బోయ్ ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేస్తున్న గడుసరి పాయల్

సినీపరిశ్రమలో నటవారసుల్ని పరిచయం చేయడం చాలా సహజంగా చూసేదే. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు కథానాయకులు తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దర్శకులు నిర్మాతల పుత్ర రత్నాలు కూడా తమ వారసుల్ని హీరోల్ని చేస్తున్నారు. అయితే హీరోలు దర్శకనిర్మాతలకు ధీటుగా కథానాయికలు వారి వారసుల్ని బరిలో దించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. నటవారసులు అనలేం కానీ.. తమ సోదరుడినో లేక సోదరినో .. తమ కజిన్ నో తెరకు పరిచయం చేయడం సహజంగా చూస్తున్నదే. […]