రఘురామకృష్ణం రాజు బాటలో ఇంకొక ఎంపీ?

0

వైసీపీ నుంచి గెలిచిన ఎంపీల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయా? అటు ప్రభుత్వం ఇటు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని మథనపడుతున్నారా? ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని బాధపడుతున్నారా? ఎంపీ రఘురామకృష్ణం రాజు బాటలోనే మరికొందరు బయటపడుతారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. వైసీపీలో గెలిచిన ఎంపీలను లోకల్ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు అని ఏపీ న్యూస్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

తాజాగా వినాయక చవితి రోజున ఓ వైసీపీ ఎంపీ తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ లో పండుగు శుభాకాంక్షలు పెట్టాడు. అయితే అందులో విశేషం ఏంటంటే ఆ ఫొటోలో వైఎస్ఆర్ ఫొటోకానీ.. చివరకు అధినేత జగన్ ఫొటో కానీ లేకపోవడం అందరినీ షాక్ కు గురిచేేసింది. దీంతో ఇదేంటని అందరూ చూసి కామెంట్స్ పెట్టారు. కొందరు ఎంపీకి ఫోన్ చేసి ఇది కరెక్ట్ కాదు అని సూచించారట.. దీనికి సదురు ఎంపీ ‘అవునా.. నేను మా వాళ్లకి చెబుతా.. అని మీరు పీఏతో మాట్లాడండి అని ఫోన్ కట్ చేశాడంట’.. అయితే పీఏ ఫోన్ ఎత్తకుండా వాట్సాప్ లో లైన్ లోకి వచ్చాడంట.. వైఎస్ఆర్ జగన్ అభిమానులు చాట్ లో ఇది ఏందని.. ఈ ఫొటో తీసివేయండని అంటే..

ఎంపీ పీఏగా చెప్పుకునే అతను వాళ్లకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడంట.. ‘మీరు మమ్మలను అడుుతున్నారు.. ముందు మీ ఎమ్మెల్యేలను అడగండి.. ఎంపీలను ఎందుకు పిలవడం లేదు అని.. మాకు ఈరోజు ఢిల్లీలో అంతో ఇంతో విలువ ఉంది అంటే అది బీజేపీ వలన.. మాకు పార్టీ నుంచి ఏమీ సపోర్ట్ లేదని ఎంపీ పీఏ కుండబద్దలు కొట్టాడట.. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మరో రఘురామ కృష్ణం రాజు తయారు అయ్యే చాన్స్ ఉందని అనుకుంటున్నారంట..

సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఎంపీలను అభివృద్ధి కార్యక్రమాలకు పిలవండని ఎంత చెప్తున్నా.. ఎమ్మెల్యేలు అస్సలు పిలవడం లేదని.. దీనిపై ఎంపీలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని త్వరలోనే దీనిపై హైకమాండ్ ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదుర్చాలని వైసీపీ వర్గాలు కోరుతున్నాయని టాక్.