Templates by BIGtheme NET
Home >> Telugu News >> వర్క్ ఫ్రం హోంతో మరో ఇబ్బంది..డిస్మోర్ఫియాతో బాధపడుతున్న ఉద్యోగులు

వర్క్ ఫ్రం హోంతో మరో ఇబ్బంది..డిస్మోర్ఫియాతో బాధపడుతున్న ఉద్యోగులు


ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నది. కరోనా ఎఫెక్ట్తో పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ఫ్రం హోం అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్క్ఫ్రం హోం పనివిధానంలో ఉద్యోగులు తీవ్ర మానసిక రుగ్మతలకు గురవుతున్నట్టు ఇటీవలే పరిశోధనల్లో తేలింది. సాధారణంగా ఆఫీసుల్లో ఉండే చేసేదానికంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని పలువురు ఉద్యోగులు చెప్పారు కూడా.. అయితే వీరికి కొత్తగా మరో వ్యాధి సోకుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

సాధారణంగా వర్క్ఫ్రం హోం చేసే ఉద్యోగులు సహా ఉద్యోగులు ఉన్నతాధికారులు జూమ్ తదితర యాప్ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ వీడియో సమావేశాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ‘జూమ్ డిస్మోర్ఫియా’ అనే వ్యాధి వస్తున్నదట. నిజానికి ఇదో మానసిక వ్యాధి. తమ శరీరభాగాల్లో ఏదైనా లోపం కనిపిస్తే దాన్ని చూసుకొని ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. దీన్ని ‘ డిస్మోర్ఫియా’ అంటారు. ఇటీవల ఉద్యోగులు వీడియో సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు తమ ముఖంలో లోపాలు చూసుకొని మానసికంగా బాధపడుతున్నారట.

ఆ లోపాలను సరిదిద్దుకొనేందుకు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నట్టు అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులపై నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. ఇది వరకు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు కాబట్టి.. తమ రూపు గురించి మరీ పెద్దగా ఆలోచించేవారు కాదు.. కానీ ఇప్పడు వీడియో సమావేశాల్లో ఉద్యోగులు తమ ముఖాన్ని చూసుకోవాల్సి వస్తున్నది. దీంతో ముఖంలోపాటు స్పష్టంగా కనిపిస్తున్నాయట. దీంతో వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈవ్యాధితో వచ్చినవాళ్లు చాలామంది తమ శరీరభాగాలను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొనేందుకు ఇష్టపడుతున్నారట.