Templates by BIGtheme NET
Home >> REVIEWS >> సాహో రివ్యూ

సాహో రివ్యూ


చిత్రం: సాహో
తారాగణం: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది
సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం)
కూర్పు: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌
కథ, దర్శకత్వం: సుజీత్‌
విడుదల తేదీ: 30-08-2019

ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా…
‘సాహో’ టీజర్‌, ట్రైలర్ చూశాక అందరినోట వినిపించిన మాట ఇది. ఆ రేంజ్‌లో తెరకెక్కిన సినిమా మరి. ‘బాహుబలి’ ప్రభాస్‌, బాలీవుడ్‌ దివా శ్రద్ధ కపూర్‌ ఓ పక్క… భారీ తారాగణం, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి సినిమా ఆసక్తికరంగా రూపొందింది. అందుకే  ‘ఇట్స్‌ షో టైమ్‌…’ అంటూ సాగిన టీజర్‌ వచ్చినప్పటి నుంచే సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత విడుదల చేసిన ప్రతి లుక్‌, వీడియోలతో అది మరింత ఎక్కువైంది. సుమారు ₹300 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రూ. రెండు లక్షల కోట్లు చుట్టూ… 

ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ సిటీలో ‘సాహో’ కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్‌)… రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ పగ పెంచుకుంటాడు. ఓసారి రాయ్‌ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. పోయిన ఆ రూ.రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. మరోవైపు ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) సీన్‌లోకి వస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని ఎవరు చంపారు, విశ్వక్‌ రూ.రెండు లక్షల కోట్లు సంపాదించాడా, అశోక్‌ చక్రవర్తి – అమృతా నాయర్‌ ప్రేమ ఏమైంది, అసలు ఇందులో సాహో ఎవరు అనేదే కథ.

ఛేజ్‌లు.. తుపాకులు..ఫైట్లు

గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రాణం యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు. ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. హాలీవుడ్‌ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్‌ సినిమాను తెరకెక్కించాడు. తొలి సన్నివేశం నుంచి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, తుపాకులు, బాంబులు, ఛేజ్‌లతో సినిమా మొత్తం ఆ ఫీల్‌ కనిపిస్తుంది. మొదట్లోనే గ్యాంగస్టర్‌ లీడర్‌ రాయ్‌ చనిపోవడంతో ఈ సినిమా అండర్‌ వరల్డ్‌ వారసత్వం గురించే అని అర్థమవుతుంది. పోటాపోటీ సీన్లు, డైలాగ్‌లతో సినిమా వేడెక్కుతుంది. వాజీలో డాన్‌ వారసుడిగా విశ్వక్‌ రావడం, మరోవైపు ముంబయిలో వరుస దొంగతనాల విచారణకు అండర్‌ కాప్‌గా ప్రభాస్ రంగంలోకి దిగడంతో సినిమా వేగం పెరుగుతుంది. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి అశోక్‌ చక్రవర్తి వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా సాగుతుంది. సినిమా ఆఖరులో వచ్చే ప్రభాస్‌ పాత్రలో రెండో షేడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. చాలావరకు సినిమా ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షోగా నడుస్తుంది. మిగిలిన పాత్రలకు అంతగా అవకాశం లేదు. దీంతోపాటు దేవరాజ్‌ పాత్ర తప్ప మిగిలిన డాన్‌లు అంత పవర్‌ఫుల్‌గా లేకపోవడమూ ఓ లోటు.

భారీ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు  కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ అదుర్స్‌ అనిపించారు. ఎడారిలో భారీకాయులతో ప్రభాస్‌ చేసిన ఫైట్‌ సినిమా అదనపు ఆకర్షణ. ముంబయి నగరంలో శ్రద్ధ కపూర్‌తో కలసి చేసిన గన్‌ ఫైట్లు బాగుంటాయి. శ్రీలంక అందం జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్‌ ఆడిపాడిన ‘బ్యాడ్‌ బాయ్‌…’ పాట కుర్రకారుకి కిక్‌ ఇస్తుంది. సినిమా హాలీవుడ్‌ స్టైల్‌లో ఉన్నా మన నేటివిటీ పోకుండా దర్శకుడు సుజిత్‌ జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లిష్‌ స్టైల్‌కి తెలుగు నేటివిటీని జోడించి తీర్చిదిద్దాడు. హీరో- హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, సగటు అమ్మాయిగా శ్రద్ధ కపూర్‌ ఆలోచనలు, ఆఖరులో చూపించిన దాతృత్వానికి సంబంధించిన అంశాలు ఇలా అన్నీ మన స్టైలే. అయితే తెర మొత్తం బాలీవుడ్ విలన్లు, ఇంగ్లిష్‌ రౌడీలతో నిండిపోవడంతో అప్పుడప్పుడు ఇది డబ్బింగ్‌ సినిమానా అనిపిస్తుంది.

డార్లింగ్‌ వన్‌ మ్యాన్‌ షో

ప్రభాస్‌ అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్‌ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్‌ హీరోలను తలపించాడు. ప్రేమ సన్నివేశాల్లో ‘మిర్చి’ రోజులను గుర్తు చేశాడు. పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ… అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. యాక్షన్‌ – ప్రేమను మిళితం చేయడంతో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. గ్యాంగ్‌స్టర్‌ నాయకుడిగా చుంకీ పాండే చక్కటి నటన కనబరిచాడు. డాన్‌ లుక్‌లో తన స్టైల్‌ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.

బలాలు
ప్రభాస్‌ 
యాక్షన్‌ సన్నివేశాలు
నిర్మాణ విలువలు
బలహీనతలు  
వినోదం
పాటలు 
స్క్రీన్‌ ప్లే

ప్లస్ పాయింట్స్ :

అత్యంత భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్ తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

ఇక కథానాయకగా నటించిన శ్రద్ధా కపూర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ శ్రద్ధా కపూర్ పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ప్రభాస్ – శ్రద్ధా కపూర్ మధ్య కెమిస్ట్రీ మరియు ప్రభాస్ క్యారెక్టర్ లోని షేడ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కీలక మైన మరియు క్రూరమైన పాత్రలో నటించిన విలన్ ఛంకీ పాండే తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. విలన్స్ కి సంబంధించిన. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో వాళ్ళ నటన చాల బాగుంది.

అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, లాల్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సుజిత్ ఎక్కడా విజువల్ ట్రీట్ తగ్గకుండా.. మరియు భారీ యాక్షన్స్ సీన్స్ తో సినిమాని నడిపాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ స్, మరియు ప్రభాస్ – శ్రద్ధా మధ్య ట్రాక్, ఛేజింగ్ సీన్స్, అదేవిదంగా క్లైమాక్స్ లోని ట్విస్ట్ లు, అండ్ ప్రభాస్ యాక్షన్ పార్ట్.. సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మైనస్ పాయింట్స్ :

హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ ప్లేతో సాగే ఈ సినిమా, ట్విస్ట్ లు అండ్ యాక్షన్ లాంటి కీలక అంశాలు పరంగా ఆకట్టుకున్నా.. కథ పరంగా సినిమాలో ఎలాంటి కొత్తధనం లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్ బోరింగ్ ట్రీట్మెంట్, ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్ అదే విధంగా ముందుగానే అర్ధమయ్యే కొన్ని ట్విస్ట్ లు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దర్శకుడు ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బాగా నెమ్మదిగా నడిపారు. అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ముఖ్యంగా ఆ సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. స్క్రీన్ ప్లే ‘బి.సి’ సెంటర్ ఆడియన్స్ కి కూడా అర్ధమయ్యేలా ఇంట్రస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది.

ఇక కొన్ని సీన్స్ లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్లు లేవు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడంతో రన్నింగ్ టైం ఎక్కువ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. పైగా స్టోరీ కంటే కూడా సినిమాలో యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని చోట్ల కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం, విలన్స్ కూడా ఎక్కువ అవ్వడం కూడా సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే…మధి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది.

ఇక సంగీత దర్శకులు తనిష్క్ బాగ్చి, గురు రాంధ్వా, బాద్షా, శంకర్ ఎహసాన్ లాయ్ సమకూర్చిన పాటలు వినడానికి కంటే.. స్క్రీన్ మీద బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా వచ్చిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో, థ్రిల్ చేసే ట్విస్ట్ లతో, అండ్ వావ్ అనిపించే స్పెషల్ ఎఫెక్ట్స్ తో మరియు బలమైన ప్రభాస్ స్క్రీన్ ప్రేజన్సీతో ఆసక్తికరంగా సాగినప్పటికీ.. స్లోగా సాగే సీన్స్ తో అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్ తో, బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ భారీ విజువల్స్ మరియు గ్రేట్ స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రభాస్ నటన బాగా అలరిస్తాయి. మొత్తానికి ‘సాహో’ కథతో ఆకట్టుకోలేకపోయినా.. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి విజువల్ ట్రీట్ లా అనిపిస్తోంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


‘సాహో’ : లైవ్ అప్డేట్స్:

  • మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.మరికొద్ది సేపట్లో పూర్తి రివ్యూ..

  • ఇప్పుడు అరుణ్ విజయ్ మరియు నీల్ నితిన్ ముఖేష్ లు అసలు ఆ బ్లాక్ బాక్స్ వెనుకున్న మిస్టరీలను వెల్లడిస్తున్నారు.ఇప్పుడు ప్రభాస్ మరియు చుంకీ పాండేల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

  • ఇప్పుడు హీరో మరియు విలన్ ల గ్యాంగ్ మధ్య ప్రీ క్లైమాక్స్ పోరాట సన్నివేశం మొదలయ్యింది.

  • ఇప్పుడు మరొక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ మొదలయ్యింది.విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకోడానికి ప్రభాస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

  • మరికొన్ని దాడుల తర్వాత విలన్ గ్యాంగ్ లెక్కలు తేల్చేందుకు ప్రభాస్ సిద్ధం అయ్యాడు.ఈ మొత్తం ఫైట్ అంతా ఆ బ్లాక్ బాక్స్ చుట్టూనే తిరుగుతుంది.

  • ఈ పాటలో విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉండడమే కాకుండా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.

  • ఇప్పుడు విలన్ గ్యాంగ్ ప్రభాస్ మరియు శ్రద్ధాల పై దాడి చేసేందుకు ప్లాన్ చెయ్యగా వారి నుంచి వీరిద్దరూ తప్పించుకున్నారు.ఇప్పుడు ఇద్దరి మద్య మరో డ్యూయెట్ బేబీ వోంట్ యూ టెల్ మీ పాట వస్తుంది.

  • సినిమా మొదట్లో కనిపించిన మరో ప్రధాన విలన్ చుంకి పాండే మరో కీలక సన్నివేశంతో ఇప్పుడు మళ్ళీ కథలోకి వచ్చారు.ఇప్పుడు మరోసారి ఆ బ్లాక్ బాక్స్ కోసం కీలక చర్చ నడుస్తుంది.

  • జాక్వలిన్ ఎప్పటిలానే స్టన్నింగ్ గా కనిపిస్తుంది.ప్రభాస్ కొన్ని సర్ప్రైజ్ డాన్స్ మూమెంట్స్ తో ఈ బ్యాడ్ బాయ్ సాంగ్ లో ఆకట్టుకుంటున్నాడు.

  • ఇంటర్వెల్ అనంతరం కొన్ని అద్భుతమైన విజువల్స్ తర్వాత ఇప్పుడు మరో హిట్ ట్రాక్ బ్యాడ్ బాయ్ సాంగ్ మొదలయ్యింది.

  • ఇప్పుడు ప్రభాస్ పాత్రకు సంబంధించిన అసలు రంగు బయట పడడంతో సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.

  • ఇప్పుడొక ఊహించని ట్విస్ట్ తో భారీ చేజింగ్ సీన్ కు రంగం సిద్ధమయ్యింది.

  • ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రధారుడు నీల్ నితిన్ ముఖేష్ జై గా ఎంటర్ అయ్యాడు.ఇతను కూడా ఆ బ్లాక్ బాక్స్ కోసమే వెతుకుతున్నాడు.కానీ ఆ బ్లాక్ బాక్స్ వెనుకున్న మిస్టరీ ఏమిటా అన్నది ఇంకా వెల్లడి కాలేదు.

  • మరోపక్క ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాల నడుమ మరో హిట్ సాంగ్ ఏ చోట నువ్వున్నా పాట వస్తుంది.ఈ పాటలోని విజువల్స్ చాలా అద్భుతంగా, చక్కగా కనిపిస్తున్నాయి.

  • ఇప్పుడు విలన్ల గ్యాంగ్ ట్రైలర్ లో చెప్పిన బ్లాక్ బాక్స్ ను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పుడు కథనంలో మరింత కీలకమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

  • ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు హిట్ సాంగ్ సైకో సైయాన్ కు దారి తీసాయి.పబ్ లో వస్తున్న ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది.

  • ఇప్పుడు ప్రభాస్ మరియు శ్రద్దాలు ఆ దొంగతనం చేసిన గ్యాంగ్ ను పట్టుకోడానికి ప్లాన్ చేస్తున్నారు.ఆ సంబంధిత కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • అశోక్(ప్రభాస్) మరియు అమృత(శ్రద్దా)ల మధ్య కొన్ని కీలక సన్నివేశాల తర్వాత అశోక్ ఈ దొంగతనం కేసుకు సంబంధించి ఒక క్లూ ను కనుగొన్నాడు.

  • ఇప్పుడు తమిళ్ నటుడు అరుణ్ విజయ్ పాత్ర ఎంట్రీ ఇచ్చింది.ప్రభాస్,వెన్నెల కిషోర్ మరియు మురళి శర్మల మధ్య కొన్ని హాస్య సన్నివేశాల అనంతరం క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎంట్రీ ఇచ్చింది.

  • ఇప్పుడు అసలు సిసలైన ఎంట్రీ..భారీ యాక్షన్ సీన్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ ఫుల్ మాస్ ఎంట్రీ ఇచ్చారు.ఈ ఎంట్రీతో థియేటర్ దద్దరిల్లింది.

  • ఇప్పుడు ట్రైలర్ లో చూపించిన 2000 కోట్ల దొంగతనం కేసుకు సంబంధించిన సీరియస్ చర్చ పోలీసుల మధ్య నడుస్తుంది.

  • ఇప్పుడు రాయ్ గా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ పరిచయం అయ్యారు.ఇదే సన్నివేశంలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా జాయిన్ అయ్యారు.

  • ఇప్పుడు విలన్ గ్యాంగ్స్ ను పరిచయం చేస్తూ ఒక క్లుప్తమైన సన్నివేశం వస్తుంది.ఇప్పుడు సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి పాత్ర ఎంటర్ అయ్యింది.

  • 171 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

  • విజయవాడలో భారీ కోలాహలం,అభిమానుల ఈలల మధ్య సినిమా మొదలయ్యింది.

  • ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక స్క్రీనింగ్ నుంచి మీకోసం లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాము..

ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచవ్యాప్తంగా భారీ స్దాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉండగా .. అరబ్ స్టేట్స్ లో సెన్సార్ కోసం ఈ సినిమాను ప్రదర్శించడంతో సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాజాగా ఈ సినిమా చూసిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. సినిమా ఫస్ట్ హాఫ్ ఏవరేజ్ గా ఉందని.. సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు.

ప్రభాస్ నటన, ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్, యాక్షన్ పార్ట్ బాగున్నాయని కానీ పాటలు, రొటీన్ స్టోరీ బాగా విసిగించాయని కామెంట్స్ పెడుతున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొన్ని సన్నివేశాల్లో బాలేదని అంటున్నారు. హిందీ వెర్షన్ చూసిన వారు.. ప్రభాస్ డబ్బింగ్ పెద్దగా సూట్ కాలేదని.. రన్నింగ్ టైం చాలా ఎక్కువగా ఉందని ఓవరాల్ గా సినిమా బాగాలేదని తేల్చేస్తున్నారు.

సినిమాలో యాక్షన్ తప్ప సరైన స్టోరీ లేదని..స్క్రీన్ ప్లే వర్క్ బాలేదని.. కామెడీ లేదని, విలన్స్ ఎక్కువయ్యారని.. నిడివి ఎక్కువ కావడంతో సినిమా బోరింగ్ గా అనిపించిందని అంటున్నారు. ప్రభాస్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చని చెబుతున్నారు. 

‘సాహో’ సినిమా కోసం సినిమా లవర్స్ అంతా ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికి తెలిసిందే. ఆ వెయిటింగ్‌కి తగ్గ స్టఫ్ కూడా ఆ సినిమాలో ఉంది అనేది టీజర్స్ అండ్ ట్రైలర్స్ తోనే అర్ధమైపోయింది. అందుకే ఆ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారుతుంది. మరి అంత హైప్ ఉన్న ‘సాహో’కి తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అనుమతులు రాక ఆపేసారు. 

ఇక ఓవర్సీస్‌లో ఎప్పట్లానే ముందు రోజు ప్రీమియర్స్ అనేది కామన్. నిజానికి ఫస్ట్ షో పడేది అక్కడే కాబట్టి ‘సాహో’ ఫస్ట్ రిపోర్ట్ అక్కడి నుండే రావాల్సి ఉంది. కానీ ఈ సారి సీన్ మారింది. ప్రపంచంలో ‘సాహో’ ఫస్ట్ షో దుబాయ్‌లో పడబోతోంది. ఈ సినిమాకి అక్కడ అంత క్రేజ్ రావడానికి కారణం కూడా ఉంది. ఈ సినిమాలో ఎక్కవ భాగం దుబాయ్ లోనే షూట్ చేసారు. స్టయిలిష్‌గా షూట్ చేసిన ఛేజింగ్ సీన్స్,హై ఆక్టే న్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా తెరకెక్కించ్చింది దుబాయ్ లోనే. 

పైగా సాహో ప్రొడక్షన్ దశలో ఉండగానే అక్కడి మీడియా ఆ సినిమాకి సంబంధించి స్పెషల్ కవరేజ్ ఇచ్చింది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీ అంటూ కితాబులిచ్చింది. ప్రభాస్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇంటర్వూస్ సైతం టెలికాస్ట్ చేశారు. అందుకే ఆ సినిమా పై అక్కడ అంత బజ్ నెలకొంది. పైగా ‘సాహో’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంది కూడా దుబాయ్‌కి సంబందించిన సంస్థే. 

అందుకే సినీ జగమంతా ఒక అద్భుతంలా భావిస్తున్న ‘సాహో’ మొట్టమెదటి షో దుబాయ్‌లోనే పడుతుంది. అసలు సిసలు టాక్ అక్కడినుండి రాబోతుంది. అయితే అందరి ఊహాగానాలు నిజమయ్యేలా ‘సాహో’ వండర్స్ క్రియేట్ చెయ్యడం మాత్రం ఖాయం అని ధీమాగా ఉంది టీమ్ సాహో. 

చిత్రం: సాహో తారాగణం: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం) కూర్పు: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌ నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ కథ, దర్శకత్వం: సుజీత్‌ విడుదల తేదీ: 30-08-2019 ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా... ‘సాహో’ టీజర్‌, ట్రైలర్ చూశాక అందరినోట వినిపించిన మాట ఇది. ఆ రేంజ్‌లో తెరకెక్కిన సినిమా మరి. ‘బాహుబలి’ ప్రభాస్‌, బాలీవుడ్‌ దివా శ్రద్ధ కపూర్‌ ఓ పక్క... భారీ తారాగణం, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి సినిమా ఆసక్తికరంగా రూపొందింది. అందుకే  ‘ఇట్స్‌ షో టైమ్‌...’ అంటూ సాగిన టీజర్‌ వచ్చినప్పటి నుంచే సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత విడుదల చేసిన ప్రతి లుక్‌, వీడియోలతో అది మరింత ఎక్కువైంది. సుమారు ₹300 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ. రెండు లక్షల కోట్లు చుట్టూ...  ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ సిటీలో ‘సాహో’ కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్‌)… రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ పగ పెంచుకుంటాడు. ఓసారి రాయ్‌ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. పోయిన ఆ రూ.రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. మరోవైపు ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) సీన్‌లోకి వస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని ఎవరు చంపారు, విశ్వక్‌ రూ.రెండు లక్షల కోట్లు సంపాదించాడా, అశోక్‌ చక్రవర్తి - అమృతా నాయర్‌ ప్రేమ ఏమైంది, అసలు ఇందులో సాహో ఎవరు అనేదే కథ. ఛేజ్‌లు.. తుపాకులు..ఫైట్లు గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రాణం యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు. ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. హాలీవుడ్‌ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్‌ సినిమాను తెరకెక్కించాడు. తొలి సన్నివేశం నుంచి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, తుపాకులు, బాంబులు, ఛేజ్‌లతో సినిమా మొత్తం ఆ ఫీల్‌ కనిపిస్తుంది. మొదట్లోనే గ్యాంగస్టర్‌ లీడర్‌ రాయ్‌ చనిపోవడంతో ఈ సినిమా అండర్‌ వరల్డ్‌ వారసత్వం గురించే అని అర్థమవుతుంది. పోటాపోటీ సీన్లు, డైలాగ్‌లతో సినిమా వేడెక్కుతుంది. వాజీలో డాన్‌ వారసుడిగా విశ్వక్‌ రావడం, మరోవైపు ముంబయిలో వరుస దొంగతనాల విచారణకు అండర్‌ కాప్‌గా ప్రభాస్ రంగంలోకి దిగడంతో సినిమా వేగం పెరుగుతుంది. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి అశోక్‌ చక్రవర్తి వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా సాగుతుంది. సినిమా ఆఖరులో వచ్చే ప్రభాస్‌ పాత్రలో రెండో షేడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. చాలావరకు సినిమా ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షోగా నడుస్తుంది. మిగిలిన పాత్రలకు అంతగా అవకాశం లేదు. దీంతోపాటు దేవరాజ్‌ పాత్ర తప్ప మిగిలిన డాన్‌లు అంత పవర్‌ఫుల్‌గా లేకపోవడమూ ఓ లోటు. భారీ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు  కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ అదుర్స్‌ అనిపించారు. ఎడారిలో భారీకాయులతో ప్రభాస్‌ చేసిన ఫైట్‌ సినిమా అదనపు ఆకర్షణ. ముంబయి నగరంలో శ్రద్ధ కపూర్‌తో కలసి చేసిన గన్‌ ఫైట్లు బాగుంటాయి. శ్రీలంక అందం జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్‌ ఆడిపాడిన ‘బ్యాడ్‌ బాయ్‌...’ పాట కుర్రకారుకి కిక్‌ ఇస్తుంది. సినిమా హాలీవుడ్‌ స్టైల్‌లో ఉన్నా మన నేటివిటీ పోకుండా దర్శకుడు సుజిత్‌ జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లిష్‌ స్టైల్‌కి తెలుగు నేటివిటీని జోడించి తీర్చిదిద్దాడు. హీరో- హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, సగటు అమ్మాయిగా శ్రద్ధ కపూర్‌ ఆలోచనలు, ఆఖరులో చూపించిన దాతృత్వానికి సంబంధించిన అంశాలు ఇలా అన్నీ మన స్టైలే. అయితే తెర మొత్తం బాలీవుడ్ విలన్లు, ఇంగ్లిష్‌ రౌడీలతో నిండిపోవడంతో అప్పుడప్పుడు ఇది డబ్బింగ్‌ సినిమానా అనిపిస్తుంది. డార్లింగ్‌ వన్‌ మ్యాన్‌ షో ప్రభాస్‌ అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్‌ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్‌ హీరోలను తలపించాడు. ప్రేమ సన్నివేశాల్లో ‘మిర్చి’ రోజులను గుర్తు చేశాడు. పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ... అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ…

సాహో రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.25
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 2.25

3

సాహో రివ్యూ

సాహో రివ్యూ

User Rating: 3.6 ( 1 votes)
3