలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు.

ప్లస్ పాయింట్స్ :

*కళ్యాణ్ రామ్ నట విశ్వ‌రూపం,

*కథ కథనాలు, డైలాగ్స్,

*ఎమోషనల్ సీన్స్,

*స్క్రీన్ ప్లే.

*విజువల్స్ అండ్ ఎమోషన్స్.

మైనస్ పాయింట్స్ :

*లవ్ ట్రాక్,

*సెకండ్ హాఫ్ లో వచ్చే స్లో సీన్స్,

*చిన్న పాయింట్ బేస్ చేసుకుని మొత్తం కథ సాగడం,

చివరగా :

ఈ విజువల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ పీరియాడిక్ డ్రామాలో.. కళ్యాణ్ రామ్ తన అల్టిమేట్ యాటిట్యూడ్ తో అండ్ యాక్టింగ్ తో దుమ్ము దులిపేశాడు. నందమూరి అభిమానులకు ఈ సినిమాలోని కళ్యాణ్ రామ్ నటన ఒక పండుగ. ఇక సినిమాలోని క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్స్, మరియు సాంగ్స్ ఇలా ప్రతిదీ బాగుంది. ఓవరాల్ గా ఇది ఎమోషనల్ యాక్షన్ విజువల్ ట్రీట్ కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా. కానీ యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా పై నెగిటివ్ టాక్ ను బాగానే స్పెర్డ్ చేస్తున్నారు.

చిత్రం :‘బింబిసార’ నటీనటులు : నందమూరి కళ్యాణ్‌రామ్, కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వారినా హుస్సేన్, వెన్నెల, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకుడు : వశిష్ట నిర్మాతలు హరికృష్ణ కె సంగీతం M. M. కీరవాణి సినిమాటోగ్రఫీ ఛోటా కె. నాయుడు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార అంచనాలకు తగ్గట్లుగానే సాలిడ్ యాక్షన్ బ్లాక్‌తో అండ్ భారీ ఓపెనింగ్స్ తో మొదలైంది. చారిత్రక పాత్రను కల్పిత కథనంతో వెండితెరపై ఈ చిత్రాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. మరీ ఆ అద్భుతం ఏమిటో ఈ రివ్యూలో చూద్దాం. కథ : బింబిసార (కళ్యాణ్ రామ్) అనే గొప్ప చక్రవర్తి తనను తాను దేవుడిగా మరియు రాక్షసుడిగా ప్రకటించుకుని త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఎంతో ఘనంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనల అనంతరం బింబిసారాకు ఈ ప్రపంచాన్ని జయించాలనే కోరిక కలుగతోంది. దాంతో రాజ్యాల పై యుద్దానికి దిగుతాడు. అలాగే మరో టైమ్ లైన్ లో ప్రస్తుత ప్రపంచంలో ఒక వ్యక్తి అచ్చం బింబిసారుడిలా ఉంటాడు. కొంత మంది దుండగులు కారణం లేకుండా అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు ?, ఇతనికీ బింబిసారాకు ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు ఈ వ్యక్తి బింబిసారా నిధిని తెరవగలిగాడా ? లేదా ? అనేది మిగిలిన కథ. విశ్లేషణ : అద్భుతమైన యాక్షన్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా సాగిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పెట్టిన ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. స్టార్ ఇమేజ్ లేకపోయినా.. భారీ బడ్జెట్ పెట్టి, స్టార్ వాల్యూకి అతీతంగా ఈ సినిమా చేసిన విధానం ఆకట్టుకుంది. కేవలం కంటెంట్ ను నమ్ముకుని మేకర్స్ ఈ సినిమా కోసం భారీ స్ధాయిలో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం ఈ చిత్రంలో ఉంది. మొదటి నుంచి ఈ సినిమాకి పాజిటివ్ బజే నడుస్తూ వచ్చింది. ప్రివ్యూ ల్లో కూడా ఈ సినిమా పై పాజిటివ్ టాక్ మాత్రమే నడిచింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో పవర్ ఫుల్ ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కొత్త డైరెక్షన్ అయినప్పటికీ వశిష్ట.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాని అద్భుతంగా తెరకెక్కంచాడు. నటీనటుల నటన కూడా హృదయాలను హత్తుకుంది. ఇదరి హీరోయిన్ల పాత్రలకు హీరో పాత్రకు మధ్య ఎమోషన్స్ కూడా గుండె బరువెక్కేలా ఉన్నాయి. ఇక కళ్యాణ్ రామ్ కూడా తాను పోషించిన రెండు పాత్రల మధ్య బాండింగ్ ను చాలా బాగా ఎలివేట్ చేశాడు. కళ్యాణ్ రామ్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇన్నాళ్లు అతన్ని దర్శకులు సరిగ్గా వాడుకోలేదు. కానీ ఈ సినిమాతో తన స్థాయి ఏమిటో కళ్యాణ్ రామ్ ఘనంగా చాటుకున్నాడు ఇక సినిమాలో మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే… ఇంటర్వెల్ కి ముందు వచ్చే భీకరమైన పోరు సీక్వెన్స్ అయితే వండర్ ఫుల్ గా ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్. ఇక సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సాలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు. ప్లస్ పాయింట్స్ : *కళ్యాణ్ రామ్ నట విశ్వ‌రూపం, *కథ కథనాలు, డైలాగ్స్, *ఎమోషనల్ సీన్స్, *స్క్రీన్ ప్లే. *విజువల్స్ అండ్ ఎమోషన్స్. మైనస్ పాయింట్స్ : *లవ్ ట్రాక్, *సెకండ్ హాఫ్ లో వచ్చే స్లో సీన్స్, *చిన్న పాయింట్ బేస్ చేసుకుని మొత్తం కథ సాగడం, చివరగా : ఈ విజువల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ పీరియాడిక్ డ్రామాలో.. కళ్యాణ్ రామ్ తన అల్టిమేట్ యాటిట్యూడ్ తో అండ్ యాక్టింగ్ తో దుమ్ము దులిపేశాడు. నందమూరి అభిమానులకు ఈ సినిమాలోని కళ్యాణ్ రామ్ నటన ఒక పండుగ. ఇక సినిమాలోని క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్స్, మరియు సాంగ్స్ ఇలా ప్రతిదీ బాగుంది. ఓవరాల్ గా ఇది ఎమోషనల్ యాక్షన్ విజువల్ ట్రీట్ కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా. కానీ యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా పై నెగిటివ్ టాక్ ను బాగానే స్పెర్డ్ చేస్తున్నారు.

‘బింబిసార’ - రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 3.25
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3

3.3

‘బింబిసార’ - రివ్యూ

‘బింబిసార’ - రివ్యూ

User Rating: Be the first one !
3
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.