Templates by BIGtheme NET
Home >> REVIEWS >> తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ రివ్యూ

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ రివ్యూ


సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ జంటగా దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ “తెనాలి రామకృష్ణ బిఏబిఎల్”. స్రవంతి రామ్ క్రియేషన్స్ మరియు ఎస్ ఎన్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అగ్రహారం నాగిరెడ్డి మరియు కె సంజీవ రెడ్డి నిర్మించారు. వంద శాతం నవ్వులు గ్యారంటీ అని చెప్పిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి తెనాలి రామకృష్ణ ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించాడో సమీక్షలో చూద్దాం.

కథ:

కర్నూలు ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలనుకున్న సింహాద్రి నాయుడు(అయ్యప్ప శర్మ) తనకు అడ్డుగా ఉన్న వరలక్ష్మీ దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని ఓ జర్నలిస్ట్ మర్డర్ కేసులో పోలీసుల సాయంతో దొంగ సాక్ష్యాలు పుట్టించి అరెస్ట్ చేయిస్తాడు. కోర్టులో ఉన్న పెండింగ్ సివిల్ కేసులను బయట తన తెలివి తేటలతో కాంప్రమైజ్ చేసే కేసులు లేని కుర్ర లాయర్ తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్) అత్యంత క్లిస్టమైన వరలక్ష్మీ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. మరి వరలక్ష్మీ కేసును తెనాలి రామకృష్ణ ఎలా డీల్ చేశారు? అసలు జర్నలిస్ట్ ని చంపింది ఎవరు? ఈ కేసులో అసలు నేరస్థులకు తెనాలి రామకృష్ణ శిక్ష పడేలా చేశాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

తెనాలి రామకృష్ణ మూవీ పూర్తి స్థాయి కామెడీ సినిమా అని ప్రచారం జరిగిన నేపథ్యంలో కామెడీ ఆశించి వెళ్లిన ప్రేక్షకుడికి తెనాలి రామ కృష్ణ బిఏ బిఎల్ చిత్రం అది అందించిందా అంటే అనుమానమే. ఫస్ట్ హాఫ్ చక్కని కామెడీ, సందీప్ పాత్రకు తగ్గట్టుగా ఎలివేషన్ సీన్స్ తో పాటు హీరోయిన్ తో నడిచే కెమిస్ట్రీ, సాంగ్స్…, ఇలా సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది. ఎక్కడా నెమ్మదించని స్క్రీన్ ప్లే మరియు కామెడీ టైమింగ్ తో తెనాలి రామకృష్ణ ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. అలాగే సందీప్ కిషన్ కోర్ట్ తీర్పుల కంటే బయట కాంప్రమైజ్ బెటర్ అని నమ్మే కుర్ర లాయర్ పాత్ర చక్కగా చేశాడు. సాయి కార్తిక్ మ్యూజిక్ అటు పాటల పరంగా గాని, బీజీఎమ్ కానీ ఆకట్టుకొనేలా ఉన్నాయి.

ముఖ్యంగా సప్తగిరి, ప్రభాస్ శ్రీను ల కామెడీతో పాటు హీరోయిన్ హన్సిక ఫ్యామిలీ సభ్యులను సందీప్ కిషన్ డొక్కు స్కూటర్ తో గుద్దే సన్నివేశాలు కొంచెం పాతకాలపు కామెడీలా అనిపించినా నవ్విస్తాయి. సెక్షన్స్ మీద కనీస అవగాహన లేని ఇన్నోసెంట్ లాయర్ రుక్మిణి పాత్రలో హన్సిక బాగా చేశారు.

కొంచెం ఆసక్తికర మలుపుతో డీసెంట్ గా ఫస్ట్ హాఫ్ ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కూడా సప్తగిరి, పోసాని ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలతో బాగానే మొదలుపెట్టారు. ఇక అక్కడి నుండే సినిమా మొత్తం గాడి తప్పుతుంది.

మర్డర్ కేసులో సాక్షులుగా వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మల కామెడీ తో కథను రక్తికట్టించాలని చూసిన ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించే విలన్స్ తమ మర్దర్ కేసులో సాక్షులుగా ఉన్న వెన్నెల కిషోర్ ఫ్యామిలీకి ఇచ్చే ఫన్నీ ట్రీట్మెంట్స్, శిక్షలు సిల్లీగా అనిపిస్తాయి.

ఓ మర్దల్ కేసు చుట్టూ కామెడీ కథను అల్లుకున్న దర్శకుడు అటు పూర్తి కామెడీ చేయలేక, ఇటు సీరియస్ మర్డర్ స్టోరీ నడిపించలేక చేతులు ఎత్తేశాడు. ఇక ఎటువంటి కోర్ట్ రూమ్ సంఘర్షణ లేకుండా ద్రోషులకు శిక్ష వేయించేసి హడావుడిగా క్లైమాక్స్ ముగించేశారు. వరలక్ష్మీ పాత్ర ఫస్ట్ హాఫ్ కేవలం రెండు మూడు సన్నివేశాలకే పరిమితం కాగా, సెకండ్ హాఫ్ లో సిల్లీ కామెడీ మధ్య సీరియస్ విలన్ గా తేలిపోయింది.

ప్లస్ పాయింట్స్:

సందీప్ కిషన్ నటన
ఫస్ట్ హాఫ్
సాంగ్స్

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్
క్లైమాక్స్
కథ
స్క్రీన్ ప్లే

తీర్పు:

పాత ఫార్ములాతో కొత్తగా నివ్విద్దామనుకున్న దర్శకుడు నాగేశ్వర రెడ్డి ప్రయత్నం సఫలం కాలేదు. ఎక్కడా బోర్ కొట్టించని డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనంతరం మొదలైన సెకండ్ హాఫ్ నిస్తేజంగా నడిచింది. సీరియస్ విలన్ ముందు నడిచే సిల్లీ కామెడీ, ఏమాత్రం సంఘర్షణ లేని క్లైమాక్స్ ప్రేక్షకుడిని నిరాశపరుస్తాయి. చివరిగా చెప్పాలంటే తెనాలి రామ కృష్ణ తెలివితేటలు మెప్పించలేక పోయాయి.

సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ జంటగా దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ “తెనాలి రామకృష్ణ బిఏబిఎల్”. స్రవంతి రామ్ క్రియేషన్స్ మరియు ఎస్ ఎన్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అగ్రహారం నాగిరెడ్డి మరియు కె సంజీవ రెడ్డి నిర్మించారు. వంద శాతం నవ్వులు గ్యారంటీ అని చెప్పిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి తెనాలి రామకృష్ణ ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించాడో సమీక్షలో చూద్దాం. కథ: కర్నూలు ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలనుకున్న సింహాద్రి నాయుడు(అయ్యప్ప శర్మ) తనకు అడ్డుగా ఉన్న వరలక్ష్మీ దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని ఓ జర్నలిస్ట్ మర్డర్ కేసులో పోలీసుల సాయంతో దొంగ సాక్ష్యాలు పుట్టించి అరెస్ట్ చేయిస్తాడు. కోర్టులో ఉన్న పెండింగ్ సివిల్ కేసులను బయట తన తెలివి తేటలతో కాంప్రమైజ్ చేసే కేసులు లేని కుర్ర లాయర్ తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్) అత్యంత క్లిస్టమైన వరలక్ష్మీ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. మరి వరలక్ష్మీ కేసును తెనాలి రామకృష్ణ ఎలా డీల్ చేశారు? అసలు జర్నలిస్ట్ ని చంపింది ఎవరు? ఈ కేసులో అసలు నేరస్థులకు తెనాలి రామకృష్ణ శిక్ష పడేలా చేశాడా? అనేది మిగతా కథ. విశ్లేషణ: తెనాలి రామకృష్ణ మూవీ పూర్తి స్థాయి కామెడీ సినిమా అని ప్రచారం జరిగిన నేపథ్యంలో కామెడీ ఆశించి వెళ్లిన ప్రేక్షకుడికి తెనాలి రామ కృష్ణ బిఏ బిఎల్ చిత్రం అది అందించిందా అంటే అనుమానమే. ఫస్ట్ హాఫ్ చక్కని కామెడీ, సందీప్ పాత్రకు తగ్గట్టుగా ఎలివేషన్ సీన్స్ తో పాటు హీరోయిన్ తో నడిచే కెమిస్ట్రీ, సాంగ్స్…, ఇలా సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది. ఎక్కడా నెమ్మదించని స్క్రీన్ ప్లే మరియు కామెడీ టైమింగ్ తో తెనాలి రామకృష్ణ ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. అలాగే సందీప్ కిషన్ కోర్ట్ తీర్పుల కంటే బయట కాంప్రమైజ్ బెటర్ అని నమ్మే కుర్ర లాయర్ పాత్ర చక్కగా చేశాడు. సాయి కార్తిక్ మ్యూజిక్ అటు పాటల పరంగా గాని, బీజీఎమ్ కానీ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ముఖ్యంగా సప్తగిరి, ప్రభాస్ శ్రీను ల కామెడీతో పాటు హీరోయిన్ హన్సిక ఫ్యామిలీ సభ్యులను సందీప్ కిషన్ డొక్కు స్కూటర్ తో గుద్దే సన్నివేశాలు కొంచెం పాతకాలపు కామెడీలా అనిపించినా నవ్విస్తాయి. సెక్షన్స్ మీద కనీస అవగాహన లేని ఇన్నోసెంట్ లాయర్ రుక్మిణి పాత్రలో హన్సిక బాగా చేశారు. కొంచెం ఆసక్తికర మలుపుతో డీసెంట్ గా ఫస్ట్ హాఫ్ ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కూడా సప్తగిరి, పోసాని ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలతో బాగానే మొదలుపెట్టారు. ఇక అక్కడి నుండే సినిమా మొత్తం గాడి తప్పుతుంది. మర్డర్ కేసులో సాక్షులుగా వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మల కామెడీ తో కథను రక్తికట్టించాలని చూసిన ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించే విలన్స్ తమ మర్దర్ కేసులో సాక్షులుగా ఉన్న వెన్నెల కిషోర్ ఫ్యామిలీకి ఇచ్చే ఫన్నీ ట్రీట్మెంట్స్, శిక్షలు సిల్లీగా అనిపిస్తాయి. ఓ మర్దల్ కేసు చుట్టూ కామెడీ కథను అల్లుకున్న దర్శకుడు అటు పూర్తి కామెడీ చేయలేక, ఇటు సీరియస్ మర్డర్ స్టోరీ నడిపించలేక చేతులు ఎత్తేశాడు. ఇక ఎటువంటి కోర్ట్ రూమ్ సంఘర్షణ లేకుండా ద్రోషులకు శిక్ష వేయించేసి హడావుడిగా క్లైమాక్స్ ముగించేశారు. వరలక్ష్మీ పాత్ర ఫస్ట్ హాఫ్ కేవలం రెండు మూడు సన్నివేశాలకే పరిమితం కాగా, సెకండ్ హాఫ్ లో సిల్లీ కామెడీ మధ్య సీరియస్ విలన్ గా తేలిపోయింది. ప్లస్ పాయింట్స్: సందీప్ కిషన్ నటన ఫస్ట్ హాఫ్ సాంగ్స్ మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కథ స్క్రీన్ ప్లే తీర్పు: పాత ఫార్ములాతో కొత్తగా నివ్విద్దామనుకున్న దర్శకుడు నాగేశ్వర రెడ్డి ప్రయత్నం సఫలం కాలేదు. ఎక్కడా బోర్ కొట్టించని డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనంతరం మొదలైన సెకండ్ హాఫ్ నిస్తేజంగా నడిచింది. సీరియస్ విలన్ ముందు నడిచే సిల్లీ కామెడీ, ఏమాత్రం సంఘర్షణ లేని క్లైమాక్స్ ప్రేక్షకుడిని నిరాశపరుస్తాయి. చివరిగా చెప్పాలంటే తెనాలి రామ కృష్ణ తెలివితేటలు మెప్పించలేక పోయాయి.

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2
నటీ-నటుల ప్రతిభ - 3
సాంకేతిక వర్గం పనితీరు - 2
దర్శకత్వ ప్రతిభ - 2.5

2.4

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ రివ్యూ

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ రివ్యూ

User Rating: 1.95 ( 1 votes)
2