Templates by BIGtheme NET
Home >> Telugu News >> బుబోనిక్ ప్లేగు: ఆ గ్రామాలను సీజ్ చేసిన చైనా

బుబోనిక్ ప్లేగు: ఆ గ్రామాలను సీజ్ చేసిన చైనా


కరోనాను ప్రపంచానికి అంటించిన చైనాను మరో వైరస్ వ్యాధి కబళిస్తోంది. తాజాగా చైనాలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడుతున్న వేళ చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది.

ప్రస్తుతం చైనాలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాధి విజృంభిస్తోంది. చైనాలోని మంగోలియా సరిహద్దుల్లో ఉన్న ఓ గ్రామంలో ఈ వ్యాధి సోకి ఓ వ్యక్తి చనిపోయాడు. దాంతో అలెర్ట్ అయిన చైనా ప్రభుత్వం ఆ గ్రామాన్ని సీల్ చేసింది.

ఉత్తర చైనా ప్రాంతంలో ఈనెలలో రెండో ప్లేగు కేసు నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు. ప్లేగు సోకి అవయవాల వైఫల్యంతో ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. దీనిపై చైనా పరిశోధకులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ గ్రామానికి ఆనుకొనే మరో గ్రామంలో ఇదే వ్యాధిలో మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో ప్లేగు నిరోధిత అలర్ట్ జారీ చేశారు.ఈ అలర్ట్ తో ఇక్కడ ప్రజలు జంతువులను వేటాడడం.. తినడం నిషేధించారు. ప్లేగు లక్షణాలున్న వారు సమాచారం ఇవ్వాలని ప్రకటించారు. చైనాలో ఈ తరహా ప్లేగు వ్యాధులు 4 రకాలున్నాయి. ఏ ప్లేగు సోకిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.