రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి

0

ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మస్తాన్ వలి కుమారుడు షేక్‌ షారుఖ్‌ తన స్నేహితుడు ఫయాజ్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే చలి వేస్తోందని బైక్‌ను హైవే పక్కన నిలిపి స్వెట్టర్‌ ధరిస్తున్నారు. ఈ సమయంలో చౌటుప్పల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.

#1 సోషల్ సింగింగ్ యాప్! నేహా కక్కర్‌తో కలిసి పాడండి
ఈ ప్రమాదంలో బైక్‌పై కూర్చొని ఉన్న షారుఖ్‌ అక్కడిక్కడే చనిపోయాడు. అతడి స్నేహితుడు ఫయాజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ వలికి షారుఖ్ ఏకైక కుమారుడు. అతడి మరణంతో మస్తాన్ వలీ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.