యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.35,000 వేతనంతో..?

0

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)- హైదరాబాద్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 49 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ఇతర ఉద్యోగ ఖళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూను బట్టి ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

https://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 49 పోస్టులలో హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగంలో ఒక ఖాళీ ఉండగా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 4 ఉద్యోగ ఖాళీలు, మెకానికల్‌ విభాగంలో 8 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మిగిలిన ఉద్యోగ ఖాళీలు ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్నాయని తెలుస్తోంది. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల లోపే ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం 35వేల రూపాయలు కాగా సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున వేతనం పెంచుతారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.