Templates by BIGtheme NET
Home >> Cinema News >> బోయ్ ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేస్తున్న గడుసరి పాయల్

బోయ్ ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేస్తున్న గడుసరి పాయల్


సినీపరిశ్రమలో నటవారసుల్ని పరిచయం చేయడం చాలా సహజంగా చూసేదే. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు కథానాయకులు తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దర్శకులు నిర్మాతల పుత్ర రత్నాలు కూడా తమ వారసుల్ని హీరోల్ని చేస్తున్నారు. అయితే హీరోలు దర్శకనిర్మాతలకు ధీటుగా కథానాయికలు వారి వారసుల్ని బరిలో దించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. నటవారసులు అనలేం కానీ.. తమ సోదరుడినో లేక సోదరినో .. తమ కజిన్ నో తెరకు పరిచయం చేయడం సహజంగా చూస్తున్నదే.

ఇంతకుముందు కాజల్ అగర్వాల్ తన సోదరి నిషా అగర్వాల్ ని కథానాయికగా పరిచయం చేసింది. నిషా కొన్నాళ్ల పాటు నటించి తర్వాత పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. ఇటీవలే రకుల్ తన సోదరుడిని హీరోగా పరిచయం చేస్తూ మూవీని లాంచ్ చేసింది. కోవిడ్ వల్ల ఆ సినిమా పూర్తవ్వలేదు.

ఆ ఇద్దరి కంటే డిఫరెంట్ గా పాయల్ రాజ్ పుత్ తన బోయ్ ఫ్రెండ్ ని సినీపరిశ్రమకు పరిచయం చేస్తోంది. అది కూడా టాలీవుడ్ లో అతడు ఎంట్రీ ఇవ్వనుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పాయల్ ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్ సౌరబ్ దింగ్రాని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. సౌరబ్ పంజాబీ నటుడు కం గాయకుడు. పాయల్ కి కంపానియన్. పాయల్ రాజ్ పుత్ ఏ భాషలో షూటింగ్ చేసినా తనకు తోడు నీడగా ఉంటున్నాడు. అయితే అందుకు గిఫ్ట్ గా అతడికి పాయల్ ఏం ఇస్తోందో తెలుసా? సౌరబ్ ని ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దర్శకనిర్మాతలను లాక్ చేసేసిందిట. అందుకోసం పాయల్ టాలీవుడ్ లో తన పరిచయాల్ని వినియోగించుకుంటోంది.

మొత్తానికి చెల్లినో అక్కనో తమ్ముడినో అన్ననో సినీపరిశ్రమకు పరిచయం చేయడం వేరు.. కానీ వీటన్నిటికీ భిన్నంగా పాయల్ ఏకంగా తన ప్రియుడినే సినీపరిశ్రమలో హీరోని చేస్తోంది! అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. ఆర్.ఎక్స్ 100 బ్యూటీ గడుసరి అని ప్రూవ్ అయింది అంటూ కొందరు ఫ్యాన్స్ అదే పనిగా పొగిడేస్తున్నారు.

పాయల్ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఆది సాయి కుమార్ సరసన కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. పంజాబీలోనూ సినిమాలు చేస్తోంది. మరోవైపు ప్రత్యేక గీతాలకు ప్రాధాన్యతనిస్తోంది. అలాగే సోషల్ మీడియాల్లోనూ అభిమానులకు వరుసగా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. సౌరబ్ డింగ్రాతో ప్రేమలో ఉన్న పాయల్ అతడినే పెళ్లాడుతుందా? అంటే ప్రస్తుతానికి కెరీర్ పైనే దృష్టి సారించింది. ఇప్పుడే పెళ్లి మాట ఏదీ లేదు. అతడితో కలిసి వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఇండస్ట్రీలో తన తోడు నీడ అంటూ ఇతరులకు ఫీలర్స్ ని వదులుతోంది.

ఇప్పుడు మరో ముందడుగు వేసి ఏకంగా ప్రియుడిని హీరోని చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో సౌరబ్ డింగ్రా ఫొటోను షేర్ చేసిన పాయల్ రాజ్ పుత్ అతడికి విషెస్ తెలిపింది. “తెలుగులోకి పరిచయం అవుతున్నందుకు శుభాకాంక్షలు. లైఫ్ ఊహించని సాహసాలతో సాగుతుంది. నువ్వు అవన్నీ దాటుకుని ముందుకు సాగాలి“ అంటూ ఎంకరేజ్ చేసింది. ఏదేమైనా పాయల్ గడుసుతనానికి జనం నోరెళ్లబెడుతున్నారు.