Templates by BIGtheme NET
Home >> Cinema News >> నీ సాయం అంతా ఫేక్.. నెటిజన్ ట్రోలింగ్.. సోనూ ఇచ్చిన సమాధానం ఇదే!

నీ సాయం అంతా ఫేక్.. నెటిజన్ ట్రోలింగ్.. సోనూ ఇచ్చిన సమాధానం ఇదే!


కరోనా కాలం వెండితెర విలన్ ని రియల్ హీరోగా మార్చింది. ప్రజారవాణా వ్యవస్థలను ఆగిపోవడంతో దేశంలో వలస కూలీలంతా తమ సొంతూర్లకు చేరడానికి ఎన్ని అవస్థలు పడ్డారో తెలిసిందే. రోజుల తరబడి రహదారులపై నడుస్తూ తినడానికి తిండి లేక పడుకోడానికి షెల్టర్ లేక అల్లాడిపోయారు. అప్పుడు వచ్చాడు దేవుడిలా సోనుసూద్. రూ.కోట్లు ఖర్చు పెట్టి బస్సులు రైళ్లు విమానాలు బుక్ చేసి వలస కూలీలను వారి వారి గ్రామాలకు తరలించాడు. వేలాది మందికి తిండిపెట్టి హీరోగా మారాడు.

అయితే ఎన్ని మంచి పనులు చేసినా ఎవరో ఒకరు విమర్శించడం మామూలే.. అలా విమర్శించిన రిషి భగ్రీ అనే నెటిజన్ కి సోనుసూద్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ” ట్విట్టర్లో కనీసం ఇద్దరు ముగ్గురు ఫాలో వర్లు కూడా లేని వ్యక్తి వైద్యానికి సాయం చేయాలంటూ ట్వీట్ చేశాడు. కనీసం సోనూ కు ట్యాగ్ చేయలేదు. లొకేషన్ చెప్పలేదు. ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు. అయినా కానీ అతడికి సోనూ రిప్లై ఇచ్చాడు. ఇదెలా సాధ్యమో తెలియడం లేదు. అలాగే సోనూ టీం గతంలో సాయం కావాలంటూ వచ్చిన ట్వీట్ లను డిలీట్ చేసింది’ అని కామెంట్ చేశాడు.

ఈ కామెంట్ కి సోనూ సూద్ స్పందించాడు.ఇబ్బందుల్లో ఉన్న వారిని నేను ఎక్కడున్నా గుర్తిస్తా. వారు నన్ను ఆశ్రయిస్తారు..నేను కనుగొంటా . ఇవి నీకు అర్థం కావులే..రేపు పిల్లాడు ఆసుపత్రిలో ఉంటాడు. నీకు సాయం చేయాలనిపిస్తే చేయి. అతడికి కొన్ని పండ్లు పంపు. 2-3 ఫాలోవర్లు ఉన్న వ్యక్తి సంతోషిస్తాడు’ అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా సోనూసూద్ రోగి వివరాలను కూడా షేర్ చేశారు.