నాకిది పునర్జన్మ.. అభిమానుల ఆశీస్సులతో బతికా! హీరో రాజశేఖర్

ప్రముఖ హీరో రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే రాజశేఖర్కు పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని వార్తలు వచ్చాయి. పలువురు నటీనటులు కూడా ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. రాజశేఖర్ కు చాలా రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించారు. ఆయనకు ఊపిరి అందకపోవడంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. ఆ సమయంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక పెట్టిన ట్వీట్ వైరల్ అయ్యింది. […]