చిత్రం: తిమ్మరుసు
బ్యానర్స్: ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్
నటీనటులు: సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్, ప్రవీణ్, అంకిత్, వైవా హర్ష, భూపాల్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
నిర్మాతలు: మహేశ్ కోనేరు, సృజన్ యరబోలు
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
సెన్సార్: యు/ఎ
కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత థియేటర్స్‌లో ముందుగా విడుదలైన సినిమా తిమ్మరుసు. సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించారు. ఓ హత్య కేసులో.. నిరపరాధి అయిన యువకుడికి శిక్ష పడుతుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసుని రీపెన్ చేయించిన ఓ లాయర్ తన తెలివి తేటలతో ఆ యువకుడిని ఎలా కాపాడాడు? అనేదే తిమ్మరుసు సినిమా. మరి కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
కథ:
రామచంద్ర(సత్యదేవ్) న్యాయం కోసం ఎంత దూరమైనా పోరాడే ఓ లాయర్. రావ్ అసోసియేట్స్ అనే పెద్ద లాయర్ తన కంపెనీ ద్వారా ఎన్నో కేసులను వాదిస్తుంటాడు. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తన కంపెనీలోనే కేసులను వాదించడానికి ఓ లాయర్‌ను అపాయింట్ చేసుకోవాలనుకుంటాడు. తన తెలివి తేటలతో రామచంద్ర ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ కంపెనీలో రామచంద్ర ప్రియురాలు(ప్రియాంక జవాల్కర్) పనిచేస్తుంటుంది. రామచంద్రకు అసిస్టెంట్‌గా సుధాకర్(బ్రహ్మాజీ) సపోర్ట్ చేస్తుంటాడు. రామచంద్ర… తొలి కేసుగా ఓ క్యాబ్ డ్రైవర్‌ను చంపిన హత్య కేసులో ఎనిమిదేళ్లు శిక్షను అనుభవించి పెరోల్‌పై బయటకు వచ్చిన వాసు(అంకిత్) అనే యువకుడి కేసుని టేకప్ చేస్తారు. అసలు వాసు నిజంగానే క్యాబ్ డ్రైవర్‌ను హత్య చేశాడా? లేదా? అనే కోణంలో కేసుని రామచంద్ర తన కోణంలో దర్యాప్తు చేసుకుంటూ వస్తాడు. అలా వచ్చే క్రమంలో తనకు షాకింగ్ నిజాలు చాలా తెలుస్తాయి. ఆ నిజాలేంటి? అసలు క్యాబ్ డ్రైవర్‌ని చంపి వాసుని ఆ కేసులో ఇరికించిందెవరు? ఈ కేసుని రామచంద్ర వాదించడానికి కారణమేంటి? దోషి ఎవరు? రామచంద్ర అసలు హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే…
సమీక్ష:
సినిమా క్యాబ్ డ్రైవర్ హత్యతో ప్రారంభం అవుతుంది. ఆ హత్య కేసులో అంకిత్‌కు శిక్ష పడటం.. ఇవన్నీ తొలి పది నిమిషాల కథగా నడుస్తాయి. ఆ తర్వాతే హీరో సత్యదేవ్ పాత్ర ఇంట్రడక్షన్ అవుతుంది. తన ఇంట్రడక్షన్‌లోనే తన పాత్ర స్వభావం, తీరు తెన్నులను దర్శకుడు సింపుల్‌గా పరిచయం చేస్తాడు. ఈ తర్వాత హీరో పెద్ద కంపెనీలో లాయర్‌గా జాయిన్ కావడం వరకు సినిమా నార్మల్‌గా సాగుతుంది. ఎనిమిదేళ్ల ముందు క్యాబ్ డ్రైవర్ హత్యకు సంబంధించి కాంపెన్‌సేషన్ కేసుని రీ ఓపెన్ చేయించడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కథ ట్టిస్టులు, టర్న్స్‌తో ముందుకు సాగుతుంది. అంకిత్ పాత్ర మరో హత్య కేసులో ఇరుక్కోవడం అనే పాయింట్ దగ్గర ఇంటర్వెల్‌తో ఎండ్ చేసిన దర్శకుడు కథపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాను ఎక్కడా సాగదీసే ప్రయత్నం చేయలేదు. హీరో, హీరోయిన్ ముందే లవర్స్ అనే పాయింట్‌ను రివీల్ చేసేయడంతో లవ్ ట్రాక్‌ను పొడిగించాల్సిన ఇబ్బంది రాలేదు. అలాగే హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్, లవ్ సాంగ్స్ వంటి పెట్టి కథా గమనాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేయలేదు. అలాగే లిఫ్ట్‌లో ఓ ఫైట్‌ను పెట్టి అక్కడ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి. విలన్ ఎవరు అనే పాయింట్‌ను దాదాపు చివరి వరకు తీసుకొచ్చే విషయంలోనూ సక్సెస్ అయ్యాడు శరణ్. ఇక సినిమా పది నిమిషాల్లో ముగుస్తుందనగా, అసలు ట్విస్టును రివీల్ చేస్తారు. అదేంటనేది సినిమా చూడాల్సిందే. అయితే అసలు విలన్ ఎవరనే పాయింట్ రివీల్ అయినప్పుడు థ్రిల్లింగ్ అప్పటి వరకు కూర్చున్న ప్రేక్షకుడు ఎక్స్‌పెక్ట్ చేసే ఓ ఫీల్‌ను మాత్రం ఇవ్వలేకపోయారనేది నిజం. సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తూ వచ్చి ఫీల్ డెప్త్ ఫైనల్‌లో మిస్ అయినపట్లు అనిపిస్తుంది. అలాగే హీరో ఆ కేసునే ఎందుకు డీల్ చేశాడనే పాయింట్‌ను సింపుల్‌గా, ల్యాగ్ లేకుండా చెప్పడం ఓకే. కానీ.. ఇలాంటి ట్విస్టులు ఎవరు వంటి సినిమాలో ప్రేక్షకులు చూసినదే. ఓ మినిమం బడ్జెట్‌లో సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసిన డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి ప్లానింగ్‌ను అభినందించాలి. శ్రీచరణ్ పాకాల నేపథ్యం సంగీతం, అప్పూ ప్రభాకర్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రియాంక జవాల్కర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్నంత మేరకు ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ఇక హీరో తర్వాత సినిమాలో ప్రాధాన్యమున్న పాత్ర ఎవరిదంటే.. బ్రహ్మాజీదే. ఈ సీనియర్ నటుడు సీరియస్ పాత్రలనే కాదు, కామెడీ పాత్రలను కూడా అలవోకగా చేయగలడని మరోసారి ప్రూవ్ చేశాడు. వాసు అనే యువకుడిగా అంకిత్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఝాన్సీ, భూపాల్, అజయ్, రవిబాబు తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ఇక సినిమాలో.. నేను వాలినిరా, ఎదురుగా కూర్చున్న నీ శక్తిలో సగం లాగేస్తా అని విలన్ అంటే, నువ్వు వాలివి అయితే నేను దండేసి దండించే రాముడినిరా అంటూ హీరో చెప్పే డైలాగ్
నేను కొడితే సౌండేలా వస్తుందో వాడ్ని అడుగు అని అజయ్ హీరోకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. నువ్వు కొడితే సౌండే వస్తుందేమో, అదే ఈ లాయర్ కొడితే రీసౌండ్ లైఫ్ లాంగ్ వస్తుందంటూ హీరో కౌంటర్ ఇవ్వడం
బలవంతుడు బలం ఉన్నంత వరకే గెలుస్తాడు, కానీ తెలివైనోడు ఎప్పుడూ గెలుస్తాడు
న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ఓడిపోయినా గెలిచినట్లే
చేతిలో సూట్ కేసు ఉన్న లాయర్ కత్తులున్న వంద గూండాలకంటే ప్రమాదం అంటూ బ్రహ్మాజీ ఫన్నీగా ఓ సందర్భంలో చెప్పే డైలాగ్ బావుంది.
బోటమ్ లైన్… థ్రిల్లింగ్ ‘తిమ్మరుసు’
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
