నటీనటులు : మహేష్ బాబు, విజయ శాంతి, రష్మిక మందాన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రావు రమేష్, సంగీత తదితరులు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాతలు : రామ బ్రహ్మం సుంకర
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : రత్నవేలు
ఎడిటర్: తమ్మిరాజు
సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా రాక కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ చిత్రం ఈ రోజు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ (మహేష్ బాబు) పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీమ్ తో శత్రువుల పై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీమ్ లోని అజేయ్ (సత్యదేవ్) అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోయే పరిస్థితిలో వెళ్లిపోవడంతో.. అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి (భారతి)కి ఈ విషయం చెప్పి.. భరోసా ఇవ్వడానికి అజేయ్ కృష్ణ కర్నూల్ కు వస్తాడు. ఈ మధ్యలో సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయం.. ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తరువాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూల్ లో విజయశాంతి (భారతి)ని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా.. మహేష్ వచ్చి వాళ్ళను సేవ్ చేస్తాడు. అసలు విజయశాంతి (భారతి) మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మహేష్ బాబు ఎలా సేవ్ చేసాడు? శివ కి విలన్ ప్రకాష్ రాజ్ కి ఎలా బుద్ధి చెప్పాడు? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సంక్రాంతికి ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఆకట్టుకోవడానికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. మహేష్ బాబు ఫైట్స్ అండ్ యాక్షన్ తో పాటు ఆయన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక ప్రధానంగా సినిమాలో ట్రైన్ ఎపిసోడ్, మహేష్ – రష్మిక మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు, విజయశాంతి ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ సీన్ మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు అదేవిదంగా అనిల్ మార్క్ కామెడీ పంచ్ లు అండ్ మ్యానరిజమ్స్ చాల బాగున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక నటన పరంగా తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో బాగానే నటించింది. అలాగే కీలకమైన విజయశాంతి రోల్… అలాగే ఆ పాత్రలో ఆమె నటించిన విధానం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన కూడా మాజీ హీరోయిన్ ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా చేసింది.
ఆలగే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన ఒకప్పటి కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామిక్ హావభావాలతో నవ్విస్తారు.
అలాగే ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. కామెడీని హ్యాండిల్ చేయడంలో ‘పటాస్’ నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో కామెడీతో పాటు బలమైన యాక్షన్ అండ్ ఎమోషన్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
మైనస్ పాయింట్స్ :
అనిల్ రావిపూడి కామెడీతో పాటు యాక్షన్ తో ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. పైగా అనిల్ రావిపూడి అంటే ఫుల్ కామెడీ ఉంటుందనుకుంటే.. ఆ విషయంలో కూడా తడబడ్డాడు. కామెడీ బాగానే వున్నా.. ఆయన గత సినిమాల రేంజ్ లో లేదు, ఇక కొన్ని సీన్స్ లో రష్మిక చిన్న పిల్లలా అనిపించింది. డ్యాన్సుల వరకు ఓకే అనిపించినా.. సినిమాలో ఆమె పాత్రకు హుందాతనం మిస్ అవ్వడంతో పాటు ఆమె ఓవర్ యాక్టింగ్ కూడా ఎక్కువైపోయింది.
పైగా సినిమా మొదటి భాగంలో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, పైగా చాల సన్నివేవాలు సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమా రేంజ్ ని తగ్గిస్తాయి. అలాగే కొన్ని చోట్ల పేలని కామెడీ, రష్మికను సరిగ్గా వాడుకోలేకపోవడం, విజయశాంతి పాత్రకు ఇంకా ప్రాధాన్యం ఉండాలని ఫీలింగ్ రావడం లాంటివి మైనస్ గా నిలుస్తాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కథలో బలం లేకపోయినా, కామెడీతో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. సినిమాలో విజువల్ గా మాత్రం పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.
తీర్పు :
పైన చెప్పుకున్నట్లుగానే దర్శకుడు కామెడీతో పాటు ఎమోషన్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నప్పటికీ.. ముఖ్యంగా ఇంటర్వెల్ అండ్వార్నింగ్ సీన్ అండ్ క్లైమాక్స్ కు ముందు వచ్చే కొన్ని సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ మరియు సెకెండ్ హాఫ్ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి తడబడ్డాడు. పైగా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, కొన్ని సన్నివేవాలు సినిమాటిక్ గా సాగడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. అయితే మహేష్ బాబు నటనతో తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే విజయశాంతి కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం మహేష్ బాబు ఫాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.
-
ఒక ఫన్నీ నోట్ తో సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 04:33 AM January 11, 2020 -
ఇప్పుడు విజయశాంతి మరియు మహేష్ ల మధ్య ఆర్మీ జవాన్లకు గుర్తుగా బ్యాక్ డ్రాప్ లో టైటిల్ సాంగ్ తో మంచి ఎమోషనల్ సీన్ వస్తుంది.
Date & Time : 04:20 AM January 11, 2020 -
మంత్రులతో ఒక సీరియస్ సన్నివేశం అనంతరం మోస్ట్ అవైటెడ్ మాస్ నెంబర్ మైండ్ బ్లాక్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 04:09 AM January 11, 2020 -
ఇప్పుడు నల్లమల అడవుల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 04:02 AM January 11, 2020 -
ఇప్పుడు కొన్ని ఆసక్తికర ఇన్వెస్టిగేషన్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:55 AM January 11, 2020 -
క్రైమ్ బ్రాంచ్ సభ్యులుగా సుబ్బరాజ్ మరియు వెన్నెల కిషోర్ లు ఇప్పుడే ఎంటర్ అయ్యారు.
Date & Time : 03:45AM January 11, 2020 -
మహేష్ మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య జరుగుతున్న గొడవలకు సంబంధించిన సీన్స్ చక్కగా వస్తున్నాయి.
Date & Time : 03:42AM January 11, 2020 -
ప్రకాష్ రాజ్ ఇంట్లో ఒక అదిరిపోయే ఫైట్ తర్వాత సూర్యుడివో చంద్రుడివో పాట మొదలయ్యింది.
Date & Time : 03:34 AM January 11, 2020 -
ఇప్పుడు పోసాని మరియు బ్రహ్మాజీల మధ్య అనీల్ మార్క్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:25 AM January 11, 2020 -
ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.ఇప్పుడు మహేష్ మరియు విజయశాంతిలు మధ్య కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ వస్తున్నాయి.
Date & Time : 03:21 AM January 11, 2020 -
ప్రకాష్ రాజ్ మరియు విజయశాంతిలకు మధ్య ఉన్న గొడవకు కారణాలను తెలుపుతూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది.
Date & Time : 03:18 AM January 11, 2020 -
ఇంటర్వెల్ అనంతరం మహేష్ ను కృష్ణ గారి అల్లూరి సీతారామ రాజులా అజయ్ ఒక అదిరిపోయే ఎలివేషన్ ఇస్తున్నాడు.
Date & Time : 03:15 AM January 11, 2020 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డీసెంట్ కథనం మరియు అదిరిపోయే కామెడీ ఎపిసోడ్స్ తో నడిచింది.కానీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సెకండాఫ్ అదిరే రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పేసింది.అలాగే మహేష్ మేకోవర్ ఫ్యాన్స్ కు పండుగలా ఉంటుంది.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 03:10 AM January 11, 2020 -
ఒక ఆసక్తికర ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ బ్యాంగ్ తో సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 03:05 AM January 11, 2020 -
ఇప్పుడు కర్నూలు కొండా రెడ్డి బురుజు సెంటర్ దగ్గర హై వోల్టేజ్ యాక్షన్ సీన్ కు రంగం సిద్ధం అయ్యింది.
Date & Time : 02:58 AM January 11, 2020 -
ట్రైన్ ఎపిసోడ్ పూర్తయ్యింది.అలాగే విజయశాంతికు సంబంధించిన కొన్ని సన్నివేశాల తర్వాత ప్రకాష్ రాజ్ గ్యాంగ్ ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date & Time : 02:50 AM January 11, 2020 -
ఇప్పుడు మరో సూపర్ హిట్ ట్రాక్ హీ ఈజ్ సో క్యూట్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 02:45 AM January 11, 2020 -
7ఓ క్లాక్ బ్లేడ్ తో బండ్ల గణేష్ హిలేరియస్ కామెడీ ట్రాక్ మొదలయ్యింది.
Date & Time : 02:40 AM January 11, 2020 -
ఇప్పుడు మహేష్ మరియు రష్మిక ఫ్యామిలీ మధ్య హిలేరియస్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 02:35 AM January 11, 2020 -
సంస్కృతీ(రష్మిక) రైల్వే స్టేషన్ లో అజయ్ కృష్ణ(మహేష్ బాబు)ని చూసి లవ్ లో పడింది.ఇపుడు అతన్ని ఇంప్రెస్ చెయ్యటానికి ఆమె ట్రై చేస్తుంది.
Date & Time : 02:25 AM January 11, 2020 -
ఇప్పుడు ట్రైన్ ఎపిసోడ్ మొదలయ్యింది.రావు రమేష్,సంగీత మరియు రష్మికాలు ఇప్పుడు ఎంటర్ అయ్యారు.కమెడియన్ సత్య మరియు హరితేజలు కూడా ఇదే సీన్ లో కనిపిస్తున్నారు.
Date & Time : 02:20 AM January 11, 2020 -
ఒక పవర్ఫుల్ ఇంట్రోతో కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకాష్ రాజ్ పాత్ర పరిచయం అయ్యింది.అతని విలనిజం కు తగ్గ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 02:18 AM January 11, 2020 -
ఓ ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత మహేష్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు కర్నూల్ బయలుదేరారు.ఇప్పుడు ఎంతో హైలైట్ అయిన ట్రైన్ ఎపిసోడ్ మొదలు కాబోతుంది.
Date & Time : 02:10 AM January 11, 2020 -
ఇప్పుడు మహేష్ మరియు సత్యదేవ్ లు కలిసి ఆసక్తికర ఆపరేషన్ సీన్ లో ఉన్నారు.
Date & Time : 02:03 AM January 11, 2020 -
పాట పూర్తయ్యిన అనంతరం ఒక ఊహించని ట్విస్ట్.సత్య దేవ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
Date & Time : 02:00 AM January 11, 2020 -
ఈ పాటలో మహేష్ వేస్తున్న స్టెప్స్ అభిమానులకు ఫీస్ట్ లా అనిపించడం ఖాయం.
Date & Time : 01:58 AM January 11, 2020 -
ఓ చిన్న చేజింగ్ సన్నివేశం అనంతరం ఆ ఆర్మీ టీం లో తమన్నా చేరింది.ఇప్పుడు చిత్రంలోని మంచి హిట్టయిన పార్టీ సాంగ్ డాంగ్ డాంగ్ వైపు వెళ్తుంది.
Date & Time : 01:52 AM January 11, 2020 -
భారత జెండాను పట్టుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.మహేష్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు ఒక బాంబు స్క్వాడ్ ఆపరేషన్ లో ఉన్నారు.
Date & Time : 01:49 AM January 11, 2020 -
విజయశాంతి పాత్రను ఎలివేట్ చేస్తూ టీజర్ లో ఉన్న “గాయం విలువ” అని చెప్పే డైలాగ్ వస్తుంది.
Date & Time : 01:45 AM January 11, 2020 -
ఇప్పుడు కర్నూలులోని ఒక మెడికల్ కాలేజ్ షాట్స్ తో చిత్రం మొదలయ్యింది.అక్కడి ప్రొఫిసర్ గా విజయశాంతి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 01:42 AM January 11, 2020 -
భారత ఆర్మీకు ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలుపుతూ ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 01:37 AM January 11, 2020 -
హాయ్..169 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 01:30 AM January 11, 2020
సరిలేరు నీకెవ్వరు రివ్యూ
Story - Screenplay
Star Cast Performances
సాంకేతిక వర్గం పనితీరు
దర్శకత్వ ప్రతిభ
సరిలేరు నీకెవ్వరు రివ్యూ
సరిలేరు నీకెవ్వరు రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

