‘గూగుల్ సెర్చింజన్ ‘ నూ చుట్టేసిన వైరస్!

0

ఇప్పుడంతా కరోనాదే రాజ్యం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కరోనా గురించే చింత. అదేలా సోకుతుంది. సోకితే బయటపడటం ఎలా? ఒకవేళ వస్తే ఏం తినాలి..ఇలా గూగుల్ నిండా కరోనా సెర్చ్ లే కనిపిస్తున్నాయి. గూగుల్ లో ఎక్కువ మంది భారతీయులు రష్యా సిద్ధం చేసిన వ్యాక్సిన్ వివరాల గురించి శోధించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయనది హత్యనా..ఆత్మహత్యనా అన్నది ఇప్పటికీ మిస్టరీగా మారింది. పైగా ఆ కేసు గురించి రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ గురించి అతడి మరణంపై ఎక్కువ మంది వివరాలు తెలుసు నేనెందుకు గూగుల్ ను ఆశ్రయించారు. పాకిస్తాన్ – ఇంగ్లాండ్ మధ్య టీ 20 మ్యాచ్ విశేషాలు వంటి వాటి గురించి సెర్చ్ చేశారు. గూగుల్ ఆగస్టు నెల సెర్చ్ ట్రెండ్స్ ని విడుదల చేసింది.

స్పుత్నిక్ స్పుత్నిక్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ కోసం వరుసగా 3 300 శాతం 2 700 శాతం శోధనలు పెరిగినట్లు గూగుల్ తెలిపింది. ఇండియా ఇండిపెండెన్స్ డే కోసం 3 750 శాతానికి పైగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తన నివేదిక లో వెల్లడించింది. టాప్ టెన్ ట్రెండింగ్ లో నిలిచిన వివరాలివే… కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి కరోనా వచ్చిందా బట్టలపై కరోనా జీవిత కాలం ఎంత కరోనా నిరోధానికి రష్యా వ్యాక్సిన్ కనిపెట్టిందా జియోలో కరోనా కాలర్ ట్యూన్ ఎలా ఆపాలి ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారు ఒళ్లు నొప్పులు ఉంటే కరోనా ఉన్నట్లా కరోనా ఉంటే ఉష్ణోగ్రత ఎంత కరోనా లక్షణాలు బైట పడేది ఎన్ని రోజులకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా వచ్చిందా ఎస్పీ బాలుకూ కరోనా ఏ విధంగా సోకింది. అనే విషయాలు తెలుసు కోవడానికి గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేశారు.