చిత్రం : ది వారియర్
నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా
దర్శకత్వం : ఎన్.లింగుసామి
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేదీ : జులై 14, 2022
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యంగ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన చిత్రం “ది వారియర్”. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్ గా విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
సత్య (రామ్) ఒక డాక్టర్. కర్నూలులోని హాస్పిటల్ కి వస్తాడు. అయితే అప్పటికే అక్కడ గురు (ఆది పినిశెట్టి) రాజ్యం నడుస్తూ ఉంటుంది. తన దారుణాలకు అడ్డు వచ్చిన ప్రతి ఒకర్నీ చంపుకుంటూ చెట్లు నాటుకుంటూ వెళ్తాడు గురు. ఈ క్రమంలో సత్యకి గురుకి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. గురు అన్యాయాలకు సత్య ఎదురు తిరుగుతాడు. ఈ మధ్యలో సత్య ఎదురింట్లో ఉండే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి)తో పరిచయం, ప్రేమగా మారుతుంది. అంతలో గురు, సత్య పై ఎటాక్ చేస్తాడు. ఆ తర్వాత సత్య ఏమయ్యాడు ? ఐపీఎస్ పాస్ అవ్వడానికి సత్య మోటివ్ ఏమిటీ ? కర్నూలు కి పోలీస్ గా వచ్చిన సత్య ఏమి సాధించాడు ? చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్రధాన బలం, బలగం హీరో రామ్ మాత్రమే. సత్య పాత్రలో రామ్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాల్లో రామ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. అలాగే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే రామ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ గా అదరగొట్టాడు. హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా బాగానే నటించింది.
విజిల్ మహాలక్ష్మి గా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అయితే, ఆమెకు సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. దర్శకుడు లింగుస్వామి, రామ్ ను పవర్ ఫుల్ గా చూపించే విధానంలో చాలా వరకు విజయం సాధించాడు.
అలాగే కీలకమైన నదియా రోల్.. ఆ పాత్రలో ఆమె నటించిన విధానం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టి ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
స్టోరీ లైన్ బాగున్నా.. సెటప్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ లవ్ స్టోరీ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ఇంట్రస్టింగ్ గా సాగుతున్న సినిమాలో అంత ఎఫెక్టివ్ గా సాగని లవ్ ట్రాక్,
అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగే సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. అనవసరపు యాక్షన్ సీన్స్ ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఇంటర్వెల్ కి గాని అసలు కథ ముందుకు కదలదు.
ఇక కొన్ని పోలీస్ సన్నివేశాల్లో కూడా మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు, కొన్ని మెయిన్ సీన్స్ ను మాత్రం నెమ్మదిగా నడిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ, దర్శకుడు మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు. దీనికి తోడు కొన్ని కీలక సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా సాగడం, అలాగే సెకెండ్ హాఫ్ లో హీరోకి విలన్ కి మధ్య వచ్చే సీక్వెన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. లింగుస్వామి దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, యాక్షన్ తో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. కానీ స్క్రిప్ట్ బాగాలేక పోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో లేదు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. ఐతే, సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ మాత్రం చాలా బాగుంది. నేపధ్య సంగీతం కూడా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్నిచోట్ల స్లోగా సాగిన కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.
తీర్పు :
‘ది వారియర్’ అంటూ వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో రామ్ నటన, కృతి శెట్టి గ్లామర్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. అయితే స్క్రీన్ ప్లే లో ‘స్లో నెరేషన్’, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, డాక్టర్ నుంచి పోలీస్ గా మారడం అనే థీమ్ బాగుంది. కానీ, కొన్ని సన్నివేశాలను మాత్రం దర్శకుడు ఎఫెక్టివ్ గా తెరకెక్కించలేకపోయాడు. పైగా సినిమాలో లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే రామ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగా అలరించాడు. ఐతే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం పర్వాలేదనిపిస్తోంది.
the warriorr movie review in telugu
కథ స్క్రీన్ ప్లే - 2.5
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 2.75
దర్శకత్వ ప్రతిభ - 2.75
2.9
the warriorr movie review in telugu
the warriorr movie review in telugu
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
