Templates by BIGtheme NET
Home >> REVIEWS >> పోటుగాడు రివ్యూ

పోటుగాడు రివ్యూ


 

Title : Potugadu (2013)
Star Cast : Manchu Manoj, Sakshi Chowdhary, Posani Krishna Murali…
Director : Pawan Wadeyar
Producer : Lagadapati Sirisha
Genre : Comedy – Romance
Music : Achu
Release Date : Sept 14, 2013.

Potugadu Movie Live Updates- Tweet Review

Updated at 11:34 AM

ఎట్టకేలకు అన్ని ప్రేమకధలు ఒకే తాటిపై ముగిసాయి
త్వరలో రివ్యూ అందిస్తాం

Updated at 11:26 AM

భారీ ఫైట్ సాగుతుంది. రెండో భాగంలో కామెడీ స్థానంలో ఫైట్లు, సీరియస్ సన్నివేశాలతో నింపేశారు

Updated at 11:20 AM

స్టొరీలో మరో ఉహించని మలుపు.. మునుపటితరం నటుడు వినోద్ కుమార్ పోలీస్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు

Updated at 11:16 AM

మనోజ్ అనుప్రియల మధ్య ఒక చక్కని లవ్ స్టొరీని డెవలప్ చేసారు.. ఆల్బం లో అందరికీ నచ్చిన ‘దేవతా’ పాట వస్తుంది

Updated at 11:12 AM

నాలుగో ప్రేమకధకు సినిమా కధ మారింది… మేరీ పాత్రలో అనుప్రియ ఎంట్రీ ఇచ్చింది

Updated at 11:06 AM

సినిమాలో రెండో ఫైట్

Updated at 10:58 AM

ప్రస్తుతం శింబు పాడిన బుజ్జి పిల్లా పాట వస్తుంది

Updated at 10:56 AM

3వ ప్రేమ కధ మొదలైంది. స్టాసి పాత్రలో విదేశి యువతిగా రాచెల్ ప్రవేశించింది

Updated at 10:45 AM

డాక్టర్ గా ఆలి నట ప్రవేశం జరిగింది. మున్ముందు మరింత కామెడీ ఆశించచ్చు

Updated at 10:32 AM

సినిమాలో ఊహించని మలుపు… సినిమా సీరియస్ టోన్ లోకి మారింది.. ఇంటర్వెల్.. మొదటి భాగం చాలా ఫాస్ట్ గా, సరదాగా సాగింది.. రెండో భాగం కూడా ఇదే పేస్ లో సాగుతుందేమో చూడాలి

Updated at 10:21 AM

హీరోయిన్ సాక్షి ఎంట్రీ ఇచ్చింది. అందరు ఎదురుచూస్తున్న ‘ప్యార్ మై పడిపోయా’ పాట వస్తుంది

Updated at 10:15 AM

సినిమాలోకి షియాజీ షిండే, రఘుబాబుల ఎంట్రీ ఇచ్చారు. మనోజ్ వేగంగా స్టోరీని నడిపిస్తున్నాడు. ఇప్పటిదాకా వైదేహి రూపంలో మొదటి ప్రేమకదను చెప్పిన మనోజ్ ఇప్పుడు అనార్కలితో రెండో స్టొరీని మొదలుపెట్టాడు

Updated at 10:10 AM

నర్సింగ్ యాదవ్ గ్యాంగ్ తో ఒక ఫైట్ సీన్ మొదలైంది/ ఫైట్ లో కూడా కామెడీని మేళవించారు

Updated at 10:01 AM

డాన్స్ మాస్టర్ గా శివ శంకర్ మాస్టర్ తళుక్కున మెరిసారు. సినిమా జోష్ లో ఉండగా ‘రాయే రాయే సూపర్ ఫిగర్’ పాట మొదలైంది

Updated at 09:56 AM

తమిళ స్టార్ మల్లేష్ గా సత్యం రాజేష్ ఎంట్రీ ఇచ్చాడు

Updated at 09:52 AM

ఈ సినిమాలో మనోజ్ పాత్ర పేరు గోవిందు… ప్రస్తుతం కధను ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపిస్తున్నారు. మనోజ్ తాతగా చంద్ర మోహన్ నటిస్తున్నాడు. ప్రతీ సీన్ లోనూ కామెడీ ని నింపేసాడు

Updated at 09:43 AM

పోసాని కృష్ణ మురళికి తన కొలీగ్ కీ మధ్య కడుపుబ్బా నవ్వించే లవ్ ట్రాక్ నడుస్తుంది

Updated at 09:39 AM

వెంకటరత్నం పాత్రలో ఇప్పుడే పోసాని కృష్ణ మురళి తెర మీదకు ఎంట్రీ ఇచ్చాడు

Updated at 09:36 AM

సినిమాలో మంచు మనోక్ ఎంట్రీ సాదాగానే వుంది. విగ్నేశ్వరుని కి వాయిస్ ఓవర్ గా సునీల్ గాత్రదానం చేసాడు

 

09:39 am : మనోజ్ గణేశుని వద్ద సీన్ బాగుంది. సునీల్ వాయిస్ చాలా ఫన్నీగా ఉంది

09:38 am : సినిమా స్టార్టింగ్ చక్కటి యానిమెషన్ తో కూడిని టైటిల్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ బిన్ దాస్

09:36 am : ‘ఎ’ సర్టిఫికెట్ 125 నిమిషాల నిడివి

09:34 am : హాయ్! గుడ్ మార్నింగ్  telugunow.com రీడర్ప్ మంచు మనోజ్ నటించిన పోటుగాడు  సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం

పోటుగాడు రివ్యూ:

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘గోవిందాయ నమః’ సినిమాకి రీమేక్ గా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పోటుగాడు’. ఈ రోజు భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమాలో సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, అను ప్రియ, రేచల్ లు హీరోయిన్స్ గా ఆడిపాడారు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన పవన్ వడియార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శిరీషా – శ్రీధర్ నిర్మించారు. ఇప్పటికే అచ్చు అందించిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి థియేటర్స్ లో మన మంచు మనోజ్ పోటుగాడు అని అనిపించుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

గోవిందు(మంచు మనోజ్) జీవితంలో బతకాలనే కోరిక చచ్చిపోయి, చనిపోవాలని నిర్ణయించుకొని ఒక ప్లేస్ ఎంచుకుకుంటాడు. అదే ప్లేస్ కి వెంకటరత్నం(పోసాని కృష్ణమురళి) కూడా చనిపోవడానికి వస్తాడు. అక్కడ ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ ఒకరికొకరు తాము ఎందుకు చనిపోతున్నామో చెప్పుకోవడం మొదలు పెడతారు. వెంకటరత్నం మాత్రం లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవాలనుకుంటాడు. గోవిందు కూడా అదే రీజన్ తో చనిపోవాలనుకుంటాడు కానీ అక్కడే ఓ ట్విస్ట్..

ఎందుకంటే మన గోవిందుకి ఒక్కటి కాదు నాలుగు లవ్ స్టొరీలు ఉంటాయి. మొదటి లవ్ ట్రాక్ వైదేహి(సిమ్రాన్ కౌర్ ముండి)తో, రెండవ లవ్ ట్రాక్ ముంతాజ్(సాక్షి చౌదరి)తో, మూడవ లవ్ ట్రాక్ స్టేసీ (రేచల్)తో, చివరిది నాలుగవ లవ్ పార్ట్ మేరీ (అనుప్రియ గోయెంక)తో జరిగి ఉంటుంది. కానీ గోవిందు ఏ ఒక్క లవ్ లోనూ సక్సెస్ అయ్యి ఉండడు. ఈ నాలుగు లవ్ ట్రాక్స్ లో గోవిందు ఎందువల్ల ఒక్కో అమ్మాయిని వదులుకోవలిసి వచ్చింది? అందరినీ అతనే దూరం చేసుకున్నాడా? లేక వాళ్ళే అతన్ని మోసం చేసారా? చివరికి ఈ నలుగురిలో ఏ ఒక్కరితో అయినా మన గోవిందు సెటిల్ అయ్యాడా? లేదా? అనేదే ఈ చిత్రంలోని మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మంచు మనోజ్ మరియు పోసాని కృష్ణమురళిలు ఈ సినిమా మొత్తాన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించారు. ముందుగా.. మంచు మనోజ్ నటన, డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే మనోజ్ ఎంతో రిస్క్ తీసుకొని చేసిన స్టంట్స్ కూడా చాలా బాగున్నాయి. పోసాని కృష్ణమురళి తన డైలాగ్ డెలివరీతో స్క్రీన్ పైన కనిపించినంత సేపూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. అతని లవ్ స్టొరీ ట్రాక్, అందులో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. అలాగే మనోజ్ – పోసాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి.

సినిమాలో నటించిన హీరోయిన్స్ అందరివీ చిన్న చిన్న పాత్రలు. వారందరూ రెండు మూడు సీన్స్, ఒక్కో పాటకి పరిమితమయ్యారు. సాక్షి చౌదరి బాగుంది, స్టేసీ పాత్ర చేసిన రేచల్ అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది, అనుప్రియ జస్ట్ ఓకే. ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమాకి అచ్చు అందించిన సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయి. అదే పాటల్ని తెరపై అంత కన్నా సూపర్బ్ గా చిత్రీకరించారు. పాటలు చూడటానికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘దేవత’, ‘ప్యార్ మే పడిపోయా’ సాంగ్స్ మరియు ‘బుజ్జి పిల్ల’ పాటలో స్విమ్మింగ్ పూల్ లో తీసిన షాట్స్ చాలా బాగా వచ్చాయి. అలీ, రఘుబాబులు కొద్దిసేపే కనిపించినా పరవాలేధనిపించారు. ఇంటర్వల్ బ్లాక్ బాగుంది, అలాగే సినిమా రన్ టైం తక్కువ కావడం సినిమాకి హెల్ప్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్ధ భాగం సాగినంత వేగంగా సెకండాఫ్ సాగదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా కాస్త తక్కువైంది. అలాగే సినిమా క్లైమాక్స్ చాలా రొటీన్ గా, ఊహాజనితంగా ఉండడం వల్ల ఆడియన్స్ నిరుత్సాహపడే అవకాశం ఉంది. సిమ్రాన్ నటన బాలేదు. సెకండాఫ్ లో వచ్చే రేచల్ ట్రాక్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోదు. అలాగే ఇంగ్లీష్ బ్యూటీ రేచల్ తెలుగులో మాట్లాడటం చిరాకు పెడుతుంది. ఇకనైనా ఫిల్మ్ మేకర్స్ అలా చేయడం మానుకుంటే బెటర్.

సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్ తెలుగు వారు కాకపోవడం వల్ల వారి నటన పరవాలేధనిపించినా డైలాగ్ డెలివరి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అలాగే హీరోయిన్స్ తో మనోజ్ రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సినిమా మొత్తం చూసాక కథా పరంగా చూసుకుంటే సినిమాలో పెద్ద కథేం లేదే అన్న భావన కలుగుతుంది. అలాగే చివరి లవ్ ట్రాక్ లో వచ్చే మేరీ పాత్రకి, చంద్ర మోహన్ పాత్రలకి సరైన ముగింపు ఇవ్వలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ గురించి, సినిమా మొదటి ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకూ ఆయన అందించిన సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. అలాగే అచ్చు అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. చాలా చోట్ల డబుల్ మీనింగ్ కామెడీ డైలాగ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటర్ ఎంఆర్ వర్మ సెకండాఫ్ విషయంలో కాస్త కేర్ తీసుకొని తన కత్తెరతో కొన్ని అనవసర సీన్స్ ని కట్ చేసి ఉండే సెకండాఫ్ కి హెల్ప్ అయ్యేది కానీ చేసినంతవరకూ బాగుంది.

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం ఈ మూడు విభాగాలను పవన్ వడియార్ డీల్ చేసాడు. కథ – చెప్పుకునేంత లేదు. స్కీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండాఫ్ ని ఇంకాస్త టఫ్ గా ఉండేలా చూసుకోవాల్సింది. డైరెక్షన్ – ఓవరాల్ గా పవన్ డైరెక్షన్ ఓకే. శిరీషా – శ్రీధర్ మూవీ కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై చాలా రిచ్ గా కనిపించింది.

తీర్పు :

మంచు మనోజ్ ‘పోటుగాడు’గా వచ్చి ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఫాస్ట్ గా నడిచే ఫస్ట్ హాఫ్ కి ఎంటర్టైన్మెంట్ తోడవడం, మంచు మనోజ్ – పోసాని కాంబినేషన్, సూపర్బ్ సినిమాటోగ్రఫీ, కాస్త హీరోయిన్స్ గ్లామర్ సినిమాకి ప్లస్ అయితే ఊహించినంత స్థాయిలో సెకండాఫ్, క్లైమాక్స్ లేకపోవడం ఈ సినిమాకి బిగ్ మైనస్. చివరిగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ సారి చూడదగిన సినిమా ‘పోటుగాడు’.
Potugadu Telugu Movie Review,Potugadu Telugu Movie Rating,Potugadu Movie Review,Potugadu Movie Rating,Potugadu Review,Potugadu Rating,Manchu Manoj,