Templates by BIGtheme NET
Home >> REVIEWS >> మ‌సాలా రివ్యూ

మ‌సాలా రివ్యూ


 

మ‌సాలా రివ్యూ

నటీనటులు:రామ్, వెంకటేష్, షాజన్‌పదంసి, అంజిలి, అలీ, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్‌.ఎస్‌.నారాయణ,పోసాని కృష్ణ మురళి, జె.పి, భరత్, కాదంబరి కిరణ్, రామ్‌జగన్, అనంత్, గీతాంజలి, కోవై సరళ, శ్రీలక్ష్మి తదితరులు
కథ: రోహిత్‌శెట్టి,
ఛాయాగ్రహణం: ఆండ్రూ,
కళ: ఏ.ఎస్.ప్రకాష్,
సంగీతం: తమన్‌
ఎడిటింగ్: ఎస్.ఆర్.వర్మ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ చైతన్య,
సమర్పణ: డి.సురేష్‌బాబు,
నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కె.విజయభాస్కర్.

రిమేక్ క‌థ అంటే… ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌, రేంచ్‌ల డ‌బ్బా, స్టెపినీ… ఇవ‌న్నీ ద‌గ్గర పెట్టుకొని మ‌రీ ప్రయాణం చేయ‌డం లాంటిది. ఎందుకంటే ఆ దారిలో ఏ గ‌తుకు ఎక్కడ ఎదుర‌వుతుందో ముందే తెలుసు. మ‌లుపులు తెలుసు. గెలుపుకు దారీ తెలుసు. కాబ‌ట్టి… నో రిస్క్‌. అందుకే వెంక‌టేష్ లాంటి హీరోలు మాట్లాడితే చాలు… రిమేక్ క‌థ‌ల వైపు చూస్తుంటారు. అలా చూస్తున్నప్పుడే ఆయ‌న చూపు ‘బోల్ బ‌చ్చన్‌’పై ప‌డింది. వెంట‌నే… ఆ సినిమా రీమేక్ చేయాల్సిందే అని ప్రతిన బూనారు. పైగా వెంకీ శైలికి స‌రితూగిన క‌థ‌. ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేయొచ్చు. అందుకే మ‌రో రీమేక్ మ‌న ముందుకు మ‌సాలా రూపంలో వ‌చ్చింది. మరి వెంకీ ఆలోచ‌న‌లు నిజ‌మ‌య్యాయా..? ఆయ‌న జ‌ర్నీ సేఫ్ గా సాగిందా?? తెలుసుకోవాలంటే వెంకీ, రామ్ నూరిన మ‌సాలా ఎలా ఉందో టేస్ట్ చేయాల్సిందే.

రెహ‌మాన్‌ (రామ్‌) సానియా (అంజ‌లి) పేగు తెంచుకొని పుట్టారు. చుట్టూ బోలెడ‌న్ని క‌ష్టాలు. రామ్‌ కి ఉద్యోగం లేదు. వాళ్ల ఆస్తి వ్యవ‌హారాలు యేళ్ల త‌ర‌బ‌డి న్యాయ స్థానంలో న‌లుగుతోంది. ఇక ఊర్లో బ‌త‌క‌డం క‌ష్టమైపోతుంది. అందుకే సొంత ఊరు వ‌దిలి.. బ‌ల‌రామ్ ( వెంక‌టేష్‌) ఊర్లో అడుగుపెడ‌తారు. బ‌ల‌రామ్ ఆ ఊరికి పెద్ద‌. ఆయ‌న ద‌గ్గర ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఆశ‌. అనుకోకుండా రెహ‌మాన్ త‌న‌ని రామ్‌ గా ప‌రిచ‌యం చేసుకోవ‌ల‌సి వ‌స్తుంది. ఓ ముస్లిం… హిందువుగా చ‌లామ‌ణి అవుతాడు. అయితే రెహ‌మాన్‌ ని ఓసారి మ‌జీద్‌ లో చూస్తాడు. `అత‌ను రెహ‌మాన్‌, నేను రామ్‌.. మేమిద్దం అన్నాద‌మ్ములం` అంటూ మ‌రో అబ‌ద్ధం ఆడాల్సివ‌స్తుంది. దాంతో రెహ‌మాన్ లో రెండో రూపం తెర‌పై కొస్తుంది. అటు రెహమాన్‌ గా, ఇటు రామ్‌ గా ఎలా నెట్టుకురాగ‌లిగాడు? ఈ చిక్కు ముడులు ఎలా విప్పాడు? అనేదే మ‌సాలా క‌థ‌.

నిజానికి బోల్‌ బ‌చ్చన్ కొత్త క‌థేం కాదు. నాలుగైదు తెలుగు సినిమాల్ని చూసి హిందీలో తీస్తే… రైట్స్ మ‌నం కొనుక్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఉన్న క‌థ‌ని మ‌క్కీకి మ‌క్కీ తెలుగులో దించేయ‌డానికి కృషి చేశాడు విజ‌య‌భాస్కర్‌. ఇలాంటి లైన్ డీల్ చేయ‌డం, దానికి కామెడీ సొబ‌గులు అద్దడం ఆయ‌న‌కు తెలిసిన విద్యే. బోల్ బ‌చ్చన్ చూడ‌క‌పోతే.. ఇది తెలుగు సినిమానే అనిపిస్తుంది. తెలుగు వాతావ‌రణానికి అనుగుణంగా క‌థ‌ను దింప‌డంలో ద‌ర్శకుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. మ‌రి విజ‌య‌భాస్కర్ సొంత ముద్ర ఎక్కడ‌?? అంటే మాత్రం స‌మాధానం దొర‌కదు. వెంకీ, రామ్‌ల పాత్రల్ని కూడా డిజైన్ చేయ‌డంలో సొంత బుర్ర వాడ‌లేదు. బోల్ బ‌చ్చన్ ఫార్ములాని వీలైంత వ‌ర‌కూ ఇక్కడా అమ‌లు చేశాడు. అలాగే తీయ్ అని నిర్మాత‌లు ముందే చెప్పారో, లేదంటే ఎందుకొచ్చిన రిస్కూ అనుకొన్నాడో తెలీదు గానీ – మార్పులు చేర్పుల జోలికి వెళ్లలేదు.

ఇంట‌ర్నేష‌న్ మ్యాచ్‌ లు ఆడిన వాడిని తీసుకొచ్చి గ‌ల్లీ క్రికెట్ ఆడ‌మంటే… ఎలా ఉంటుంది? వెంక‌టేష్ పరిస్థితీ అంతే. వినోదాత్మక పాత్రల్ని చీల్చి చెండాడే వెంకీ – బ‌ల‌రామ్ పాత్రల‌ను అల‌వోక‌గా చేసేశాడు. భ‌లే చేశాడే అని చెప్పుకోవ‌డానికి ఏం లేదు. ఎందుకంటే వెంకీ ఎప్పుడూ భ‌లేనే చేస్తాడు కాబ‌ట్టి. బ‌ట్టర్ ఇంగ్లీష్ తో చెప్పిన డైలాగులు న‌వ్విస్తాయి. కాక‌పోతే మీకు ఇంగ్లీష్ భాష అర్థమ‌వ్వాలి. శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి కూడా ఇలాంటి ఇంగ్లీషే మాట్లాడాడు. కాక‌పోతే ఆయ‌న తెలుగులో బాగా పాపుల‌ర్ అయిన సామెత‌ల్ని ఇంగ్లీషులో వ‌ల్లించాడు.కాబ‌ట్టి ఏబీసీడీలు రాని తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఫాలో అవ్వగ‌లిగారు. ఇక్కడ అలాంటి మ్యాజిక్ ఊహించ‌డం క‌ష్టమే. ఇక రామ్ ఎన‌ర్జీ ఈ సినిమాకి బాగా క‌లిసొచ్చింది. అభిషేక్ బ‌చ్చన్ అంత స్థాయిలో చేయ‌లేక‌పోయినా.. ఈ మాత్రం రామ్ చేశాడంటే అది గొప్పే. పైగా ఇలాంటి తేడా క్యారెక్టర్ పోషించ‌డానికి ఎవ‌రు ముందుకు వ‌స్తారు చెప్పండి?? ఆ విష‌యంలో రామ్‌ ని మెచ్చుకొని తీరాల్సిందే. అంజ‌లి, షాజ‌న్ ఇద్దరికీ ప్రాధాన్యమున్న పాత్రలు కావు. అంజ‌లి మ‌రీ లావుగా క‌నిపించింది. షాజ‌న్ చూడ్డానికి బాగున్నా, ఆమె ఫేస్ రిజిస్టర్ కాదు. అలీ. ఎమ్మెస్ నారాయ‌ణ ఉన్నంత‌లో ఓకే. జ‌య‌ప్రకాష్‌రెడ్డిని ఇది మ‌రో వెరైటీ పాత్ర‌. రామ్‌, వెంకీల త‌ర‌వాత మార్కులు ప‌డేవి అత‌నికే.

త‌మ‌న్ సంగీతం గురించి మ‌నం కూడా `పాత‌` పాటే పాడుకోవాలి. బోల్ బ‌చ్చన్ రీమేక్ రైట్స్ అధికారికంగా కొనేసి ఆ సినిమాని కాపీ చేస్తే, త‌మ‌న్ మాత్రం ఎక్కడెక్కడి నుంచో దొంగ ట్యూన్లు ఎత్తేస్తుంటాడు. ఆర్‌.ఆర్ కూడా కాపీనే. బాడీగార్డ్‌ లో మిగిలిపోయిన ఆర్‌.ఆర్ ఈ సినిమాకి వాడేశాడు. ఆండ్రూ కెమెరా ప‌నిత‌నం న‌చ్చుతుంది. లావీష్‌ గా తీయ‌డానికి ప్రయ‌త్నించాడు. ఫ‌స్టాఫ్‌ లో దోషాలున్నాయి. లాజిక్‌ కి అంద‌ని కామెడీ అది. గంట సేపు గ‌డిచినా క‌థ ఎక్కడ‌కీ వెళ్లకుండా అక్కడే ఉంటుంది. తెర‌పై ప్రతి పాత్రా న‌వ్వించ‌డానికి ప్రయ‌త్నిస్తుంది. జ‌నాలు కూడా న‌వ్వుతారు. కానీ త్రెడ్ మాత్రం మిస్ అయ్యింది. త్రెడ్ అంటే… దాని చుట్టూ బ‌ల‌మైన ఆధారం ఉండాలి క‌దా..? లేదంటే టీవీ పోగ్రాముల్లో వ‌రుస‌గా కామెడీ బిట్లు చూస్తున్న పీలింగ్ వ‌చ్చేస్తుంది క‌దా..? ఈ సినిమాలోనూ అదే జ‌రిగింది. కేవ‌లం వినోదాన్ని న‌మ్ముకొని.. వెంకీ, రామ్‌ ల అండ‌తో తీసిన సినిమా ఇది. కాసేపు న‌వ్వుకోవ‌డానికి వెళ్లొచ్చంతే! ఇంకా ఎక్కువ‌గా ఆశిస్తే.. ఆ త‌ప్పు మీదే.

న‌వ్వుల దినుసుల‌తో నూరిన‌ “మ‌సాలా”…

ప్రివ్యూ: మ‌సాలా

ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లే గుండె ధైర్యం ఎవ‌రూ చేయ‌డం లేదు. జ‌స్ట్ పైసా వ‌సూల్ సినిమా అయితే చాలు అనుకొంటున్నారు. సినిమాకి వ‌చ్చారా, న‌వ్వుకొన్నారా, వెళ్లిపోయారా… బ‌స్ – ఈ లెక్కల‌తో పాటు న‌డిస్తే చాలు. బాలీవుడ్‌లో బోల్ బ‌చ్చన్ కూడా ఈ ఫార్ములాతోనే వెళ్లిపోయింది. నిజానికి ఆ క‌థ‌లో కొత్తద‌నం కాస్త కూడా క‌నిపించ‌దు. అలాంటి క‌థ‌ల్ని చాలాసార్లు చూసేశాం. అయితే దానికి పూసిన వినోద‌పు పూత మాత్రం, పూత రేకులా తియ్యగా అనిపించింది. విమ‌ర్శకులు .. ఇదేం సినిమా అని నొస‌లు చిట్లించినా ప్రేక్షకులు మాత్రం ప‌ట్టించుకోలేదు. వంద కోట్ల సినిమా చేశారు. ఆధైర్యంతోనే ఈ సినిమాని తెలుగులో మ‌సాలాగా రీమేక్ చేశారు. ఈ మ‌సాలా గురువారం ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ మ‌సాలా ఎలా ఉండ‌బోతోంది? ఇందులోని రుచులేంటి?

* సీత‌మ్మ వాకిట్లో… తో తాను ప్రోత్సహించిన మ‌ల్టీస్టార‌ర్ అనే సంప్రదాయం ఈ సినిమాతో కొన‌సాగించారు వెంక‌టేష్. ఇద్దరు హీరోల్ని తెర‌పై చూస్తే ఆ హుషారే వేరు. పైగా రామ్‌, వెంకీ అంటే ఆ ఎన‌ర్జీ లెవ‌ల్స్ వేరుగా ఉంటాయి. ఈ సినిమాకి మూల‌స్థంభాలు ఈ ఇద్దరే.

* వెంకీ అల‌వాటు ప్రకారం బాగానే చేస్తాడ‌నే న‌మ్మకం ఉందిపైనా ఉంది. కానీ అంద‌రి ఆస‌క్తి రామ్ పాత్ర ఎలా ఉంటుందో అనే. ఎందుకంటే బోల్ బ‌చ్చన్‌లో ఆ పాత్ర అభిషేక్ చేశాడు. అదో తేడా క్యారెక్టర్‌. మ‌రి రామ్ ఆ పాత్ర ఎలా చేశాడు? ఎలా మెప్పించాడు?? అనేది ఆస‌క్తిక‌రం.

* క‌థంటారా.. అది ఇప్పటికే అంద‌రి ఆమోద ముద్ర వేయించుకొంది. కానీ విజ‌య‌భాస్కర్ తెలుగులో త‌ర్జుమా చేసిన విధానం బ‌ట్టే ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు ఆధార ప‌డి ఉన్నాయి. రీమేక్ క‌థ‌లు ఎప్పుడూ సేఫ్ జ‌ర్నీనే. పైగా వినోదాత్మక క‌థ‌లు. ఈసారీ ఈ ఫార్ములా గ‌ట్టెక్కడం ఖాయం అని ప‌రిశ్రమ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

* వెంకీకి జోడీగా , రామ్‌కి అక్కగా అంజ‌లి న‌టిస్తోంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర‌వాత అంజ‌లి న‌టించిన చిత్రం ఇదే. షాజ‌న్ ప‌ద‌మ్ సీ మ‌రో క‌థానాయిక‌. ఆమె రామ్‌తో జోడీక‌ట్టింది.

* డి.సురేష్‌బాబు, స్రవంతి ర‌వికిషోర్ ఈ చిత్రానికి నిర్మాత‌లు. ఇద్దరూ నిర్మాణ విలువ‌ల విష‌యంలో రాజీ ప‌డ‌ని వారే. ప‌క్కా ప్లానింగ్‌తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. విడుద‌ల విష‌యంలో జాప్యం జ‌రిగినా, అంద‌రికీ గిట్టుబాటు అయ్యే సినిమా తీశార‌ని టాక్‌.

* వెంకీ, రామ్‌ల పాత్ర‌లే కాదు… అలీ. జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి క్యారెక్ట‌ర్లు గుర్తిండిపోతాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

* రామ్ అంటే డాన్సులు గుర్తొస్తాయి. ఈ సినిమాలోనూ డాన్సులు ఇర‌గ‌దీశాడ‌ట రామ్‌. మీనాక్షి మీనాక్షి అనే పాట‌లో లాకింగ్ అండ్ పాపింగ్ అనే కొత్త స్టెప్పు వేశాడ‌ట రామ్‌. అది ఎలా ఉంటుందో చూడాలి.

* ఈ సినిమా ప్రచారం కోసం కూడా కొత్త పోక‌డ‌లో వెళ్లారు. ఓ కామెడీ స్కిట్ షూట్ చేసి జ‌నంలోకి వ‌దిలారు. దానికి మంచి స్పంద‌న వచ్చింది.

* త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెండు పాట‌లు క్లిక్ అయ్యాయి. మిగ‌తావి ధియేట‌ర్లో ఎలా ఉంటాయో చూడాలి. ఆండ్రూ కెమెరా ప‌నిత‌నం ప్రధాన ఆక‌ర్షణ అని చిత్రబృందం చెబుతోంది.

* ఈ సినిమా కూడా ఆడితే.. తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు మ‌రిన్ని రావ‌డం ఖాయం. మ‌రి మ‌సాలా ఫ‌లితం ఎలా ఉండ‌బోతోందో?

మసాలా మొదటి షో వివరాలు

Updated at 11:31 AM

సంతోషకరమైన క్లైమాక్స్ తో సినిమా ముగిసింది. చివరిగా మసాలా టైటిల్ సాంగ్ వస్తోంది.

Updated at 11:27 AM

రామ్ ఆడిన గేమ్ తెలియడంతో వెంకటేష్ కు తెలియడంతో చాలా కోపంగా ఉన్నాడు. ప్రస్తుతం భారీ కార్ చేజ్ సన్నివేశాలు వస్తున్నాయి.

Updated at 11:21 AM

సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది.

Updated at 11:13 AM

వెంకటేష్, అంజలి మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు జరుగుతున్నాయి.

Updated at 10:57 AM

ఇంజనీర్ గా వేణు మాధవ్ ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 10:48 AM

తికమక పెట్టె కామెడీ డ్రామా సాగుతోంది. వెంకటేష్, జయప్రకాశ్ రెడ్డి లు వారి కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైనింగ్ చేసే సన్నివేశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘మీనాక్షి మీనాక్షి’ సాంగ్ వస్తోంది.

Updated at 10:33 AM

ప్రస్తుతం రామ్, షాజాహాన్ మధ్య ప్రేమ సన్నివేశాలు వస్తున్నాయి. ‘దుమ్ములే దుమ్ములే’ సాంగ్ వస్తోంది.

Updated at 10:21 AM

ఇంటర్వల్…… సినిమా మొదటి భాగం కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో సాగింది. రెండవ భాగం ఈ సినిమాకి ముఖ్యం కానుంది.

Updated at 10:15 AM

రామ్ సినిమాలో గే గా రెండవ క్యారెక్టర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 10:02 AM

ప్రస్తుతం రెండవ సాంగ్ “నిన్ను చూడని’ వస్తోంది. ఈ పాటని వెంకటేష్, అంజలిపై చిత్రీకరించారు.

Updated at 09:58 AM

రామ్ తల్లిగా కోవై సరళ ఎంట్రీ ఇచ్చింది.

Updated at 09:40 AM

వెంకటేష్ చెల్లెలిగా షాజాహాన్ పదమ్సీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చాలా వేగంగా, బాగున్నాయి. వెంకి, రామ్ లు పోసాని రౌడీలతో ఫైట్ సన్నివేశాలు వస్తున్నాయి.

Updated at 09:30 AM

రెహమాన్ రామ్ గా పేరు మార్చుకొని వెంకి ఇంటికి వెళ్ళాడు.

Updated at 09:22 AM

రామ్ పేరు రెహమాన్… అలీ ఎంఎస్ నారాయణ కొడుకుగా తెరకు పరిచయం అయ్యాడు.

Updated at 09:17 AM

వెంకటేష్ పేరు బలరాం …. జయప్రకాశ్ రెడ్డి, పోసాని, ఎంఎస్ నారాయణ మొదలగు వారు తెరకు పరిచయం అయ్యారు. వెంకటేష్ తన ఫన్నీ ఇంగ్లీష్ భాషతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.

Updated at 09:14 AM

వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు. కోటలో ఒక్కడే రా కోరమీసల బొబ్బిలి రాజ సాంగ్ వస్తోంది.

Updated at 09:11 AM

సినిమా ఇప్పుడే మొదలైంది. సానియా గా అంజలి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఆమె తమ్ముడిగా రామ్ తెరకు పరిచయం అయ్యాడు.

Tags : masala review, మ‌సాలా రివ్యూ, masala movie review , masala rating, masala telugu movie review , masala movie rating, masala telugu movie rating, venkatesh\’s masala review, masala cinema review, masala film review, ram masala movie review, ram masala movie rating, masala story, masala live updates, masala tweet review, masala movie review and rating, masala film rating, masala cinema rating, venkatesh masala movie rating, venkatesh masala movie review and rating,masala,masala cinema rating,masala cinema review,masala film rating,masala film review,masala live updates,masala movie rating,masala movie review,masala movie review and rating,masala rating,masala story,masala telugu movie rating,masala telugu movie review,masala tweet review,ram masala movie rating,ram masala movie review,venkatesh masala movie rating,venkatesh masala movie review and rating,venkatesh\’s masala review