ఈ వారం రాశిఫలాలు ఫిబ్రవరి 14 – ఫిబ్రవరి 20, 2021

0

ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 14 – ఫిబ్రవరి 20)

Weekly Horoscope (14-02-2021 to 20-02-2021)

నేటి రాశి ఫలాలు కొరకు క్లిక్ చేయండి

మేష రాశి
(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
చిరకాల కోరిక నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు.
కొన్ని విషయాలలో  పట్టింది బంగారంగా ఉంటుంది.
ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.
సమాజంలో పరపతి, హోదాలు దక్కుతాయి.
వాహనాల కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి.
సమాజ సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
అనుకున్న మేరకు డబ్బు అందుతుంది.
షేర్ల విక్రయాలు పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు.
కొన్ని రుణాలు సైతం తీరతాయి.
భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలను సహనంతో పరిష్కరించుకుంటారు.
సంతానరీత్యా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు.
వివాహ యత్నాలు కొలిక్కి వస్తాయి.
ఆరోగ్యం పై  కొంత శ్రద్ధ చూపండి.
వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
ఉద్యోగులు విధి నిర్వహణలో లక్ష్యాలు సాధిస్తారు.
నాయకులు, కళాకారుల ప్రయత్నాలు క్రమేపీ ఫలిస్తాయి.
మహిళ కృషి ఫలిస్తుంది.

శివాష్టకం పఠించండి.

వృషభ రాశి
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొన్ని ఈతిబాధలు, సమస్యలు తీరే సమయం.

విచిత్రమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి.

పలుకుబడి, సమాజంలో ఉన్నతస్థితి దక్కుతుంది.

ఇతరులకు సైతం సహాయం చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది.

మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయాలనుకున్న వారి యత్నాలు ఫలించవు.

ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

చెప్పుకోతగ్గ రీతిలో డబ్బు అందుతుంది.

స్థిరాస్తులు సైతం కొనుగోలు చేసే వీలుంది.

బంధువుల నుంచి ఊహించని రీతిలో ధన లబ్ధి.

కుటుంబంలో మీ మాటే చెల్లుబాటు కాగలదు.

దూరపు బంధువుల నుంచి కొంత సహాయం అందుతుంది.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

స్వల్ప రుగ్మతలు బాధించినా క్రమేపీ ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు నిర్వహించే వారికి మంచి అవకాశాలు.

ఉద్యోగులకు పని భారం తగ్గి ఊరట లభిస్తుంది.

నాయకులు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత.

శివాలయ దర్శనం చేయండి.

మిథున రాశి
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
ప్రతిబంధకాలు, సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.

ఇతరులను సైతం ఆదుకుని మీ ఔదార్యాన్ని చాటుకుంటారు.

పట్టుదలే మీ ఆయుధంగా మలుచుకోండి,

ప్రత్యర్థులు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వాహనాలు,ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి.

అనుకున్న ఆదాయానికి ఢోకా ఉండదు, రుణ బాధలు తొలగుతాయి.

స్థిరాస్తుల విషయంలో ప్రతిష్ఠంభన తొలగి ధన లాభం కలుగుతుంది.

కుటుంబంలో సంతోషంగా ముందుకు సాగుతారు.

గతానుభవాలను గుర్తుకు తెచ్చుకుని ఆత్మ పరిశీలన చేసుకుంటారు.

భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలలో ప్రగతి కనిపిస్తుంది.

భాగస్వాములతో వివాదాలు తీరతాయి.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి.

కళాకారులకు అనుకోని విజయాలు వరిస్తాయి.

మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటక రాశి
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆస్తి వివాదాలు పరిష్కారమై కొంత లబ్ది చేకూరుతుంది.

నిర్ణయాలలో కాస్త నిదానం పాటించండి.

ప్రముఖ వ్యక్తులు సహాయం అందిస్తారు.

మీపట్ల విముఖంగా ఉన్న వ్యక్తులే మీదారికి వస్తారు.

రావలసిన డబ్బు కాస్త ఆలస్యంగా అందినా అవసరాలు తీరతాయి.

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

భార్యాభర్తలు, సోదరీసోదరులతో సఖ్యతతో పాటు, ఆప్యాయత పెరుగుతుంది.

సంతానం ఉద్యోగ, వివాహ విషయాలలో శుభవార్తలు అందుతాయి.

ఆరోగ్యం కాస్త నలత చేయవచ్చు. తద్వారా ఔషధ సేవనం.

వ్యాపారాలు అనుకూలించడం ద్వారా ఉత్సాహంతో గడుపుతారు.

ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కవచ్చు.

కళాకారులు, పారిశ్రామికవర్గాలకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఆంజనేయ దండకం పఠించండి.

సింహ రాశి
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
మీ కృషి, పట్టుదలే మీకు ఆయుధాలుగా ఉపయోగపడతాయి.

కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

ఇంటి నిర్మాణ యత్నాలు కాస్త వేగవంతం కాగలవు.

కొన్ని వ్యవహారాలలో క్రియాశీలక పాత్రపోషిస్తారు.

కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి.

ఆదాయం కొంత తగ్గినా మీ అవసరాలు తీరతాయి.

స్థిరాస్తుల పై పెట్టుబడులు పెడతారు.

తరచూ ధన లాభాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులను నొప్పించకుండా కొన్ని కార్యాలు సాధిస్తారు.

సంతానం, భార్యాభర్తల మధ్య అపోహలు, వివాదాలు పరిష్కారమవుతాయి.

ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి.

వ్యాపారాలు కొంత మందగించినా క్రమేపీ అనుకూలిస్తాయి.

ఉద్యోగులకు ఒక కీలక సమాచారం అందుతుంది.

రాజకీయ నాయకులు, కళాకారులు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తారు.

మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు.

దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

కన్య రాశి
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)
కొత్త వ్యక్తులు పరిచయమై మీకు ఇతోధికంగా సహకరిస్తారు.

ఆస్తులు సైతం కొనుగోలు చేస్తారు.

ఉద్యోగాల విషయంలో కృషి ఫలించే సమయం ఇదే.

శత్రువులను కూడా మీదారికి తెచ్చుకోవడంలో విజయం సాధిస్తారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

పుణ్య క్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు.

ఒక ప్రముఖవ్యక్తి అనూహ్యంగా సహకరించి ఆశ్చర్యపరుస్తారు.

అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంతో  ముందడుగు వేస్తారు.

రుణ బాధలు తొలగుతాయి.

షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి లబ్ధి పొందుతారు.

బంధువర్గం మీ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శ్రమిస్తారు.

భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య నెలకొంటుంది.

గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు.

వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి.

విస్తరణ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగాలలో ఒడిదుడులు తొలగుతాయి.

నాయకులు, పారిశ్రామికవేత్తలకు చెప్పుకోతగ్గ ప్రగతి కనిపిస్తుంది.

మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది.

దుర్గాస్తుతి మంచిది.

తుల రాశి
(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
కొన్ని వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు.

శ్రేయోభిలాషుల సలహాల మేరకు ముందుకు సాగుతారు.

ఇళ్ల నిర్మాణ యత్నాలు కలసివస్తాయి.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది.

రాబడి విషయంలో మొదట్లో నిరాశ కలిగినా చివరికి ఇబ్బందులు అధిగమిస్తారు.

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

తరచూ ధన ప్రాప్తి సూచనలు.

సంతాన విషయంలో చికాకులు తొలగి ఊరట లభిస్తుంది.

బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఆరోగ్యం కొంత నలత చేసి తక్షణం ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి.

కొత్త భాగస్వాముల చేయూత లభిస్తుంది.

ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

నాయకులు, కళాకారులకు కొన్ని విజయాలు చేకూరతాయి.

మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది.

కుజ గ్రహ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
ఎంతటి సమస్య ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు.

ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో పరిచయాలు.

భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు.

ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.

వివాహ, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

అనుకున్న ఆదాయం సమకూరుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

స్థిరాస్తుల విక్రయాల ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది.

కుటుంబంలో బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

తల్లిదండ్రుల ద్వారా ఆస్తిలాభ సూచనలున్నాయి.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది.

సంతానం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది.

వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.

విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం.

కళాకారులు, వైద్యులకు విజయాలు చేకూరతాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

శివ స్తోత్రాలు పఠించండి.

ధను రాశి
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.

మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి.

ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

ఆర్థికంగా బలం చేకూరుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

మిత్రుల నుంచి కొంత సహాయం అందుతుంది.

ఆస్తులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

సంతానం వివాహాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు.

భార్యాభర్తల మధ్య మరింత ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయి.

ఆరోగ్యం పూర్తి స్వస్థత చేకూరుతుంది.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలు మునుపటి కంటే మరింత లాభసాటిగా ఉంటాయి.

విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.

ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది.

విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం.

మహిళలకు స్వల్ప ధనలాభ సూచనలు.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకర రాశి
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
పనులు కొన్ని శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు.

కొన్ని విషయాలలో రాజీపడక తప్పనిస్థితి.

సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.

ఒక స్నేహితుని ద్వారా ఒత్తిడులు పెరుగుతాయి.

కాంట్రాక్టులు కొన్ని చేజారవచ్చు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వివాదాలకు దూరంగా ఉండండి.

నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

ఆర్థికంగా రావలసిన సొమ్ము అందక ఇబ్బందిపడతారు.

మరోవైపు అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు.

భార్యాభర్తల మధ్య అకారణంగా వైరం.

సంతాన పరంగా కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

బంధువుల నుంచి  ఒత్తిడులు తప్పవు.

ఆరోగ్యపరంగా చికాకులు, తరచూ వైద్య సేవలు పొందుతారు.

వ్యాపార లావాదేవీలు గందరగోళంగా ఉంటాయి.

ఉద్యోగాలలో మరిన్ని చికాకులు ఎదురుకావచ్చు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు.

మహిళలకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి.

దేవీస్తుతి మంచిది.

కుంభ రాశి
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.

యుక్తితో సమస్యలు పరిష్కరించుకుని ముందుకు సాగుతారు.

కష్టానికి తగిన ఫలితం  కనిపిస్తుంది.

కొన్ని కోర్టు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

డబ్బుకు ఇబ్బందిలేకుండా గడిచిపోతుంది.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

షేర్ల విక్రయాల ద్వారా మరింత ధనలబ్ధి కలిగే అవకాశం.

కుటుంబ పెద్దల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు.

శుభకార్యాల పై చర్చలు జరుపుతారు.

బంధువుల నుంచి అనుకూల సమాచారం అందుతుంది.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యుల ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.

వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు.

కొత్త సంస్థల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తారు.

ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది.

రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీన రాశి
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే.

మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

సన్నిహితుల నుంచి ప్రోత్సాహం అందుతుంది.

దేవాలయాలు సందర్శిస్తారు.

ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగ యత్నాలు సానుకూలమై నిరుద్యోగులు ఊరట చెందుతారు.

కొన్ని ఇబ్బందులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.

ఆర్థికంగా మరింత అనుకూలిస్తుంది.

రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

స్థిరాస్తుల పై పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో అందరితోనూ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు.

పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.

కొంత అనారోగ్యం చేసినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మహిళలకు శుభ వార్తలు అందుతాయి.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

నేటి రాశి ఫలాలు కొరకు క్లిక్ చేయండి