మిస్ ఇండియా రివ్యూ

0

చిత్రం : మిస్ ఇండియా
తారాగణం : కీర్తి సురేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ
రచన : నరేంద్రనాథ్‌
సంగీతం : థమన్
ఎడిటర్ : తమ్మిరాజు
దర్శకత్వం : నరేంద్రనాథ్‌
నిర్మాత : మహేష్ కోనేరు
విడుదల తేదీ  : November 4,2020

మహానటి, పెంగ్విన్ సినిమాల తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మిస్ ఇండియా’. జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ పరిచయం అయ్యాడు. థియేటర్ రిలీజ్ ఇప్పుడప్పుడే వీలుకానందువలన ఈ సినిమా కూడా ఓటిటి బాట పట్టింది. మరి నేడు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

వైజాగ్, లంబసింగి లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి మానస సంయుక్త(కీర్తి సురేష్). చిన్నప్పటి నుంచి తనకి ఓ పెద్ద బిజినెస్ చేసి సక్సెస్ సాధించాలనేది తన డ్రీం. కానీ ఎం.బి.ఏ చేస్తున్న టైంలో పరిస్థితుల కారణంగా మానస ఫ్యామిలీ అమెరికా వస్తుంది. తన ఫ్యామిలీ కోసం తన డ్రీంని పక్కనబెట్టి జాబ్ లో జాయిన్ అవుతుంది. కానీ కొన్ని రోజులకి ఆ జాబ్ తనకి నచ్చకపోవడంతో మానేసి తన డ్రీం బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంది. అదే తన తాతయ్య కనిపెట్టిన ఛాయ్ ని ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ తో అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. అతి తక్కువ కాలంలోనే చాలా గుర్తింపు తెచ్చుకుంటుంది. దాంతో అమెరికాలో అప్పటికే కాఫీ బిజినెస్ లో టాప్ లో ఉన్న ఖైలాష్ శివ కుమార్ (జగపతి బాబు) మిస్ ఇండియా బిజినెస్ ని అడ్డుకోవాలని చూస్తాడు. ఇక అక్కడి నుంచి కెకె పెట్టే ఇబ్బందులని గెలవడానికి మానస ఏం చేసింది? చివరికి కెకె పై గెలిచిందా? లేదా? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

కీర్తి సురేష్ మరోసారి తన నటనతో షో టాపర్ అనిపించుకుంది చెప్పాలి. తన పెర్ఫార్మన్స్ తో ప్రతి సీన్ లోనూ ఆకట్టుకుంటోంది. స్ట్రాంగ్ విమెన్ పాత్రలో తన హావా భావాలకి ప్రియాంక వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో సీన్స్ మరింత బాగా అనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా సన్నగా కనిపించింది. ఆ స్లిమ్ లో చూడడానికి పలు చోట్ల అంత బాగోలేదు. అలాగే కార్పొరేట్ విలన్ గా జగపతిబాబు మరోసారి మెప్పించాడు. సుమంత్ శైలేంద్ర, నవీన్ చంద్ర, నదియా, నరేష్, కమల్ కామరాజు, పూజిత పొన్నాడ, దివ్య ద్రిష్టిలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..

మహానటికి సినెమాటోగ్రఫీ అందించిన డానీ విజువల్స్ ఈ సినిమాకి మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. ప్రతి షాట్ సూపర్బ్ అనిపిస్తుంది. అలాగే ఆ విజువల్స్ కి మరింత ప్రాణం పోసింది మాత్రం థమన్ మ్యూజిక్ అని చెప్పే తీరాలి. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ గా ఉంటే బాగుండేది. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పాలి.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన నరేంద్ర నాథ్ విషయానికి వస్తే.. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది.. పోటాపోటీగా సాగేలా కథని రాసుకునే అవకాశం కూడా ఉంది. కానీ కథని అలా కాకుండా చాలా సింపుల్ గా, స్లోగా తీసుకెళ్లడం ఈ సినిమాకి మొదటి మైనస్. కథనంలో ఎక్కడా స్పీడ్ లేదు, ట్విస్ట్ లులేవు, అలాగని పెద్దగా ఆకట్టుకునే ఎమోషన్ కూడా లేదు. ఓవరాల్ గా చాలా బోరింగ్ గా సాగింది. అనవసరపు లవ్ ట్రాక్ ని పెట్టడం ఫస్ట్ హాఫ్ కి పెద్ద మైనస్. ఇక డైరెక్టర్ గా కూడా హీరోయిన్ ఎమోషన్ ని ప్రేక్షకులకి కనెక్ట్ చెయ్యడంలో మిస్ అయ్యారనే చెప్పాలి. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– కీర్తి సురేష్ నటన
– డానీ విజువల్స్
– థమన్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– కథని తీర్చిదిద్దిన విధానం
– బోరింగ్ కథనం
– వీక్ ఎమోషన్స్
– బాబోయ్ అనిపించే రన్ టైం
– ఆడియన్స్ ని మెప్పించలేకపోయిన డైరెక్షన్

విశ్లేషణ:

మహానటి ఇమేజ్ తో కీర్తి సురేష్ స్టార్ట్ చేసిన ఈ మిస్ ఇండియా సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం చాలా పెద్ద మిస్ ఫైర్ అయ్యింది. కథలో చెప్పాలనుకున్న పాయింట్ తప్ప మిగతా ఏవీ ఆకట్టుకోకపోవడం, కథలోని పాత్రలు పెద్దగా కనెక్ట్ కాకపోవడం, కొన్ని పాత్రలు జస్ట్ లెంగ్త్ కోసం వచ్చి వెళ్లిపోవడం లాంటి విషయాలు ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. కీర్తి సురేష్ స్టార్డం చూసి చూసారో.?? చూసాకా చాలా ఫీల్ అవుతారు.

చూడాలా? వద్దా?: మీకు బాగా ఓపిక, ఖాళీ ఉన్నా చూడడం కష్టమే..

చిత్రం : మిస్ ఇండియా తారాగణం : కీర్తి సురేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ రచన : నరేంద్రనాథ్‌ సంగీతం : థమన్ ఎడిటర్ : తమ్మిరాజు దర్శకత్వం : నరేంద్రనాథ్‌ నిర్మాత : మహేష్ కోనేరు విడుదల తేదీ  : November 4,2020 మహానటి, పెంగ్విన్ సినిమాల తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మిస్ ఇండియా’. జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ పరిచయం అయ్యాడు. థియేటర్ రిలీజ్ ఇప్పుడప్పుడే వీలుకానందువలన ఈ సినిమా కూడా ఓటిటి బాట పట్టింది. మరి నేడు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. కథ: వైజాగ్, లంబసింగి లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి మానస సంయుక్త(కీర్తి సురేష్). చిన్నప్పటి నుంచి తనకి ఓ పెద్ద బిజినెస్ చేసి సక్సెస్ సాధించాలనేది తన డ్రీం. కానీ ఎం.బి.ఏ చేస్తున్న టైంలో పరిస్థితుల కారణంగా మానస ఫ్యామిలీ అమెరికా వస్తుంది. తన ఫ్యామిలీ కోసం తన డ్రీంని పక్కనబెట్టి జాబ్ లో జాయిన్ అవుతుంది. కానీ కొన్ని రోజులకి ఆ జాబ్ తనకి నచ్చకపోవడంతో మానేసి తన డ్రీం బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంది. అదే తన తాతయ్య కనిపెట్టిన ఛాయ్ ని ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ తో అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. అతి తక్కువ కాలంలోనే చాలా గుర్తింపు తెచ్చుకుంటుంది. దాంతో అమెరికాలో అప్పటికే కాఫీ బిజినెస్ లో టాప్ లో ఉన్న ఖైలాష్ శివ కుమార్ (జగపతి బాబు) మిస్ ఇండియా బిజినెస్ ని అడ్డుకోవాలని చూస్తాడు. ఇక అక్కడి నుంచి కెకె పెట్టే ఇబ్బందులని గెలవడానికి మానస ఏం చేసింది? చివరికి కెకె పై గెలిచిందా? లేదా? అనేదే కథ. తెర మీద స్టార్స్.. కీర్తి సురేష్ మరోసారి తన నటనతో షో టాపర్ అనిపించుకుంది చెప్పాలి. తన పెర్ఫార్మన్స్ తో ప్రతి సీన్ లోనూ ఆకట్టుకుంటోంది. స్ట్రాంగ్ విమెన్ పాత్రలో తన హావా భావాలకి ప్రియాంక వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో సీన్స్ మరింత బాగా అనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా సన్నగా కనిపించింది. ఆ స్లిమ్ లో చూడడానికి పలు చోట్ల అంత బాగోలేదు. అలాగే కార్పొరేట్ విలన్ గా జగపతిబాబు మరోసారి మెప్పించాడు. సుమంత్ శైలేంద్ర, నవీన్ చంద్ర, నదియా, నరేష్, కమల్ కామరాజు, పూజిత పొన్నాడ, దివ్య ద్రిష్టిలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. తెర వెనుక టాలెంట్.. మహానటికి సినెమాటోగ్రఫీ అందించిన డానీ విజువల్స్ ఈ సినిమాకి మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. ప్రతి షాట్ సూపర్బ్ అనిపిస్తుంది. అలాగే ఆ విజువల్స్ కి మరింత ప్రాణం పోసింది మాత్రం థమన్ మ్యూజిక్ అని చెప్పే తీరాలి. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ గా ఉంటే బాగుండేది. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన నరేంద్ర నాథ్ విషయానికి వస్తే.. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది.. పోటాపోటీగా సాగేలా కథని రాసుకునే అవకాశం కూడా ఉంది. కానీ కథని అలా కాకుండా చాలా సింపుల్ గా, స్లోగా తీసుకెళ్లడం ఈ సినిమాకి మొదటి మైనస్. కథనంలో ఎక్కడా స్పీడ్ లేదు, ట్విస్ట్ లులేవు, అలాగని పెద్దగా ఆకట్టుకునే ఎమోషన్ కూడా లేదు. ఓవరాల్ గా చాలా బోరింగ్ గా సాగింది. అనవసరపు లవ్ ట్రాక్ ని పెట్టడం ఫస్ట్ హాఫ్ కి పెద్ద మైనస్. ఇక డైరెక్టర్ గా కూడా హీరోయిన్ ఎమోషన్ ని ప్రేక్షకులకి కనెక్ట్ చెయ్యడంలో మిస్ అయ్యారనే చెప్పాలి. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. విజిల్ మోమెంట్స్: – కీర్తి సురేష్ నటన – డానీ విజువల్స్ – థమన్ మ్యూజిక్ బోరింగ్ మోమెంట్స్: – కథని తీర్చిదిద్దిన విధానం – బోరింగ్ కథనం – వీక్ ఎమోషన్స్ – బాబోయ్ అనిపించే రన్ టైం – ఆడియన్స్ ని మెప్పించలేకపోయిన డైరెక్షన్ విశ్లేషణ: మహానటి ఇమేజ్ తో కీర్తి సురేష్ స్టార్ట్ చేసిన ఈ మిస్ ఇండియా సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం చాలా పెద్ద మిస్ ఫైర్ అయ్యింది. కథలో చెప్పాలనుకున్న పాయింట్ తప్ప మిగతా ఏవీ ఆకట్టుకోకపోవడం, కథలోని పాత్రలు పెద్దగా కనెక్ట్ కాకపోవడం, కొన్ని పాత్రలు జస్ట్ లెంగ్త్ కోసం వచ్చి వెళ్లిపోవడం లాంటి విషయాలు ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. కీర్తి సురేష్ స్టార్డం చూసి చూసారో.?? చూసాకా చాలా ఫీల్…

మిస్ ఇండియా రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.5
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 2.25
దర్శకత్వ ప్రతిభ - 2.25

2.6

మిస్ ఇండియా రివ్యూ

మిస్ ఇండియా రివ్యూ

User Rating: Be the first one !
3