‘మోసగాళ్లు’ చిత్రం లో నవీన్ చంద్ర లుక్..!

0

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ”మోసగాళ్లు”. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ – ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళం మలయాళం కన్నడ మరియు హిందీ భాషలలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మోసగాళ్లు’ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న టాలెంటెడ్ యువ హీరో నవీన్ చంద్ర లుక్ ని చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నవీన్ చంద్ర ‘సిద్’ పాత్రలో నటిస్తున్నాడు. నేడు నవీన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘మోసగాళ్ళు’ టీమ్ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో నవీన్ చంద్ర సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి టాలీవుడ్ కి పరిచయమవుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ కిచ్లు సోదరి పాత్రలో నటించింది. రుహీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని మంచు విష్ణు భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు.