Home / REVIEWS / మహేష్ రివ్యూ

మహేష్ రివ్యూ

Mahesh-Telugu-Movie-Review

Movie: Mahesh
Star cast: Sundeep Kishan, Dimple Chopade,
Producer: Suresh Kondeti,
Director: Gopi Sundar

 

మహేష్ రివ్యూ: చిత్రకథ
శివ(సందీప్ కిషన్) ఒక కాలేజ్ స్టూడెంట్. కానీ బాగా బద్దకస్తుడు, దద్దమ్మ, మతిమరుపు చవట. శివకి వసంత్(జగన్) క్లోజ్ ఫ్రెండ్. శివకి జగన్ చాలా విషయాల్లో సాయం చేస్తుంటాడు. శివ అదే కాలేజీలో చదువుతున్న సంధ్య(డింపుల్) ని చూసి ప్రేమలో పడుతుంది. సంధ్య కూడా శివని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఓ టిఫిన్ చేసిన ఉదయం శివ – సంధ్య మధ్య డాష్ డాష్ అవ్వడంతో సంధ్య పెళ్ళికి ముందే తల్లవుతుంది. ఆ తర్వాత శివకి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదే మన కథలో ట్విస్ట్. ఆ ట్విస్ట్ పేరు మహేష్. దాంతో మన హీరో శివ ఆ మహేష్ కోసం అన్వేషణ మొదలు పెడతాడు. అసలు ఈ మహేష్ ఎవడు? మహేష్ కి మన హీరోకి, మహేష్ కి హీరోయిన్ కి ఉన్న సంబంధం ఏమిటి? మహేష్ ని అన్వేషించడంలో శివ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనే విషయాలను తెలుసు కోవాలంటే మీరు వెండితెరపై మిగతా భాగం చూడాల్సిందే.

మహేష్ రివ్యూ: నటీనటుల ప్రతిభ
గత చిత్రాలతో పోలిస్తే సందీప్ కిషన్ చాలా పేలవమయిన ప్రదర్శన కనబరిచాడు. తమిళంలో మొదటి చిత్రం వలన కాబోలు అనవసర అప్రమత్తతతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. హీరోలానే తమిళ్ లో మొదటి సినిమా చేసిన డింపుల్ చోప్డ నటనతో జస్ట్ ఒకే అనిపించుకున్నా గ్లామర్ తో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఓ వైపు కథ కథనం ఆడేసుకుంటుంటే ప్రేక్షకుడికి దొరికే ఏకైక రిలీఫ్ జగన్, అతని కామెడీ టైమింగ్ మరియు నటన చాలా బాగున్నాయి. ఇంకా చాలా పాత్రలు ఉన్నా చెప్పుకునే స్థాయిలో ఒక్కటి కూడా లేవు.

మహేష్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

దర్శకుడిగా మదన్ కుమార్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సందీప్ కిషన్ వంటి నటుడి ఉండి కూడా పూర్తి స్థాయిలో నటన రాబట్టలేకపోయారు అంటే అయన పనితనం ఏ స్థాయిలో ఉందో అర్ధం అయిపోతుంది. ఎంచుకున్న కథ చాలా సింపుల్ గా ఉండటంతో మొత్తం కథనం మీద ఆధారపడవలసి వచ్చింది పోనీ కథనం అయినా కరెక్ట్ గా ఉందా అంటే మొదటి అర్ధ భాగం పర్వలేధనిపించినా రెండవ అర్ధ భాగంలో ఏదయితే సస్పెన్స్ అనుకున్నారో దాన్ని సస్పెన్స్ లా మెయింటెయిన్ చెయ్యలేకపోయాడు. డైలాగ్స్ బాగున్నాయి, ఆ ఒక్క విషయంలో డబ్బింగ్ సినిమా అనే ఫీల్ ఎక్కడ కనపడనివ్వలేదు. కానీ డబ్బింగ్ చెప్పించడంలో మాత్రం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. సంగీతం చిత్రానికి తగ్గట్టుగానే ఉంది కానీ మరీ ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో అయితే లేదు.

మహేష్ రివ్యూ: హైలెట్స్

  • సినిమాటోగ్రఫీ
  • జగన్ పాత్రతో చెప్పించిన కొన్ని అడల్ట్ కామెడీ డైలాగ్స్
  • ఓర్పుతో సెకండాఫ్ ని భరించడం

మహేష్ రివ్యూ: డ్రా బాక్స్

  • వీక్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
  • ఉన్న ఒక్క ట్విస్ట్ మీరు ఊహించదగినదే
  • కీలక విభాగాలే ఇంత వీక్ అయితే సినిమా వీక్ కాక ఏమవుతుంది. కావున మిగతా డ్రా బాక్స్ చెప్పకపోయినా మీరు అర్థం చేసుకుంటారు.. అది మాకు మాకు తెలుసు.. మీరు ఇంటెలిజెంట్స్.

మహేష్ రివ్యూ: విశ్లేషణ

సందీప్ కిషన్ హీరోగా తమిళ్ లో చేసిన మొదటి సినిమా. ఏదో తన మార్కెట్ పెంచుకోవడానికి, అలాగే నిర్మాతలు డబ్బింగ్ అంటే ఖర్చు తక్కువే కదా అని తీసిన ఈ సినిమాని డబ్ చేసారు. అది తప్పు లేదు కానీ ఇబ్బంది ఎక్కడంటే తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని డబ్ చేసి ఉంటె ఆడియన్స్ పెద్దగా బాధపడరు, అక్కడే అంతంత మాత్రంగా ఆడిన ఈ సినిమాని ఎందుకు డబ్ చేసినట్టు? ప్రేక్షకుల ప్రాణాలు తీయడానికి కాకపోతే.. ఇక సినిమా పరంగా వస్తే డైరెక్టర్ మదన్ కుమార్ సింపుల్ కాన్సెప్ట్ ని ఓ ట్విస్ట్ మరియు కాస్త గజిబిజి స్క్రీన్ ప్లే తో హిట్ కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగి స్క్రీన్ ప్లే కాస్తా గణేష్ నిమజ్జనంతో పాటు మన హుస్సేన్ సాగర్లో పడి కొట్టుకుపోవడంతో మదన్ దెబ్బైపోయాడు. ట్విస్ట్ ఏంటనేది ప్రేక్షకులు గెస్ చెయ్యడానికి వీలుగా ట్విస్ట్ కంటే ముందే కొన్ని సీన్స్ పెట్టడం వల్ల అ ట్విస్ట్ లో ఉండాల్సిన కిక్ కూడా గోవిందా గోవిందా.. అలాగే సినిమాలో చాలా క్లోజ్ షాట్ సీన్స్ ఉంటాయి. అందులో డైరెక్టర్ తప్పేమీ లేదు కానీ డబ్బింగ్ అవ్వడం వల్ల లిప్ సింక్ కి సీన్ కి అస్సలు సెట్ అవ్వకపోవడంతో ఆడియన్స్ కి చిరాకేస్తుంది. అలాగే కొంతమంది నటీనటులకు చెప్పిన డబ్బింగ్ కూడా సెట్ అవ్వకపోవడంతో చూస్తే సౌండ్ సిస్టం మనది ఎంజాయ్ మెంట్ పక్కింటోడిది అన్నట్టు ప్రేక్షకులు ఫీలవుతారు. గత కొన్ని వారాలుగా వస్తున్నా కొన్ని దారుణమైన డైరెక్ట్ తెలుగు సినిమాలే చూడటానికి కష్టంగా ఉన్న తరుణంలో ఇలా డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. సందీప్ కిషన్ నటన బాగుంటుంది, మంచి సినిమాలు చేసాడు కదా అని ఈ సినిమాకి వెళితే మీరు దెబ్బై పోతారు. ఒకవేళ సినిమా బాగుంటుంది అనుకోని వెళ్లి చూసినా సరే ఫలితా మాత్రం ఇదే. వచ్చే వారం రాబోయే డికె బోస్ సినిమాకి ఇదో వామప్ లా ఉపయోగపడే అవకాశం ఉంది.

మహేష్ రివ్యూ: చివరగా
మహేష్ – రుచీ పచీ లేని అడల్ట్ ఎంటర్టైనర్.. 🙁

Source: APH

 

 Mahesh Telugu Movie Review in English


Mahesh Telugu Movie Review,Mahesh Telugu Movie Rating,Mahesh Movie Review,Mahesh Movie Rating,Mahesh Review,Mahesh Rating, మహేష్ రివ్యూ

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top