300 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన బ్రిటన్

0

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై గుత్తాధిపత్యం చెలాయించి ఆ దేశాలను దోపిడీ చేసి సంపద పోగేసుకున్న బ్రిటన్ దేశం కేవలం ఒక్క కరోనా దెబ్బకు కుదేలైంది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సంచలన గణాంకాలు వెల్లడించింది. గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మూడు శతాబ్ధాల కంటే తక్కువకు దిగజారిందని సంచలన నిజాలు వెల్లడించింది.

కరోనాతో బ్రిటన్ అల్లకల్లోలమైంది. లక్షలమంది చనిపోయారు. కరోనా మరో దశలో కూడా బ్రిటన్ లో వ్యాపించి రెండోసారి లాక్ డౌన్ విధించారు. కరోనా దెబ్బకు అతిపెద్ద మాంద్యానికి ఇంగ్లండ్ దేశం గురైంది. 2020 నాటికి యూకే జీడీపీ దాదాపు 10శాతానికి పడిపోయింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత 7 సంవత్సరాల్లో యూకే మొత్తం సాధించిన వృద్ధి తుడిచిపెట్టుకుపోయింది.

ప్రస్తుతం మొత్తం వృద్ధి రేటు 2013 నాటి ఆర్థిక వ్యవస్థ పరిణామానికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం యూకే (ఇంగ్లండ్) జీడీపీ 9.9శాతానికి పడిపోయి మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి.

1921లో గ్రేట్ డిప్రెషన్ సమయంలో యూకే జీడీపీ 9.7శాతానికి పడిపోయి మాంధ్యం సూచనలు కనిపించాయి. 1709 తరువాత కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. యూరప్ లో కఠినమైన శీతాకాలం ఏర్పడి ఈ ఏడు ప్రజలు కరోనాతో భారీగా చనిపోయారు. ఆ వినాశనమే ఇప్పటి ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.