నిశ్శ‌బ్దం రివ్యూ

0

చిత్రం : నిశ్శ‌బ్దం
నటీనటులు : అనుష్క, మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు
దర్శకత్వం : హేమంత్‌ మధుకర్‌
నిర్మాతలు : టీజీ విశ్వ‌ప్ర‌సాద్, ‌కోన వెంకట్.
రచన : కోన వెంకట్, హేమంత్‌ మధుకర్‌.
సంగీతం : గోపిసుందర్, గిరీష్
విడుదల తేదీ : అక్టోబర్ 2nd,2020

స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ రోజు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయింది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ నిర్మించారు. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అనుష్క (సాక్షి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు వదిలి ఉండలేరు. అయితే ఈ క్రమంలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) రావడం సోనాలి తట్టుకోలేకపోతోంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం సోనాలి మిస్ అవ్వడం, అలాగే ఆంటోనీని ఎవరో దారుణంగా హత్య చేయడం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఆంటోనీ హత్య కేసును విచారణ చేస్తున్న టీమ్ లో మహా (అంజలి) తన తెలువితేటలతో అసలు ఏం జరిగింది ? అమ్మాయిల మిస్సింగ్ కేసుకు, ఆంటోనీ మర్డర్ కేసుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని కనుక్కోవడానికి ఆమె ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఇంతకీ ఆంటోనీని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అసలు అమ్మాయిల మిస్ అవ్వడానికి కారకులు ఎవరు ? ఇంతకీ సోనాలి ఏమైపోయింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో ప్లే ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క, సాక్షి పాత్రలో అద్భుతంగా నటించింది. సాక్షికి వినబడదు, కనబడదు, అలాంటి పాత్రను చాలెంజింగ్‌ గా తీసుకుని మరీ అనుష్క ఈ పాత్రలో నటించిన విధానం మెచ్చుకోతగినది. ఇక ఈ పాత్ర కోసం అమెరికా సైన్ లాంగ్వేజ్‌ నేర్చుకుని మరీ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క. అలాగే క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొన్ని హారర్ అండ్ ఎమోషనల్ సీన్స్ లోనూ అనుష్క పలికించిన హావభావాలు చాల బాగున్నాయి.

మాధవన్ – అనుష్క మధ్య కెమిస్ట్రీ మరియు అనుష్క క్యారెక్టర్ లోని షేడ్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక సినిమాలో కీలకమైన మేల్ లీడ్ గా నటించిన మాధవన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు షాలిని పాండే, అంజలి, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్, సుబ్బరాజు సహా అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మెయిన్ గా హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్ వల్ల సినిమాకి అంతర్జాతీయ కల వచ్చింది. ఇక సినిమాలో చాలా భాగాన్ని యుఎస్‌లో బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో చిత్రీకరించడం కూడా సినిమా స్థాయిని పెంచింది.

మైనస్ పాయింట్స్

సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ ప్లే బాగా ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

పైగా మెయిన్ ప్లాట్ లోనే ఇంట్రస్ట్ మిస్ అవ్వడంతో పాటు పోలీసుల ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం లాంటి అంశాలు మరీ సినిమాటిక్ గా సాగుతాయి. ఇలాంటి సస్పెన్స్ ఎమోషన్ థ్రిల్లర్ లో ఇలాంటి సిల్లీ ట్రీట్మెంట్ ను రాసుకోకుండా ఉండాల్సింది. పైగా కొన్ని లీడ్ సీన్స్ అన్ని కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, రిలీఫ్ కి కూడా ఎలాంటి కామెడీ లేకపోవడంతో సినిమా కొంతవరకు నిరాశ పరుస్తోంది. ఇక అనుష్క – షాలిని పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ ను బాగానే ఎలివేట్ చేసినా.. షాలిని క్యారెక్టరైజేషన్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాలో మెయిన్ రివేంజ్ డ్రామాకి మోటివ్ ఇంకా బెటర్ గా ఉండేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.
ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు కెమెరామెన్. అలాగే గిరీష్ అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు హేమంత్ మంచి కథను తీసుకున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమా తీసి ఉంటే ఈ సినిమా కమర్షియల్ గా కూడా మరో స్థాయిలో ఉండేది.

తీర్పు :

విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్.. కొన్ని ఆకట్టుకునే సస్పెన్స్ సీన్స్ తో మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్టింగ్ గా సాగుతూ పర్వాలేదనిపిస్తోంది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు బోర్ గా సాగడం, ముందు చెప్పుకునట్లే.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో లాంటి అంశాలు సినిమా రిజల్ట్ ను దెబ్బ తీశాయి. అయితే అనుష్క అద్భుతమైన నటనతో పాటు హేమంత్ దర్శకత్వ పనితనం కూడా సినిమా స్థాయిని పెంచాయి. ఓవరాల్ గా థిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించదు.

చిత్రం : నిశ్శ‌బ్దం నటీనటులు : అనుష్క, మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు దర్శకత్వం : హేమంత్‌ మధుకర్‌ నిర్మాతలు : టీజీ విశ్వ‌ప్ర‌సాద్, ‌కోన వెంకట్. రచన : కోన వెంకట్, హేమంత్‌ మధుకర్‌. సంగీతం : గోపిసుందర్, గిరీష్ విడుదల తేదీ : అక్టోబర్ 2nd,2020 స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ రోజు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయింది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ నిర్మించారు. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : అనుష్క (సాక్షి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు వదిలి ఉండలేరు. అయితే ఈ క్రమంలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) రావడం సోనాలి తట్టుకోలేకపోతోంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం సోనాలి మిస్ అవ్వడం, అలాగే ఆంటోనీని ఎవరో దారుణంగా హత్య చేయడం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఆంటోనీ హత్య కేసును విచారణ చేస్తున్న టీమ్ లో మహా (అంజలి) తన తెలువితేటలతో అసలు ఏం జరిగింది ? అమ్మాయిల మిస్సింగ్ కేసుకు, ఆంటోనీ మర్డర్ కేసుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని కనుక్కోవడానికి ఆమె ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఇంతకీ ఆంటోనీని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అసలు అమ్మాయిల మిస్ అవ్వడానికి కారకులు ఎవరు ? ఇంతకీ సోనాలి ఏమైపోయింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో ప్లే ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క, సాక్షి పాత్రలో అద్భుతంగా నటించింది. సాక్షికి వినబడదు, కనబడదు, అలాంటి పాత్రను చాలెంజింగ్‌ గా తీసుకుని మరీ అనుష్క ఈ పాత్రలో నటించిన విధానం మెచ్చుకోతగినది. ఇక ఈ పాత్ర కోసం అమెరికా సైన్ లాంగ్వేజ్‌ నేర్చుకుని మరీ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క. అలాగే క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొన్ని హారర్ అండ్ ఎమోషనల్ సీన్స్ లోనూ అనుష్క పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. మాధవన్ – అనుష్క మధ్య కెమిస్ట్రీ మరియు అనుష్క క్యారెక్టర్ లోని షేడ్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక సినిమాలో కీలకమైన మేల్ లీడ్ గా నటించిన మాధవన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు షాలిని పాండే, అంజలి, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్, సుబ్బరాజు సహా అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మెయిన్ గా హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్ వల్ల సినిమాకి అంతర్జాతీయ కల వచ్చింది. ఇక సినిమాలో చాలా భాగాన్ని యుఎస్‌లో బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో చిత్రీకరించడం కూడా సినిమా స్థాయిని పెంచింది. మైనస్ పాయింట్స్ సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ ప్లే బాగా ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. పైగా మెయిన్ ప్లాట్ లోనే ఇంట్రస్ట్ మిస్ అవ్వడంతో పాటు పోలీసుల ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం లాంటి అంశాలు మరీ సినిమాటిక్ గా సాగుతాయి. ఇలాంటి సస్పెన్స్ ఎమోషన్ థ్రిల్లర్ లో ఇలాంటి సిల్లీ ట్రీట్మెంట్ ను రాసుకోకుండా ఉండాల్సింది. పైగా కొన్ని లీడ్ సీన్స్ అన్ని కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, రిలీఫ్ కి కూడా ఎలాంటి కామెడీ లేకపోవడంతో సినిమా కొంతవరకు నిరాశ పరుస్తోంది. ఇక అనుష్క – షాలిని పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ ను బాగానే ఎలివేట్ చేసినా.. షాలిని క్యారెక్టరైజేషన్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాలో మెయిన్ రివేంజ్ డ్రామాకి మోటివ్ ఇంకా బెటర్ గా ఉండేది. సాంకేతిక విభాగం : ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్…

నిశ్శ‌బ్దం రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.25
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 2.25
దర్శకత్వ ప్రతిభ - 2

2.5

నిశ్శ‌బ్దం రివ్యూ

నిశ్శ‌బ్దం రివ్యూ

User Rating: Be the first one !
3