బండ్ల గణేష్ బీజేపీలో చేరుతున్నాడా?

0

ఒక సారి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ మరోసారి రాజకీయాల బాట పడుతున్నట్టు తెలిసింది. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నాడని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లో చేరి అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇక తాను రాజకీయాల్లోకి అస్సలు రానని అప్పట్లో బండ్ల ప్రకటించాడు.

గత ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ లో చేరాడు. ఆయనకు అధికార ప్రతినిధి పోస్టును కాంగ్రెస్ కట్టబెట్టింది. దీంతో బండ్ల గణేష్ ఎన్నికల వేళ.. పలు టీవీ న్యూస్ యూట్యూబ్ చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి అధికార టీఆర్ఎస్ పై మండిపడ్డారు. రాజకీయ చర్చలతో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ గెలవకపోతే ‘7ఓ క్లాక్ బ్లేడుతో గొంతుకోసుకుంటా’ అని సవాల్ చేశాడు. ఆ డైలాగ్ పాపులర్ అయ్యింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ బండ్ల గణేష్ పేరు వినిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి బిజెపి ఈ ప్రచారం చేస్తోందని కొందరు అంటున్నారు.

బండ్ల గణేష్ ఇటీవలి మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరనని ప్రకటించారు. అయితే బిజెపికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కు తోడుగా ఆయన శిష్యుడైన బండ్ల గణేష్ కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నారని.. పార్టీలో చేరబోతున్నాడని ప్రచారం సాగుతోంది.

బండ్ల గణేష్ బిజెపిలో చేరడానికి శుభ సమయం 7 ‘ఓ క్లాక్ అని తాజాగా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో బండ్ల ‘7ఓ క్లాక్’ బ్లేడుతో చేసిన రాజకీయ సవాళ్ళతో ఆ బ్రాండ్ బ్లేడ్ కంపెనీ ఎలా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వార్తలపై బండ్ల గణేష్ ఇంతవరకు స్పందించలేదు. బీజేపీలో చేరికపై స్పందించాల్సి ఉంది.