Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఈ టీ తాగితే గుండెసమస్యలు, కాన్సర్, కరోనా కూడా రాదట..

ఈ టీ తాగితే గుండెసమస్యలు, కాన్సర్, కరోనా కూడా రాదట..


ఉల్లి.. ప్రతి ఒక్క కూరలో వాడతాం.. ఇది కేవలం వంటకు రుచి మాత్రమే కాదు.. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉల్లిలో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్స్ పెరుగుతాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు రెగ్యులర్‌గా ఉల్లిపాయలతో టీ చేసుకుని తాగితే చాలా మంచిది. దీని వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవ్వడమే కాకుండా శరీర అవయవాలు కూడా శుభ్రమవుతాయి. శరరంలో షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి.

ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలను తీసుకోవడం కాన్సర్ వంటి సమస్యలు చెబుతున్నారు నిపుణులు. అందుకే రోజుకి ఉల్లిపాయలను ఏదో ఓ రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. ప్రజెంట్ వర్షాల సీజన్ నడుస్తుంది. ఈ టైమ్‌లో జలుబు, జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటారు. ఈ టైమ్‌లోనూ ఉల్లిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక కరోనా వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వంటింట్లో దొరికే అనేక మసాల పదార్థాలతో పాటు.. ఉల్లిపాయలు కూడా ఉపయోగపడుతాయని చెబుతున్నారు. అందుకోసం ఉల్లిపాయలతో టీ చేసుకుని తాగొచ్చని చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.

దగ్గు, జలుబు ఉన్నవారు ఆనియన్ టీని తాగడం వల్ల ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. అలాగే జ్వరం కూడా తగ్గుతుంది. శ్వాస కోశ సమస్యలు ఈ టీ అద్భుతంగా పని చేస్తుంది. హైబీపీ ఉన్నవారు ఉల్లిపాయల టీని తాగితే బీపీ సమస్య తగ్గుతుంది..

గుండె సమస్యలకు చెక్..

ఉల్లిపాయల టీ తాగడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా రక్తసరఫరా తగ్గుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ కారణంగా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. గుండె సమస్యలకు చెక్ పెడుతుంది ఈ టీ. ఇన్ని లాభాలు ఉన్న ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు – ఒక కప్పు
వెల్లుల్లి – 4
బిర్యానీ ఆకు -2
తేనె – 4 స్పూన్లు
నీళ్లు – 3 కప్పులు

ఇలా తయారు చేసుకోండి…

ముందుగా ఓ గిన్నెలో నీళ్లు పోసి మరిగాక అందులో ఉల్లిపాయలు వేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి, బిర్యానీ ఆకులను వేసి ఆకులను మరిగించాలి. ఇలా మరిగి నీరు రంగు మారాక స్టౌవ్ ఆఫ్ చేయండి. ఇలా తయారైన టీ కాస్తా గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలపాలి. ఇలా గోరువెచ్చని టీని ఉదయాన్నే తీసుకోండి. ఇలా తాగుతుంటే షుగర్ కంట్రోల్‌లో ఉండడంతో పాటు అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. కరోనా వంటి సమస్యలు కూడా రావు.