గౌతమ్ కిచ్లు తో కాజల్ మొదటి ఫోటో గ్లింప్స్

0

చందమామ కాజల్ సడెన్ పెళ్లి ప్రకటన అభిమానులను షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. కాజల్- తాను వలచిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30 న వివాహం చేసుకోనున్నానని ప్రకటించారు. ఇప్పటికే వరుడు గౌతమ్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అయితే జంటగా క్లారిటీతో ఉన్న ఫోటో ఇంతవరకూ ఒక్కటీ అంతర్జాలంలో వైరల్ కాలేదు.

ఆలోటును తీరుస్తూ ఇదిగో లేటెస్టుగా కాజల్ తనకు కాబోయే వాడితో ఇలా ఫోటో దిగింది. కాజల్ అగర్వాల్ కాబోయే గౌతమ్ కిచ్లుతో కలిసి దసరా సందర్భంగా అభిమానులను కోరుకుంటున్నట్లు అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసారు. ఈ జంట అక్టోబర్ 30 న ముంబైలో ప్రైవేట్ కార్యక్రమంలో డీసెంట్ గా వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు ప్రిపేర్డ్ గా ఉన్నాయిట. ఇక ఈ జంట ఇదివరకూ పెళ్లి తేదీని ప్రకటించినప్పటి నుండి కాజల్ కాబోయేవాడితో కలిసి ఉన్న ఫోటోల్ని పంచుకోవడం ఇదే మొదటిసారి.

తాజా ఫోటోకి కాజల్ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. “మా నుండి మీకు దసరా శుభాకాంక్షలు! గౌతమ్ కిచ్లు# కాజ్ గౌత్ కిచ్డ్ ..” అంటూ ఫన్నీ కామెంట్ ని జోడించింది. ఈ ఫోటోలో కాజల్ – గౌతమ్ జంట ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. కాబోయే సఖిని నడుము చుట్టూ చుట్టేశాడు గౌతమ్.

గౌతమ్ ఒక వ్యాపారవేత్త.. ఇంటీరియర్ డిజైన్ … గృహాలంకరణ వస్తూత్పత్తి వ్యాపారంలో అనుభవజ్ఞుడు. దీనికోసం ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ ను రన్ చేస్తున్నాడు. అతను ఫిట్నెస్ ఔత్సాహికుడు కూడా. తరచూ తాను మారథాన్ లతోనూ సుపరిచితుడు. వాటికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటాడు.