ఆకాష్ పూరి ఓటీటీ ఛాయిస్.. సరైన నిర్ణయమేనా?

0

ఒక అప్ కం హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే అది అతడికి కలిసొచ్చే అంశమా లేకపోతే మైనస్ అవుతుందా? అంటే .. ఒక్కొక్కరూ ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. పెద్ద తెరపై విజువల్ బ్రిలియన్సీ వేరు. ఓటీటీ పేరుతో స్మార్ట్ టీవీ .. ఫోన్లలో చూడడం వేరే. ఆ అనుభూతి వేరు.. ఈ అనుభూతి వేరు. అయితే ఓటీటీలో ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంటే థియేటర్లలో కొద్దిమందికి మాత్రమే సినిమా రీచ్ అవుతుంది. ఇలా చూస్తే రెండు కోణాలున్నాయి. ఇక డెబ్యూ హీరోల సినిమాలకు సహజంగానే జనం థియేటర్లకు రారు. ఓటీటీలో అయితే సినిమాకి మంచి టాక్ వస్తే ప్రతి ఒక్కరూ వీక్షించే అవకాశం ఉంటుంది. అది ఆ హీరోకి కూడా ప్లస్ అవుతుంది. స్టార్ డమ్ ని చూడకుండా కంటెంట్ బావుంటే అదరణ దక్కే ప్లేస్ డిజిటలే.

అందుకే ఇప్పుడు డెబ్యూలు.. అప్ కం హీరోల సినిమాలకు ఓటీటీ ప్లస్ అన్న విశ్లేషణ సాగుతోంది. అంతగా మ్యాటర్ లేని సినిమాల్ని ఓటీటీల్లోకి వదిలేయడం వల్ల బ్యాడ్ అయ్యింది కానీ ఓటీటీలను తక్కువగా చూడటానికేం లేదు. ఇకపోతే ఇప్పటికే మెహబూబా చిత్రంతో హీరోగా పరిచయమైన ఆకాష్ పూరి నటించిన రెండో సినిమా `రొమాంటిక్` థియేట్రికల్ రిలీజ్ కి వస్తుందా? ఓటీటీలో రిలీజ్ కానుందా? అన్న డిబేట్ ఆన్ లైన్ లో సాగుతోంది.

అయితే దర్శకనిర్మాతలు త్వరగా నిర్మాణానంతర పనులు పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అమెజాన్ వాళ్లతో చర్చలు జరుపుతున్నారని కథనాలొస్తున్నాయి. ఈ మూవీలో కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. తనకు ఇది తొలి చిత్రం. సీనియర్ నటి రమ్యకృష్ణ ఆకాష్ కి అత్తగా కీలక పాత్రలో నటిస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే ఓ ముఖ్య పాత్రధారి అని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలోని ఇంట్రెస్టింగ్ ప్రేమ కథతో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్- పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.