‘కలిసుందాం రా’ క్లైమాక్స్ మార్చడానికి కారణమదేనట!

కథా రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కి ఎంతో అనుభవం ఉంది. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారా విజయాలను అందుకున్న ఘనత వారి సొంతం. అలాంటి పరుచూరి బ్రదర్స్ .. రామానాయుడు నిర్మాణంలో అనేక సినిమాలకు పనిచేశారు. కథల విషయంలో రామానాయుడిని ఒప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే ఒక కథలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఏయే పాళ్లలో ఉండాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన కథలు వినేవారు. […]