Templates by BIGtheme NET
Home >> REVIEWS >> క్రాక్ రివ్యూ

క్రాక్ రివ్యూ


రవితేజ లాంటి మాస్ హీరోకి కథ ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు.. లవ్, కామెడీ, ఎమోషన్స్, హీరోయిజం, మాస్, యాక్షన్ వీటిలో ఏది తగ్గినా కూడా ఏదో వెలితిగానే ఉంటుంది. అయితే అంతకు ముందే బలుపు, డాన్ శీను చిత్రాలతో మాస్ రాజాలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ వాడేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి ‘క్రాక్’ సినిమాతో రవితేజ కెరియర్‌లో క్రాక్ పుట్టించే కథను అల్లాడు. ‘ఒక ‘క్రాక్’ పోలీస్ ఆఫీసర్.. ఇతను ముందు ఎవడైనా బ్యాగ్రౌండ్ పేరు ఎత్తితే క్రాక్ ఎక్కేస్తుంటుంది. ఎక్కడికి ట్రాన్స్ ఫర్ అయినా అక్కడి లోకల్ నేరస్థులతో గొడవ.. వాళ్ల భరతం పట్టి బొక్కలో వేయడం.. కడప, కర్నూల్, ఒంగోలు ఈ మూడు సిటీలలో ముగ్గురు నేరస్థుల భరతం ఎలా పట్టాడన్నదే ఈ సినిమా స్టోరీ లైన్. కాన్సెప్ట్ రొటీన్‌గానే ఉన్నా.. డిఫరెంట్ నెరేషన్‌తో సినిమాపై ఆసక్తికలిగించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గుర్ని తోపుల్ని తొక్కి తాటతీస్తాయి.. కామన్ పాయింట్ ఏంటి అంటే.. ఈ ముగ్గురితో ఆడుకున్నది ఒకే పోలీసోడు వాడే ‘పోతరాజు వీర శంకర్’.

క్రాక్ కథ:

సలీమ్ (చిరాగ్ జానీ) దేశంలోనే కరుడుకట్టిన తీవ్రవాది.. ఇతన్ని పట్టుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తుండగా.. కర్నూల్ ఎస్ ఐగా ఉన్న పోతరాజు వీర శంకర్ (శంకర్) అతన్ని చాకచక్యంగా పట్టుకుంటాడు. యాభై రూపాయల నోటు కోసం సలీమ్.. శంకర్‌కి చిక్కుతాడు. ఎలా అన్నది తెరపై చూస్తేనే కిక్కు. ఇక రెండో నేరస్తుడు కడప రెడ్డి (రవి శంకర్) కడపలోనే ఫ్యాక్షన్ లీడర్.. ఇతడు కూడా ఒక మామిడికాయ నేపథ్యంలో సీఐగా ప్రమోట్ అయిన శంకర్‌కి చిక్కుతాడు. మూడో నేరస్థుడు మోస్ట్ డేంజరస్.. అతడే కటారి కృష్ణ (సముద్రఖని). ఒంగోలులో ఇతను చేయని నేరం అంటూ ఉండదు. చట్టం కళ్లుకప్పి పెద్ద మనిషిగా చలామణీ అవుతాడు. సిటీలో చాకులా ఉండే కటారి కృష్ణను బోకులా చేసి.. ఒక్క మేకు సాయంతో కటకటాల వెనక్కి పంపుతాడు శంకర్. ఇంతకీ ఆ మామిడికాయ ఏంటి?? యాభై రూపాయల నోటి ఏంటి?? మేకు ఏంటి?? ఈ మూడింటి నేపథ్యం ఏంటి అన్నదే క్రాక్ సినిమా అసలు కథ.

పండగ.. మాస్ రాజా అభిమానులకు అసలుసిసలు పండగ అంటే ఈ ‘క్రాక్’ సినిమానే. రవితేజను అభిమానులు ఎలా చూడాలని ఆశపడుతుంటారో దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ రేంజ్‌లో చూపించారు. పోతరాజు వీర శంకర్‌గా రవితేజ విశ్వరూపం చూపించాడు. ఇది ‘డీజే కాదు.. ఓజే ఒంగోలు జాతర’ అని అన్నట్టుగానే ‘క్రాక్’ పోలీసోడి కిక్ ఎలా ఉంటుందో చూపించారు రవితేజ. ఉడుకురక్తంతో ఉన్న పాతికేళ్ల కుర్రాడికి పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో రవితేజ అలా అనిపించారు. ఫుల్ ఎనర్జీతో పవర్ ఫుల్ యాక్షన్‌తో అదరగొట్టాడు. మాస్ రాజా డాన్స్‌తో అలరించాడు. క్రాక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. రవితేజ ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలారోజుల తరువాత మాస్ మహరాజా ఫుల్ లెంగ్త్ ఎనర్జీతో ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా కేక పుట్టిస్తూ.. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు రవితేజ. తన డైలాగ్ డెలివరీతో మాస్ ఆడియన్స్‌కి విందు భోజనం అందించాడు. తిక్క పోలీసోడుగా అదరగొట్టాడు రవితేజ.

ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని.. మాస్ రాజా రవితేజ‌లో ఉన్న మాస్ ఎలిమెంట్స్‌ని ఫుల్‌గా వాడుకుని ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు. ఈ సినిమా కథ రొటీన్ అనిపించినా.. మాస్ ఎలిమెంట్స్‌తో డిఫరెంట్ ప్రజెంటేషన్ చేశారు. రవితేజ కోసమే ఈ కథ అన్నట్టుగా ఆయన్ని చూపించారు. బలుపు, డాన్ శీను చిత్రాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా టేకింగ్‌తో మరో మెట్టు ఎక్కాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా చాలా రేసీగా ఉంటుంది.. రొటీన్ కథను ఎక్కడా బోర్ కొట్టించకుండా నెక్స్ట్ ఏమౌతుంది అన్న రీతిలో కథ పక్కదారి పట్టకుండా గ్రిప్పింగ్‌గా ముందుకు నడిపించారు. ఈ సినిమాకి పాత్రల ఎంపికకు దర్శకుడికి మంచి మార్కులు వేయొచ్చు. కటారి క్రిష్ణ పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చి దిద్దారు.

హీరోయిన్ శృతి హాసన్‌.. క్రాక్ పోలీసోడు భార్య కళ్యాణిగా మెస్మరైజ్ చేసింది. ఫస్టాఫ్‌లో హీరోకి హీరోయిన్ ఉండాలి.. అందుకే ఈ పాత్రే అన్నట్టుగానే ఉన్నా.. సెకండాఫ్‌లో ఆమెకు అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఇచ్చి మైండ్ బ్లాక్ చేశాడు దర్శకుడు. శృతి హాసన్ కెరియర్‌లోనే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. శృతి హాసన్‌ గ్లామర్‌తో పాటు.. యోగా, కరాటే ఇలా ఆమెలో ఉన్న మల్టీటాలెంట్‌ని ఫుల్‌గా ఉపయోగించుకున్నాడు దర్శకుడు. ఆమె క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సెకండాఫ్‌లో శృతి హాసన్‌ ఫైట్ సినిమాకే హైలైట్. కరాటే విన్యాసాలతో విలన్లను వీర కుమ్ముడు కుమ్మేసింది. ఆమె ఫ్లాష్ బ్యాగ్ తెరపై చూస్తే సర్ ప్రైజ్‌గా అనిపిస్తుంది. పోకిరి సినిమాలో మహేష్ బాబు రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందామెకు.

ఇక కటారి కృష్ణగా వైవిధ్య పాత్రలో కనిపించారు సీరియర్ నటుడు సముద్రఖని. చాలా సీన్లలో భయపెట్టేశాడు. ఇతని క్యారక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా చూపించాడు దర్శకుడు. కటారి కృష్ణ సెటప్‌గా జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగులో ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి పాత్ర పడింది.

యువ నటుడు సుధాకర్, హ్యాపీడేస్ వంశీలకు ఈ సినిమాలో మంచి పాత్రలు లభించాయి. వీరికి రవితేజ కాంబినేషన్‌లో సీన్లు బాగా వచ్చాయి. కానిస్టేబుల్‌గా నటించిన సుధాకర్ ఉన్నంతలో చాలా బాగా చేశాడు. కథలో ఇతనికి కీ రోల్ ఉంది.

ఈ సినిమాలో మూవీ క్రిటిక్ మహేష్ పాత్రను ఫన్నీగా చూపించాడు దర్శకుడు. కనిపించింది రెండు మూడు సీన్లే అయినా అయి బాగా పేలాయి. కత్తి మహేష్‌ని రవితేజ పిచ్చకొట్టుడు కొట్టే సీన్‌ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. కులం కులం అంటూ మీడియా ముందు హంగామా చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు కత్తి.

దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు ఈ చిత్రంలో రవితేజకు కొడుకుగా నటించి నవ్వులు పూయించాడు. ‘నాన్నా.. రాత్రి బెడ్ రూంలో పడుకుంటున్నా.. ఉదయానికి హాల్‌లోకి ఎలా వస్తున్నా’ అంటూ అడిగే సీన్లకు రవితేజ రియాక్షన్‌కి థియేటర్స్‌లో నవ్వులు కురిశాయి. ఇది ప్రతి ఇంట్లో ఉండే సరదా ఇష్యూ కావడంతో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేశారు.

వీరితో పాటు కమెడియన్ అలీ ఉన్నాడు కానీ.. ఒకే ఒక్క సీన్‌లో ఇలా వచ్చి అలా వెళ్లాడు.. ఆ సీన్ కూడా పెద్దగా పండలేదు. వీరితో పాటు ఈ సినిమాలో స్క్రీన్ నిండా నటీనటులే కనిపిస్తారు. భారీ తారాగణం ఉంది. అలీ, చమ్మక్ చంద్ర, చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్, జోష్ రవి, సద్దాం, రియాజ్, దుర్గారావు జోడీ ఇలా చాలామంది నటీనటులు కనిపించారు. అప్సర రాణి ఐటమ్ సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌కి కనువిందు చేసింది.

ఇక సినిమాకి ప్రధాన బలం మాస్ రాజా రవితేజ అయితే.. దర్శకుడు ఎంచుకున్న టెక్నీషియన్స్ ఈ కథకు ప్రాణం పోశారు. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. వేటపాలెం నేపథ్యంలో హత్యలు అక్కడి మనుషులు.. గాడిద రక్తం తాగడం.. వీటన్నింటి నేపథ్యంలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్స్ అయ్యాయి విపరీతమైన హింస, రక్తపాతం కాస్త ఇబ్బందిగానే అనిపించినా.. ఫైట్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఒంగోలు బస్టాండ్ ఫైట్.. క్లైమాక్స్‌లో బీచ్ ఫైట్.. హీరోయిన్ ఫైట్ బాగా వచ్చాయి.

ఇక తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. రవితేజ ఎలివేషన్స్ షాట్స్‌కి తమన్ అందించిన ఆర్ ఆర్ అదిరింది. క్రాకూ.. క్రాకూ.. అంటూ వచ్చే ఆర్ ఆర్ మళ్లీ మళ్లీ అనేట్టు చేసింది. బూమ్ బద్దల్.. భలేగా తగిలావే బంగారం.. కోర మీసం పోలీసోడా .. బిరియానా సాంగ్స్‌ బాగా వచ్చాయి.. థియేటర్స్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

కె.జి విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. రవితేజను పోలీస్ ఆఫీసర్‌గా బాగా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో తన కెమెరా పనితనం చూపించి మంచి విజువలైజేషన్ అందించారు విష్ణు.

బుర్రా సాయి మాధవ్ డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. మాస్ రాజా రవితేజకు మంచి పవర్ ఫుల్ డైలాగ్‌లు పడ్డాయి. ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా. ఊర మాస్ డైలాగ్‌లు మాస్ రాజా చెప్తుంటే థియటర్లలో విజిల్స్ మోత మోగింది. నవీన్ నూలి ఎడిటింగ్.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్.. స్వేత, నీరజ్ కోనా క్యాస్ట్యూమ్స్ అన్నీ ‘క్రాక్’కి బాగా కుదిరాయి.

ఇక ‘క్రాక్’ కథకి బీటలు కొట్టే మైనస్‌‌లు పెద్దగా ఏం లేవు కానీ.. మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని కథ అల్లినట్టుగా అనిపిస్తుంది. ఆ కోణంలో కొంతమందికి రొటీన్ కథలా అనిపించవచ్చు. ఎక్కువ హింస, రక్తపాతం కనిపిస్తుంది. రవితేజ ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడంతో పెద్దగా వైవిధ్యం లేనట్టుగానే అనిపించవచ్చు.

చివరిగా.. క్రాక్ సినిమా మాస్ ఆడియన్స్‌కి విందు భోజనం.. ఇక మాస్ రాజా ఫ్యాన్స్‌కి అయితే పూనకం. సినిమా ప్రియులకు మంచి వినోదం, మంచి మసాలా ఎంటర్ టైన్మెంట్. పండుగ పూట ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌కి వెళ్లాలనుకునే వాళ్లకి ‘క్రాక్’ సినిమా ఫ్యామిలీ పటాకా.

రవితేజ లాంటి మాస్ హీరోకి కథ ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు.. లవ్, కామెడీ, ఎమోషన్స్, హీరోయిజం, మాస్, యాక్షన్ వీటిలో ఏది తగ్గినా కూడా ఏదో వెలితిగానే ఉంటుంది. అయితే అంతకు ముందే బలుపు, డాన్ శీను చిత్రాలతో మాస్ రాజాలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ వాడేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి ‘క్రాక్’ సినిమాతో రవితేజ కెరియర్‌లో క్రాక్ పుట్టించే కథను అల్లాడు. ‘ఒక ‘క్రాక్’ పోలీస్ ఆఫీసర్.. ఇతను ముందు ఎవడైనా బ్యాగ్రౌండ్ పేరు ఎత్తితే క్రాక్ ఎక్కేస్తుంటుంది. ఎక్కడికి ట్రాన్స్ ఫర్ అయినా అక్కడి లోకల్ నేరస్థులతో గొడవ.. వాళ్ల భరతం పట్టి బొక్కలో వేయడం.. కడప, కర్నూల్, ఒంగోలు ఈ మూడు సిటీలలో ముగ్గురు నేరస్థుల భరతం ఎలా పట్టాడన్నదే ఈ సినిమా స్టోరీ లైన్. కాన్సెప్ట్ రొటీన్‌గానే ఉన్నా.. డిఫరెంట్ నెరేషన్‌తో సినిమాపై ఆసక్తికలిగించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గుర్ని తోపుల్ని తొక్కి తాటతీస్తాయి.. కామన్ పాయింట్ ఏంటి అంటే.. ఈ ముగ్గురితో ఆడుకున్నది ఒకే పోలీసోడు వాడే ‘పోతరాజు వీర శంకర్’. క్రాక్ కథ: సలీమ్ (చిరాగ్ జానీ) దేశంలోనే కరుడుకట్టిన తీవ్రవాది.. ఇతన్ని పట్టుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తుండగా.. కర్నూల్ ఎస్ ఐగా ఉన్న పోతరాజు వీర శంకర్ (శంకర్) అతన్ని చాకచక్యంగా పట్టుకుంటాడు. యాభై రూపాయల నోటు కోసం సలీమ్.. శంకర్‌కి చిక్కుతాడు. ఎలా అన్నది తెరపై చూస్తేనే కిక్కు. ఇక రెండో నేరస్తుడు కడప రెడ్డి (రవి శంకర్) కడపలోనే ఫ్యాక్షన్ లీడర్.. ఇతడు కూడా ఒక మామిడికాయ నేపథ్యంలో సీఐగా ప్రమోట్ అయిన శంకర్‌కి చిక్కుతాడు. మూడో నేరస్థుడు మోస్ట్ డేంజరస్.. అతడే కటారి కృష్ణ (సముద్రఖని). ఒంగోలులో ఇతను చేయని నేరం అంటూ ఉండదు. చట్టం కళ్లుకప్పి పెద్ద మనిషిగా చలామణీ అవుతాడు. సిటీలో చాకులా ఉండే కటారి కృష్ణను బోకులా చేసి.. ఒక్క మేకు సాయంతో కటకటాల వెనక్కి పంపుతాడు శంకర్. ఇంతకీ ఆ మామిడికాయ ఏంటి?? యాభై రూపాయల నోటి ఏంటి?? మేకు ఏంటి?? ఈ మూడింటి నేపథ్యం ఏంటి అన్నదే క్రాక్ సినిమా అసలు కథ. పండగ.. మాస్ రాజా అభిమానులకు అసలుసిసలు పండగ అంటే ఈ ‘క్రాక్’ సినిమానే. రవితేజను అభిమానులు ఎలా చూడాలని ఆశపడుతుంటారో దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ రేంజ్‌లో చూపించారు. పోతరాజు వీర శంకర్‌గా రవితేజ విశ్వరూపం చూపించాడు. ఇది ‘డీజే కాదు.. ఓజే ఒంగోలు జాతర’ అని అన్నట్టుగానే ‘క్రాక్’ పోలీసోడి కిక్ ఎలా ఉంటుందో చూపించారు రవితేజ. ఉడుకురక్తంతో ఉన్న పాతికేళ్ల కుర్రాడికి పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో రవితేజ అలా అనిపించారు. ఫుల్ ఎనర్జీతో పవర్ ఫుల్ యాక్షన్‌తో అదరగొట్టాడు. మాస్ రాజా డాన్స్‌తో అలరించాడు. క్రాక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. రవితేజ ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలారోజుల తరువాత మాస్ మహరాజా ఫుల్ లెంగ్త్ ఎనర్జీతో ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా కేక పుట్టిస్తూ.. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు రవితేజ. తన డైలాగ్ డెలివరీతో మాస్ ఆడియన్స్‌కి విందు భోజనం అందించాడు. తిక్క పోలీసోడుగా అదరగొట్టాడు రవితేజ. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని.. మాస్ రాజా రవితేజ‌లో ఉన్న మాస్ ఎలిమెంట్స్‌ని ఫుల్‌గా వాడుకుని ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు. ఈ సినిమా కథ రొటీన్ అనిపించినా.. మాస్ ఎలిమెంట్స్‌తో డిఫరెంట్ ప్రజెంటేషన్ చేశారు. రవితేజ కోసమే ఈ కథ అన్నట్టుగా ఆయన్ని చూపించారు. బలుపు, డాన్ శీను చిత్రాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా టేకింగ్‌తో మరో మెట్టు ఎక్కాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా చాలా రేసీగా ఉంటుంది.. రొటీన్ కథను ఎక్కడా బోర్ కొట్టించకుండా నెక్స్ట్ ఏమౌతుంది అన్న రీతిలో కథ పక్కదారి పట్టకుండా గ్రిప్పింగ్‌గా ముందుకు నడిపించారు. ఈ సినిమాకి పాత్రల ఎంపికకు దర్శకుడికి మంచి మార్కులు వేయొచ్చు. కటారి క్రిష్ణ పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చి దిద్దారు. హీరోయిన్ శృతి హాసన్‌.. క్రాక్ పోలీసోడు భార్య కళ్యాణిగా మెస్మరైజ్ చేసింది. ఫస్టాఫ్‌లో హీరోకి హీరోయిన్ ఉండాలి.. అందుకే ఈ పాత్రే అన్నట్టుగానే ఉన్నా.. సెకండాఫ్‌లో ఆమెకు అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఇచ్చి మైండ్ బ్లాక్ చేశాడు దర్శకుడు. శృతి హాసన్ కెరియర్‌లోనే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. శృతి హాసన్‌ గ్లామర్‌తో పాటు.. యోగా, కరాటే ఇలా ఆమెలో ఉన్న మల్టీటాలెంట్‌ని ఫుల్‌గా ఉపయోగించుకున్నాడు దర్శకుడు. ఆమె క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సెకండాఫ్‌లో శృతి హాసన్‌ ఫైట్ సినిమాకే హైలైట్. కరాటే విన్యాసాలతో విలన్లను వీర కుమ్ముడు కుమ్మేసింది.…

క్రాక్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.3

క్రాక్ రివ్యూ

క్రాక్ రివ్యూ

User Rating: 3.7 ( 1 votes)
3