థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ క్రేజీ మూవీ…!

0

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ “రెడ్”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్బీపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా.. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తమిళ మూవీ ‘తదమ్’ స్టోరీ లైన్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన జోష్ తో త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్న రామ్ కి కరోనా అడ్డుపడింది. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టే ఓటీటీలు రామ్ మూవీ కోసం పోటీ పడ్డాయి. అయితే ‘రెడ్’ మేకర్స్ మాత్రం ఎన్ని రోజులు వెయిట్ చేసైనా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

కాగా కేంద్రం అన్ లాక్ 5.0 సడలింపులలో భాగంగా థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని నిబంధన విధించింది. దీంతో థియేటర్స్ దీనికి తగ్గట్లు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ క్రేజీ మూవీ రామ్ ”రెడ్” అని చెప్పవచ్చు. ఇన్నాళ్లు వెయిట్ చేసిన మేకర్స్.. నవంబర్ లో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లే సినిమాలు ఏ స్థాయిలో బిజినెస్ చేస్తాయో చూడాలి.