Templates by BIGtheme NET
Home >> Telugu News >> స్కూళ్ల రీఓపెన్ పై కేంద్రం ప్రత్యేక ఆదేశమిదీ!

స్కూళ్ల రీఓపెన్ పై కేంద్రం ప్రత్యేక ఆదేశమిదీ!


కరోనా వైరస్ తో మూతపడ్డ పాఠశాలలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయి? విద్యార్థులు ఎప్పుడు పాఠశాలలు వెళ్తారనే దానిపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మహమ్మారి వైరస్ తగ్గకపోవడంతో పాఠశాలలకు పిల్లలు వెళితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోననే భయం వెంటాడుతోంది.

అయితే ఇప్పుడు కరోనాను అందరూ లైట్ తీసుకుంటుండడంతో స్కూల్స్ పై నిర్ణయాధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే కట్టబెట్టింది. తాజాగా అన్ లాక్5లో ఈ మేరకు సడలింపులు ఇచ్చింది. అయితే కేంద్రం ఆదేశాలిచ్చినా సరే స్కూళ్లు తెరవడంపై రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ ఫస్ట్ వీక్ లో స్కూల్స్ తెరుస్తామని ప్రకటించింది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా పాఠశాలలు తెరవడానికి రెడీ అయ్యాయి.

అన్ లాక్ 5లో భాగంగా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం స్కూళ్లు ఎప్పుడు తెరవాలనే అంశంపై క్లారిటీ ఇస్తూ మరో ఆర్డర్ తాజాగా జారీ చేసింది. తాజాగా నవంబర్ 30 వరకూ స్కూళ్లు తెరవడానికి వీల్లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు పిల్లలు వస్తే కరోనా విజృంభిస్తే పసిపిల్లల ప్రాణాలకు భద్రత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని కేంద్రం భావిస్తోంది.

ఇక తల్లిదండ్రులు కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లలను పాఠశాలలు పంపడానికి ధైర్యం చేయడం లేదు. ఇప్పటికే దాదాపు 80శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలలకు పంపమని సర్వేలో తేల్చారు. దీంతో కరోనాతో గేమ్స్ ఆడకూడదని నిర్ణయించుకున్న కేంద్రం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నవంబర్ 30 వరకు స్కూళ్లు తెరవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.