స్టార్ హీరో హైటెక్ ఫిలింసిటీ ప్లాన్.. సీఎంతో భేటీ!

0

ఇటీవలే నవ్యాంధ్రప్రదేశ్ లో ఫిలింస్టూడియోల నిర్మణం కోసం మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున సహా పలువురు సినీపెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. దీనిపై మరో భేటీ కోసం సినీపెద్దలు వేచి చూస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ ను ఒక హోటల్ లో కలవడానికి అక్షయ్ కుమార్ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇంతకీ సీఎంతో కిలాడీ భేటీ దేనికి? అంటే..

అతడి మైండ్ లో బిగ్ ప్లాన్ ఉంది. వందల కోట్ల పెట్టుబడులు వెదజల్లే ఫిలిం బిజినెస్ కి తెర లేపనున్నారట. ఉత్తరప్రదేశ్ నోయిడా సిటీలో భారీ హైటెక్ ఫిలింసిటీ నిర్మాణానికి కిలాడీ అక్షయ్ కుమార్ పావులు కదుపుతున్నారని అతడికి అంతే భారీగా భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రచారం సాగుతోంది.

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ దీనికోసమే. నోయిడాలో అభివృద్ధి చేయబోయే హైటెక్ ఫిల్మ్ సిటీపై చర్చలు జరపడానికి ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ ముంబైకి వస్తారని గతంలో ప్రచారం సాగింది. ఆయన రాగానే అక్షయ్ కలిసారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే వాట్సాపుల్లో నెటిజనుల్లో వైరల్ అవుతున్నాయి

అక్షయ్ తో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన 41 మంది ప్రముఖులను సిఎం కలిసారన్న సమాచారం ఉంది. అక్షయ్ నగరంలో ఉన్న ట్రైడెంట్ హోటల్ వైపు వెళుతున్న క్రమంలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అతడు బ్లాక్ డ్రెస్ లో ఆ కార్ లో కనిపించారు. అతను హోటల్లోకి ప్రవేశించేటప్పుడు భద్రతా బృందంతో చుట్టుముట్టారు.

అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ ఇటీవలే విడుదలై ఫ్లాపైన సంగతి తెలిసిందే. తదుపరి సూర్య వంశీ రిలీజ్ కు రెడీ అవుతోంది. సూర్య వంశీ- బెల్ బాటమ్ – పృథ్వీరాజ్ చిత్రాలు చిత్రీకరణల గురించి తెలిసినదే.