Templates by BIGtheme NET
Home >> REVIEWS >> రివ్యూ : రౌడీ

రివ్యూ : రౌడీ


ప్రివ్యూ :

రాంగోపాల్ వ‌ర్మ సినిమా అన‌గానే ఓ అటెన్ష‌న్ మొద‌లైపోతుంది. అందులో హీరో ఎవ‌రైనా స‌రే… సినిమా ఎలా తీశాడు? టెక్నిక‌ల్‌ గా ఏం చేశాడు? సంచ‌ల‌నాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఆరాలు మొద‌లైపోతాయి. అందుకే గ‌త సినిమాల రిజ‌ల్ట్‌ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తెచ్చుకోగ‌ల‌డు. అదీ.. వ‌ర్మ స్టైల్‌. ఈసారి వ‌ర్మ మంచు ఫ్యామిలీతో జ‌త క‌ట్టాడు. రాయ‌ల‌సీమ‌లో రౌడీని చూపించ‌బోతున్నాడు. మోహ‌న్‌ బాబు, విష్ణు, జ‌య‌సుధ‌, శాన్వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌ల కాబోతోంది. రౌడీ విశేషాల‌ను ఓసారి చూస్తే…

Rowdy Movie Review in English  | Rowdy Live Updates  |

రౌడీ : మొదటి షో లైవ్ అప్ డేట్స్:

 

 Updated at 10:45 AM

 విష్ణు తమ కుటుంబం పై దాడి చేసిన ప్రత్యర్దులపై విరుచుకు పది వారిని అంతం చేసి కొత్త డాన్ గా అవతరించాడు.. సినిమా ముగిసింది..మరికోద్ది సేపట్లో పూర్తి రివ్యూ చదవండి

Updated at 10:30 AM

మోహన్ బాబు కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్ధులు మోహన్ బాబుపై పైచేయి సాధించారు.

Updated at 10:18 AM

మోహన్ బాబు, విష్ణులను చంపేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక చేస్ సీన్ వస్తుంది.

Updated at 10:01 AM

ఒక పవర్ ఫుల్ ఫైట్ తో సినిమా ఇంటర్వెల్ దశకు చేరుకుంది. ఫస్ట్ హాఫ్ లో తండ్రి కొడుకుల మధ్య ఉండే పోటిని చూపించారు .

Updated at 09:55 AM

మోహన్ బాబు, విష్ణులు కలిసి చేసిన ఓక అద్భుతమైన ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ ని చాలా బాగా తీశారు.

Updated at 09:38 AM

ఇప్పుడే మోహన్ బాబు, జయసుధల మధ్య ‘ఓ బుల్లెమ్మ’ అనే డ్యూయెట్ మొదలయింది. ఇది ఒక షష్టిపూర్తి పాట.

Updated at 09:25 AM

విష్ణు మరియు శాన్విల మధ్య ప్రేమ సన్నివేశాలు నడుస్తున్నాయి. ‘నీ మీద ఒట్టు’ పాట మొదలయింది.

Updated at 09:10 AM

మోహన్ బాబు ‘అన్నగారు’ అని పిలువబడే ఒక డాన్. జయసుధ, తనికెళ్ళ భరణి, జీవ మరియు ఇతర నటినటులు తెరకు పరిచేయం అయ్యారు.

Updated at 09:03 AM

ఓ హింసాత్మక పోరాటంతో విష్ణు తెరకు పరిచేయం అయ్యాడు. ఈ ఫైట్ లో విష్ణు శాన్విని రక్షించాడు.

Updated at 08:50 AM

హాయ్ ఫ్రెండ్స్ ‘రౌడీ’ సినిమా లైవ్ అప్ డేట్స్ మీకు అందించానున్నాం. సినిమా ఇప్పుడే మొదలయింది, శానివి తెరకు పరిచేయం అయింది.

* వ‌ర్మ – మోహ‌న్ బాబు ఈ కాంబినేష‌నే కొత్త‌గా ఉంది. అందులోనూ మోహ‌న్ బాబుతో క‌ల‌సి విష్ణు కూడా న‌టించాడు. ఈ కాంబినేష‌న్ ఈ సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.

* రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అక్క‌డ ప్ర‌జ‌ల కోసం బ‌తికే మ‌నిషి అన్న‌. అత‌ను రౌడీ ఎందుకయ్యాడు? ఎలా అయ్యాడు? అక్క‌డున్న రాజ‌కీయ‌, సామాజిక ప‌రిస్థితులేంటి? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

* సాధార‌ణంగా వ‌ర్మ సినిమాలో క‌థ‌లు గొప్ప‌గా ఉండ‌వు. టేకింగే మూలం. ప్ర‌చార‌ చిత్రాలు చూస్తుంటే టేకింగ్‌ లో ఆ కొత్త‌ద‌నం క‌నిపిస్తోంది.

* బాలీవుడ్‌ లో నిర్మించిన స‌ర్కార్‌కీ ఈ సినిమాకీ పోలికలు ఉన్నాయ‌ని చెప్పుకొంటున్నారు. అయితే వ‌ర్మ మాత్రం ఈ విష‌యాన్ని అంగీక‌రించ‌డం లేదు. క‌థ‌లో కొన్ని పోలిక‌లు ఉన్నాయేమో… సినిమా వేరేలా ఉంటుంది అన్న‌ది ఆయ‌న మాట‌.

* ఈ సినిమాలో 11 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగే ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ ఉంద‌ట‌. తెలుగులో అంత నిడివి ఉన్న యాక్ష‌న్ ఘ‌ట్టం ఇది వ‌ర‌కు రాలేదు. దాన్ని వ‌ర్మ ఎలా హ్యాండిల్ చేశాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

* మోహ‌న్ బాబు విగ్ లేకుండా న‌టించిన సినిమా ఇది. త‌న ఇమేజ్‌ కి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న ప‌లికే సంభాష‌ణ‌లు పెద‌రాయుడు స్థాయిలో ఉంటాయ‌ని విష్ణు చెబుతున్నారు.

* విష్ణుకీ స‌రికొత్త పాత్ర ద‌క్కింది. ఈ సినిమాలో విష్ణు ఒక్క స‌న్నివేశంలో కూడా న‌వ్వ‌డ‌ట‌. అంత సీరియ‌స్‌ గా చూపించారు.

* శాన్వి క‌థానాయిక‌గా న‌టించింది. ఓ పాట‌లో ఆమెని అందంగా, సెక్సీగా చూపించాడు వ‌ర్మ‌. మాస్‌ కి కెవ్వు కేకే.

* సాయికార్తీక్ స్వ‌రాలు అందించాడు. రెండు పాట‌లు జ‌నానికి న‌చ్చాయి కూడా.

* ఆర్‌.ఆర్ అదిరిపోయే స్థాయిలో ఉంటుంద‌ట‌.

* మోహ‌న్ బాబు – జ‌య‌సుధ‌.. ఈ హిట్ పెయిర్‌ ని మ‌ళ్లీ చూసే అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమాలో సెంటిమెంట్‌ కీ చోటిచ్చాడు వ‌ర్మ‌. మ‌రి ఆయ‌న పండించే సెంటిమెంట్ ఎలా ఉంటుందో..?

* వర్మ సంగ‌తి ఎలా ఉన్నా.. మంచు కుటుంబానికి ఓ హిట్ కావాలి. అది ఈ సినిమాతో ద‌క్కుతుందో లేదో చూడాలి. రౌడీ రివ్యూ కోసం… తెలుగునౌ.కాం బ్రౌజ్ చేస్తూనే ఉండండి.

Tags; rowdy review, rowdy movie review , rowdy rating, rowdy 2014 imdb rating, రివ్యూ : రౌడీ, రౌడీ రివ్యూ, రౌడీ : రివ్యూ, రౌడీ రివ్యూ,  రౌడీ : సమీక్ష, సమీక్ష : రౌడీ, సమీక్ష రౌడీ, రౌడీ సమీక్ష, rowdy movie live updates, rowdy tweet review, rowdy telugu movie review , rowdy movie rating, rowdy telugu movie rating, mohan babu rowdy review, rowdy cinema review, rowdy film review, manchu vishnu rowdy movie review, ram gopal varma rowdy movie rating, rowdy story, rowdy live updates, rowdy tweet review, rowdy movie review and rating, rowdy film rating, rowdy cinema rating, mohan babu rowdy movie rating, mohan babu rowdy movie review and rating,manchu vishnu,manchu vishnu rowdy,manchu vishnu rowdy movie review,mohan babu,mohan babu rowdy,mohan babu rowdy movie rating,mohan babu rowdy movie review and rating,mohan babu rowdy review,ram gopal varma rowdy movie rating,rowdy,rowdy cinema rating,rowdy cinema review,rowdy film rating,rowdy film review,rowdy live updates,rowdy movie rating,rowdy movie review,rowdy movie review and rating,rowdy rating,rowdy story,rowdy telugu movie rating,rowdy telugu movie review,rowdy telugu review,rowdy tweet review