నీ సాయం అంతా ఫేక్.. నెటిజన్ ట్రోలింగ్.. సోనూ ఇచ్చిన సమాధానం ఇదే!

కరోనా కాలం వెండితెర విలన్ ని రియల్ హీరోగా మార్చింది. ప్రజారవాణా వ్యవస్థలను ఆగిపోవడంతో దేశంలో వలస కూలీలంతా తమ సొంతూర్లకు చేరడానికి ఎన్ని అవస్థలు పడ్డారో తెలిసిందే. రోజుల తరబడి రహదారులపై నడుస్తూ తినడానికి తిండి లేక పడుకోడానికి షెల్టర్ లేక అల్లాడిపోయారు. అప్పుడు వచ్చాడు దేవుడిలా సోనుసూద్. రూ.కోట్లు ఖర్చు పెట్టి బస్సులు రైళ్లు విమానాలు బుక్ చేసి వలస కూలీలను వారి వారి గ్రామాలకు తరలించాడు. వేలాది మందికి తిండిపెట్టి హీరోగా మారాడు. […]