Templates by BIGtheme NET
Home >> REVIEWS >> కృష్ణ అండ్ హిజ్ లీల రివ్యూ

కృష్ణ అండ్ హిజ్ లీల రివ్యూ


చిత్రం : ”కృష్ణ అండ్ హిజ్ లీల”
నటీనటులు : సిద్ధు జొన్నలగడ్డ – శ్రద్ధా శ్రీనాధ్ – సీరత్ కపూర్ – షాలిని వడ్నికట్టి – వైవా హర్ష – ఝాన్సీ – సంపత్ రాజ్- సంయుక్త తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం : షానియేల్ డియో & సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
నిర్మాత : సురేష్ ప్రొడక్షన్స్ & వయాకామ్ 18 స్టూడియోస్
రచన : రవికాంత్ పేరేపు & సిద్ధు జొన్నలగడ్డ
దర్శకత్వం : రవికాంత్ పేరేపు

‘క్షణం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ ని తెలుగు సినీ ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ రవికాంత్ పేరేపు నుండి నాలుగేళ్ళ తర్వాత విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో సినిమాలను డైరెక్ట్ ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని దగ్గుబాటి రానా సమర్పిస్తుడటం.. అందులోనూ ఈ మధ్య రిలీజైన ట్రైలర్స్ కూడా ఆకట్టుకోవడం.. ‘క్షణం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రవికాంత్ నుండి వస్తున్న సినిమా కావడంతో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అంటూ ఓటీటీలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…!

కథ : కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) చిన్నప్పుడే అమ్మా(ఝాన్సీ) – నాన్న(సంపత్ రాజ్ ) విడిపోవటంతో తల్లి దగ్గరే తన చెల్లితో కలిసి పెరుగుతాడు. చిన్నప్పుడే తండ్రి పెంపకానికి దూరమై ఒకింత అభద్రతాభావం మరియు కన్ఫూజన్ తో ఉండే కృష్ణ కాలేజ్ డేస్ లో సత్య(శ్రద్ధా శ్రీనాథ్) ని లవ్ చేస్తాడు. కొన్నాళ్ల ప్రేమాయణం తర్వాత కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోతారు. సత్యతో బ్రేక్ వలన కొంతకాలం బాధపడిన కృష్ణ తన కాలేజీలో ఫైనల్ ఇయర్ లో జాయిన్ అయిన రాధా(షాలిని) ప్రేమలో పడతాడు. వారి మధ్య ఉన్న రిలేషన్ పై ఒక క్లారిటీ వస్తున్న సమయంలో కృష్ణ కి బెంగుళూరులో జాబ్ వస్తుంది. అక్కడకు వెళ్లిన కృష్ణకు అనుకోకుండా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సత్య కనిపిస్తుంది. ఈ క్రమంలో సత్య మరలా కృష్ణకు క్లోజ్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ సిన్సియర్ గా లవ్ చేసిన కృష్ణ ఇద్దరినీ బాధ పెట్టకుండా సత్య – రాధ లతో ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు. ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తున్న కృష్ణ లవ్ స్టోరీ ఎలా ముగిసింది.. తన చెల్లి రూమ్ మేట్ అయిన రుక్సార్ (సీరత్ కపూర్) కృష్ణ లైఫ్ లో ఎలాంటి రోల్ ప్లే చేసింది అనేది మిగతా స్టోరీ.

కథనం – విశ్లేషణ : ”ఈ కథలో ఉన్న పాత్రలు పరిస్థితులు ఎవరినో ఉద్దేశించినవి కాదు. అన్నీ నాకు జరిగినవే. ఒకవేళ మీకేమన్నా పోలిక కనిపిస్తే కంగారు పడొద్దు” అని కృష్ణ పాత్రధారి తనని తాను పరిచయం చేసుకుంటూ స్టోరీ రాస్తున్నట్లు ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో గతంలోకి తీసుకెళ్లి మొదటి ఐదు నిమిషాల్లోనే తన ఫస్ట్ లవ్ బ్రేకప్ ని చూపిస్తారు. ఆ తర్వాత మనోవేదనకు గురైన కృష్ణ తాను సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకొని మూవ్ ఆన్ అయిపోతాడు. అదే సమయంలో తాను చదివే కాలేజీలో జాయిన్ అయిన అమ్మాయిలో ప్రేమలో పడటంతో ఈ జనరేషన్ యువత ప్రేమ విషయంలో ఎలా ఉంటున్నారో చెప్పడం స్టార్ట్ చేసాడు డైరెక్టర్.

ఇక ఉద్యోగ రీత్యా వేరే స్టేట్ కి వెళ్లిన కృష్ణ తన చెల్లి రూమ్ మేట్ ని చూసిన వెంటనే ఆమెకు అట్రాక్ట్ అయిపోతాడు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు కృష్ణ. అదే సమయంలో అనుకోకుండా తారసపడిన తన మాజీ లవర్ ని చూసి షాక్ తిన్న కృష్ణ మళ్ళీ ఆమెతో టచ్ లోకి వస్తాడు. ఇలా ఎవరిని లవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోలేని కన్ఫూజన్ లో ఉంటాడు కృష్ణ. దీంతో తను ప్రస్తుతం ప్రేమిస్తున్న అమ్మాయితో క్రమక్రమంగా మాట్లాడటం తగ్గిస్తూ వస్తాడు. అయితే కృష్ణ మాత్రం రాధ ని సిన్సియర్ గా లవ్ చేస్తూనే ఉంటాడు. ఒకానొక దశలో సత్యతో మళ్ళీ మాట్లాడుతున్నాడని తెలుసుకున్న రాధ సిద్ధూకి బ్రేకప్ చెప్పేస్తుంది.

ఈ నేపథ్యంలో సత్య – కృష్ణ ఒకరినొకరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో మళ్ళీ తిరిగొచ్చిన రాధ తాను మన బ్రేకప్ తర్వాత ప్రగ్నెంట్ అని తెలిసిందని.. అప్పటి నుండి నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో తెలుసుకున్నానని.. నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడిస్తుంది. నిజానికి కృష్ణ సత్యతో తన రిలేషన్ గురించి చెప్పడానికే రాధని మీట్ అవుతాడు. కానీ ఆమె చెప్పిన విషయాలు విన్న తర్వాత మళ్ళీ రాధ పై ఉండే ప్రేమ గుర్తొస్తుంది.

ఇక అప్పటి నుండి ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ మైంటైన్ చేస్తూ.. ఇద్దరినీ బాధ పెట్టకుండా ఉండటానికి ట్రై చేస్తూ.. సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అనే క్లారిటీకి వచ్చేస్తాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో మనం ఎన్నో తెలుగు తమిళ హిందీ సినిమాలు చూసేసాం అనే ఫీలింగ్ వస్తుంది. అయితే దర్శకుడు ఆ ఫీలింగ్ ని బయటపడేసేలా సన్నివేశాలతో.. ఈ తరం యువతీ యువకుల సంభాషణలతో.. రొమాంటిక్ సీన్స్ తో ముందుకు నడిపించాడు. అయితే ఇలా కథనం సాగుతూ తన చెల్లి పెళ్ళిలో ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో హీరో ఇబ్బందులు ఎదుర్కోవడం.. వాటి నుండి రుక్సార్ కాపాడటం.. ఈ మధ్యలో తను హేట్ చేసే తండ్రి చెల్లి పెళ్ళికి రావడం జరిగిపోతాయి.

అయితే కొడుకు లవ్ విషయంలో కన్ఫూజన్ లో గుర్తించి లైఫ్ లో గిల్టీతో బ్రతికే పరిస్థితి తెచ్చుకోవద్దని.. తన జీవితంలా మారే పరిస్థితి తెచ్చుకోవద్దని సలహా ఇస్తాడు. దీంతో ఇద్దరు హీరోయిన్స్ ని పిలిచి విషయం బయటపెట్టేస్తాడు హీరో. ఇద్దరినీ సిన్సియర్ గా ప్రేమిస్తున్నానని.. ఇద్దరిలోను తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయని వారితో చెప్పేస్తాడు. ఇక ఆ తర్వాత పాత సినిమా తీరుగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి కథకు ఒక ఎండింగ్ ఇచ్చి ఈ మోడ్రన్ లవ్ స్టోరీని ముగించాడు డైరెక్టర్. మొత్తం మీద మనం ఎప్పటి నుండో చూస్తున్న స్టోరీ లైన్ ని డైరెక్టర్ ఎన్నుకున్నప్పటికీ పాత్రల తీరుతెన్నులు.. నేటితరం ఇష్టపడే సన్నివేశాలు సంభాషణలతో డైరెక్టర్ హోమ్ స్క్రీన్ మీద ఫార్వర్డ్ చేయకుండా ఈ సినిమాని చూసేలా రూపొందించాడు. ఈ మధ్య ఓటీటీలలో రిలీజ్ అవుతున్న చిత్రాలతో పోల్చుకుంటే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ రిలీఫ్ కలిగించే సినిమా అని చెప్పవచ్చు.

నటీనటులు : ‘గుంటూరు టాకీస్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు ఈ సినిమాలో ఇద్దరమ్మాయిలను సిన్సియర్ గా లవ్ చేసే కన్ఫ్యూస్డ్ కుర్రాడిగా నటించి అలరించాడు. రొమాన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూర్ యాక్టింగ్ చూపించి కృష్ణ పాత్రకి కంప్లీట్ న్యాయం చేసాడు. ఇక ‘జెర్సీ’ సినిమాతో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ మరోసారి తన మ్యాజిక్ చూపించింది. అంతేకాకుండా శ్రద్ధా ఈ సినిమాలో ప్రాక్టికల్ గా ఆలోచించే ఈ జెనరేషన్ అమ్మాయిలా ఉండటంతో పాటు మందు సిగరెట్ తాగే సన్నివేశాలలో కూడా నటించింది.

ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటించి సిద్ధూ తో కెమిస్ట్రీ బాగా పండించింది. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన షాలిని రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న నటిగా యాక్ట్ చేసింది. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకునే అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. వీరితో పాటు సీరత్ కపూర్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి అలరించింది. మెచ్యూర్డ్ అమ్మాయిలా ఆలోచిస్తూ సిద్ధూకు తన లవ్ మీద క్లారిటీ కలిగించే పాత్రలో మెప్పించిందనే చెప్పవచ్చు. వైవా హర్ష – ఝాన్సీ – సంపత్ రాజ్ – సంయుక్త లు ఉన్నంతలో బాగా నటించారు. సీనియర్ నటుడు సంపత్ రాజ్ ని ఒకటి రెండు సీన్స్ కి పరిమితం చేయకుండా ఇంకా వాడుకుంటే బాగుండేది.

సాంకేతిక వర్గం : ‘క్షణం’ సినిమాతో సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకున్న రవికాంత్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో తాను అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఈ జెనరేషన్ యువతీ యువకుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి.. ఇద్దరమ్మాయిలను సిన్సియర్ గా ప్రేమించే యువకుడి మైండ్ లో ఉండే కన్ఫూజన్ ని.. ఇద్దరినీ బాధ పెట్టకుండా వారితో ఆ పాత్ర బిహేవియర్ ని క్లారిటీగా చూపించడంలో రవికాంత్ సక్సెస్ అయ్యాడు. ఓల్డ్ స్టోరీ లైన్ ని తీసుకొని తనదైన శైలిలో పాత్రలను డిజైన్ చేసుకొని.. సన్నివేశాలను రాసుకొని ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సినిమాకి ఆయువుపట్టు అయిన క్లైమాక్స్ పై దృష్టి పెట్టినట్లుగా అనిపించలేదు. అయితే హీరో తల్లిదండ్రులు మధ్య సన్నివేశాలు ఎమోషనల్ గా మార్చే స్కోప్ ఉన్నా డైరెక్టర్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ క్లైమాక్స్ కి తీసుకొచ్చాడు. అందుకే క్లైమాక్స్ లో పెద్దగా ఎమోషన్స్ కూడా పండించే అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద ‘క్షణం’ లాంటి సినిమా తీసిన రవికాంత్ ఇలాంటి జోనర్ సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్నాడు.

ఇక ఈ సినిమాకి రవికాంత్ మరియు సిద్ధూ కలిసి అందించిన మాటలు ఈ తరం జనాలు మాట్లాడుకునేలా ఇంగ్లీష్ – తెలుగు మరియు కొన్ని బూతులు కలబోసిన విధంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఆ మాటలు సన్నివేశాలు మరీ ఫ్యామిలీతో చూడలేము అనే విధంగా లేకపోవడంతో అందరూ వీటికి కనెక్ట్ అవుతారు. ఇక సురేష్ ప్రొడక్షన్ – వయాకామ్ స్టూడియోస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. షానియేల్ డియో మరియు సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా పనితనం చూపించారు. తమ సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ అందంగా చూపించడంతో పాటు రిచ్ గా కనిపించేలా చేసారు.

ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ లో పాల్గొన్న గ్యారీ – రవికాంత్ – సిద్ధూ సినిమాని ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. ఒకే పాయింట్ చుట్టూ తిరిగే ఓల్డ్ స్టోరీ లైనే కావడంతో సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపించకమానదు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం అద్భుతమని చెప్పవచ్చు. సినిమా స్టోరీలో భాగమయ్యేలా ఉన్న సాంగ్స్ తో పాటు సినిమా మూడ్ కి తగ్గట్లు శ్రీచరణ్ అందించిన నేపథ్య సంగీతం మంచి అనుభూతిని కలిగిస్తుంది.

చివరగా : ఈ మధ్య ఓటీటీలో రిలీజైన సినిమాల్లో బెస్ట్ మూవీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’

చిత్రం : ''కృష్ణ అండ్ హిజ్ లీల'' నటీనటులు : సిద్ధు జొన్నలగడ్డ - శ్రద్ధా శ్రీనాధ్ - సీరత్ కపూర్ - షాలిని వడ్నికట్టి - వైవా హర్ష - ఝాన్సీ - సంపత్ రాజ్- సంయుక్త తదితరులు సంగీతం : శ్రీచరణ్ పాకాల ఛాయాగ్రహణం : షానియేల్ డియో & సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు నిర్మాత : సురేష్ ప్రొడక్షన్స్ & వయాకామ్ 18 స్టూడియోస్ రచన : రవికాంత్ పేరేపు & సిద్ధు జొన్నలగడ్డ దర్శకత్వం : రవికాంత్ పేరేపు 'క్షణం' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ ని తెలుగు సినీ ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ రవికాంత్ పేరేపు నుండి నాలుగేళ్ళ తర్వాత విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో సినిమాలను డైరెక్ట్ ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని దగ్గుబాటి రానా సమర్పిస్తుడటం.. అందులోనూ ఈ మధ్య రిలీజైన ట్రైలర్స్ కూడా ఆకట్టుకోవడం.. 'క్షణం' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రవికాంత్ నుండి వస్తున్న సినిమా కావడంతో 'కృష్ణ అండ్ హిజ్ లీల' పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అంటూ ఓటీటీలో విడుదలైన 'కృష్ణ అండ్ హిజ్ లీల' విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...! కథ : కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) చిన్నప్పుడే అమ్మా(ఝాన్సీ) - నాన్న(సంపత్ రాజ్ ) విడిపోవటంతో తల్లి దగ్గరే తన చెల్లితో కలిసి పెరుగుతాడు. చిన్నప్పుడే తండ్రి పెంపకానికి దూరమై ఒకింత అభద్రతాభావం మరియు కన్ఫూజన్ తో ఉండే కృష్ణ కాలేజ్ డేస్ లో సత్య(శ్రద్ధా శ్రీనాథ్) ని లవ్ చేస్తాడు. కొన్నాళ్ల ప్రేమాయణం తర్వాత కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోతారు. సత్యతో బ్రేక్ వలన కొంతకాలం బాధపడిన కృష్ణ తన కాలేజీలో ఫైనల్ ఇయర్ లో జాయిన్ అయిన రాధా(షాలిని) ప్రేమలో పడతాడు. వారి మధ్య ఉన్న రిలేషన్ పై ఒక క్లారిటీ వస్తున్న సమయంలో కృష్ణ కి బెంగుళూరులో జాబ్ వస్తుంది. అక్కడకు వెళ్లిన కృష్ణకు అనుకోకుండా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సత్య కనిపిస్తుంది. ఈ క్రమంలో సత్య మరలా కృష్ణకు క్లోజ్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ సిన్సియర్ గా లవ్ చేసిన కృష్ణ ఇద్దరినీ బాధ పెట్టకుండా సత్య - రాధ లతో ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు. ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తున్న కృష్ణ లవ్ స్టోరీ ఎలా ముగిసింది.. తన చెల్లి రూమ్ మేట్ అయిన రుక్సార్ (సీరత్ కపూర్) కృష్ణ లైఫ్ లో ఎలాంటి రోల్ ప్లే చేసింది అనేది మిగతా స్టోరీ. కథనం - విశ్లేషణ : ''ఈ కథలో ఉన్న పాత్రలు పరిస్థితులు ఎవరినో ఉద్దేశించినవి కాదు. అన్నీ నాకు జరిగినవే. ఒకవేళ మీకేమన్నా పోలిక కనిపిస్తే కంగారు పడొద్దు'' అని కృష్ణ పాత్రధారి తనని తాను పరిచయం చేసుకుంటూ స్టోరీ రాస్తున్నట్లు ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో గతంలోకి తీసుకెళ్లి మొదటి ఐదు నిమిషాల్లోనే తన ఫస్ట్ లవ్ బ్రేకప్ ని చూపిస్తారు. ఆ తర్వాత మనోవేదనకు గురైన కృష్ణ తాను సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకొని మూవ్ ఆన్ అయిపోతాడు. అదే సమయంలో తాను చదివే కాలేజీలో జాయిన్ అయిన అమ్మాయిలో ప్రేమలో పడటంతో ఈ జనరేషన్ యువత ప్రేమ విషయంలో ఎలా ఉంటున్నారో చెప్పడం స్టార్ట్ చేసాడు డైరెక్టర్. ఇక ఉద్యోగ రీత్యా వేరే స్టేట్ కి వెళ్లిన కృష్ణ తన చెల్లి రూమ్ మేట్ ని చూసిన వెంటనే ఆమెకు అట్రాక్ట్ అయిపోతాడు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు కృష్ణ. అదే సమయంలో అనుకోకుండా తారసపడిన తన మాజీ లవర్ ని చూసి షాక్ తిన్న కృష్ణ మళ్ళీ ఆమెతో టచ్ లోకి వస్తాడు. ఇలా ఎవరిని లవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోలేని కన్ఫూజన్ లో ఉంటాడు కృష్ణ. దీంతో తను ప్రస్తుతం ప్రేమిస్తున్న అమ్మాయితో క్రమక్రమంగా మాట్లాడటం తగ్గిస్తూ వస్తాడు. అయితే కృష్ణ మాత్రం రాధ ని సిన్సియర్ గా లవ్ చేస్తూనే ఉంటాడు. ఒకానొక దశలో సత్యతో మళ్ళీ మాట్లాడుతున్నాడని తెలుసుకున్న రాధ సిద్ధూకి బ్రేకప్ చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలో సత్య - కృష్ణ ఒకరినొకరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో మళ్ళీ తిరిగొచ్చిన రాధ తాను మన బ్రేకప్ తర్వాత ప్రగ్నెంట్ అని తెలిసిందని.. అప్పటి…

కృష్ణ అండ్ హిజ్ లీల

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 2.75
సాంకేతిక వర్గం పనితీరు - 2.25
దర్శకత్వ ప్రతిభ - 2.75

2.6

కృష్ణ అండ్ హిజ్ లీల

కృష్ణ అండ్ హిజ్ లీల

User Rating: Be the first one !
3