Templates by BIGtheme NET
Home >> REVIEWS >> మనుషులతో జాగ్రత్త : రివ్యూ

మనుషులతో జాగ్రత్త : రివ్యూ


మనుషులతో జాగ్రత్త – చిత్ర కథ

అసలు కథ అనేదే లేదు. డైరెక్టర్ గోవింద్ వరహా ఏదో మెసేజ్ ఇచ్చే సినిమా తీద్దామనుకొని కథను మొదలు పెట్టి అసలు కథే లేకుండా ఆయనకు నచ్చిన కొన్ని సెన్స్ తో సినిమా తీసేసాడు. కథ ఏమీ లేకపోయినా ఓ రెండు గంటల 19 నిమిషాలు థియేటర్ లో మాకు టార్చర్ చూపెట్టారు కాబట్టి కాస్త కష్టమైనా చెబుతా..

రామరాజు(అక్షయ్ తేజ్) నీతిగా నిజాయితీగా ఉంటూ అందరూ అలానే ఉండాలను కుర్రాడు. అతని పెన్ చానల్ అనేదానిలో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు. ఇతనికి ముగ్గురు ఫ్రెండ్స్. నటరాజు – వీడికి అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేస్తే పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతాడు. కామరాజు – పేరులోనే కామం ఉంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీడు కాన్సెప్ట్ ఓన్లీ కామం. దొరబాబు – వీడు డబ్బు కోసం ఏమన్నా చేసే టైపు. నీతిగా నిజాయితీగా లేని ఈ లోకాన్ని చూసి విసుగెత్తిపోయిన రామరాజు చనిపోయి నరకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు (రాజేంద్రప్రసాద్) మీ లోకంలో మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నీతూ(సోనియా బిర్జీ) ని చూపిస్తాడు. దాంతో మన హీరో హీరోయిన్ ని ప్రేమించడానికి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆ తర్వాత జరిగింది? మీకు ఏమేమి చూపించి డైరెక్టర్ గోవింద్ వరహా టార్చర్ పెట్టాలనుకున్నాడు అనేది మీరు థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే..

మనుషులతో జాగ్రత్త – నటీనటుల ప్రతిభ

ఈ సినిమా పోస్టర్స్ లో రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ లాంటి వాళ్ళ ఫోటోలను వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు సినిమాలో ఉండేది చాలా తక్కువ టైం. వాళ్ళ నటన వరకు ఓకే. కానీ పాత్రలకే పెద్ద ప్రాముఖ్యత లేదు, సినిమాకి కూడా అవసరం లేదు. మిగతా వారి విషయానికి వస్తే హీరోగా చేసిన ఆదర్శ్ తేజ్ సినిమా మొత్తం మొహంలో కోపం ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు. ఎందుకో ప్రేక్షకులంటే అంత పగ. ఇక హీరోయిన్ సోనియా బిర్జీ ఎక్స్ ప్రెషన్స్, నటన గురించి మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్. సింపుల్ గా ఆ హీరోయిన్ కి దండేసి దండం పెట్టాలి. సినిమాలో హీరోకి ఫ్రెండ్స్ గా చేసిన వారిలో ఓవరాక్షన్ తప్ప యాక్షన్ కనపడలేదు.

మనుషులతో జాగ్రత్త – సాంకేతికవర్గం పనితీరు

సినిమాలో జస్ట్ పాస్ అయిన సాంకేతిక నిపుణులు అంటే సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్. వీరు మాత్రం పాస్ అయ్యారు మిగతా వారందరూ నెగటివ్ మార్క్స్ తెచ్చుకున్నారు. ఎడిటింగ్ చాలా చెత్తగా ఉంది. ఇక చివరిగా స్టైలిష్ గా కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వం అని గోవింద్ వరహా తన పేరు వేసుకున్నాడు. ముందుగా కథే లేని సినిమాకి పెద్ద పోటుగాడిలా నాది కథ అని పేరెందుకో.. సినిమాలో స్క్రీన్ ప్లే అనేది ఏం లేదు గోవింద్ వరహా ఫీల్ అయిన నాలుగు భూతు సీన్స్ ఒక్క మెసేజ్(అది మెసేజ్ ఏనా కాదు మెసేజ్ లాంటిది) సీన్ ని తీసేసి నచ్చినట్లుగా ఎడిటర్ చేత అతికించేసారు.

ఇక డైలాగ్స్ లో 100 భూతులుంటే 1 నీతి మాట ఉంటుంది. ఇలాంటి భూతు డైలాగ్స్ రాయడానికి గోవింద్ వరహానే ఎందుకు ఏ పల్లెటూరి నటుగాడైనా లేక భూతుల రాయుడైనా లేదా ఏ దారిన పోయే గన్నయ్య అయినా రాసేస్తాడు. ఇక చివరిగా డైరెక్షన్.. బాబు గోవింద్ వరహా మీకు డైరెక్షన్ చేతకాపోతే సినిమా పోస్టర్ లోనే ” మేము ఓ సినిమాని ఎంత చెత్తగా డైరెక్ట్ చెయ్యొచ్చో అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీసాం” అని బోల్డ్ లెటర్స్ విత్ కొటేషన్స్ లో వేసుకోండి. ఇలా ఎందుకు అన్నానంటే డైరెక్షన్ అంత చెత్తగా ఉంది.

మనుషులతో జాగ్రత్త – చిత్ర విశ్లేషణ

ఎక్కడి నుంచి ఎవరితో మొదలు పెట్టాలి.. సరే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ గోవింద్ వరహానే కాబట్టి నా అటాక్ ఫస్ట్ టు లాస్ట్ దాకా గోవింగ్ వరహా పైనే..బాండ్ బాజా బారత్ మొదలు పెడదామా మరి..

మొదట సినిమా టైటిల్స్ వెయ్యకముందే మంచి మనసుతో సినిమా చూడండి.. మంచి మనుషులుగా ఉండండి అని డైరెక్టర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మేము ఎంత పెద్ద మనసు చేసుకొని చూసినా సినిమాలో భుతూ తప్ప ఏమీ కనిపించలేదు మాస్టారు.. మీరు మంచి మనుషులుగా ఉంచడం కోసం ఈ సినిమా తీసినట్టు లేదు, భుతూని ఎంకరేజ్ చెయ్యండి, భూతే ప్రపంచం అన్నట్లు ఉంది. గోవింద్ వరహా మీకో సలహా.. మీర్ ఓ మెసేజ్ సినిమా తియ్యాలనుకుంటే దాని భూతు అనే అంశం చుట్టూనే తిప్పాల్సిన అవసరం లేదు. సినిమా అనేది కళాత్మక రంగం అంటారు మీకు చేతనైతే ఆ కళతో ప్రపంచానికి పనికొచ్చేది ఏదైనా చెప్పండి. అంతే కానీ బయట కనిపించే భుతూనే సినిమాగా తీయాల్సిన అవసరం లేదు, అలా తీసి చెడిపోయి ఉన్న సొసైటీని ఇంకా చెడగొట్టాల్సిన అవసరం లేదు.

ఇక ఈ సినిమాలో అనవసరంగా యమధర్మరాజు, యమలోకం సెట్ వేసారు. ఆ పాత్రల వల్ల, ఆ సెట్ వల్ల నిర్మాత జేబుకి చిల్లే తప్ప సినిమాకి ఒరిగిందేమీ లేదు. అలాగే బ్రహ్మ మనుషుల తలరాతలు రాయడానికి వీలుకాకపోవడంతో ఓ సాఫ్ట్ వేర్ కనిపెట్టడం, యముడు ఇంగ్లీష్ లో మాట్లాడటం, కృష్ణ భగవాన్ చిత్ర గుప్తుడుగా చేసిన భూతు అవతారం మరియు గూగుల్ వాడడం చిరాకు పెట్టిస్తాయి. దొంగ స్వాములని విపిలుగా చూపించడం, రాజకీయ నాయకులను స్వార్దపరులుగా చూపించడం, యూత్ పెడదారిన పట్టిన కొన్ని సీన్స్ ని చూపించడం లాంటివి లంగోటియా రోజుల నుంచి చూపిస్తున్నారు. మళ్ళీ ఇందులో ఏమి కొత్త ఉందని గోవింద్ వరహా చూపించాడో అనేది ఆ మాస్టారుకే తెలియాలి. సినిమాలో ఇన్ని పాయింట్స్ టచ్ చేసినా ఒక్క దానికి ముగింపు అనేదే లేదు.

మాములుగా సెన్సార్ బోర్డ్ ధనలక్ష్మి గారు ఎన్నో భూతులు, ఎన్నో మ్యూట్ చేసిన, భుతూ సీన్స్ ఉన్న సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ప్రపంచంలోని 8వ వింత అని చెప్పొచ్చు. ఇలాంటి చెత్త సినిమా తీసిన గోవింద్ వరాహా మీడియా, చానల్స్ అన్నీ లంచాల కోసం రన్ చేస్తున్నారని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అనేది మీడియా వారే అడగాలి.ఈ మధ్య పేరడీ చెయ్యడం అనేది కామన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా ఓ కమెడియన్ చేత రెండు సాంగ్స్ కి పనికిమాలిన స్టెప్స్ వేయిస్తే కామెడీ అనుకోవడం అంత బాడ్ న్కొకటి ఉండదు. గోవింద్ వరాహా ఎం.ఎస్ నారాయణతో చేయించిన స్పూఫ్ కూడా అలానే ఉంది. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ గోవింద్ వరాహానే, అలాగే సినిమా డిజాస్టర్ కావడానికి, నిర్మాత నెత్తిన గుడ్డ వేసుకోవడానికి కూడా గోవింద్ వరాహానే కారణం…

మాములుగా ఎలాంటి సినిమాకైనా ఏది ఏ జోనర్ కి సంబందించిన సినిమా అనేది చెప్పచ్చు. కానీ గోవింద్ వరాహా చూపించిన టాలెంట్ వల్ల ఈ సినిమా రొమాంటిక్/యూత్ ఫుల్/క్రైమ్/ సోషియో ఫాంటసీ/ మెసేజ్/ సెంటిమెంట్ ఇలా ఏ జోనర్ కి సంబదించిన సినిమానో చెప్పలేక పోతున్నాం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో గోవింద్ వరహా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి ఎన్ని రంగులు చూపించాడో.. ఇలాంటి సినిమాలకి మనుషులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.