 ప్రకృతి సోయగాలకి నిలయం అయిన కేరళలో గత మూడేళ్ళుగా వరుసగా ఎదో ఒక విపత్తు సంభవిస్తూనే ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలు వరదలతో కేరళ వాసులు భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం కేరళలో ఇడుక్కి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇడుక్కి జిల్లాలోని పెట్టుమూడి టీ ఎస్టేట్ కార్మికుల ఇళ్లపై శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 42 కి పెరిగింది. శనివారం 22 మృతదేహాలు బయట పడగా ఆదివారం మరో 20 మేరకు మృతదేహాలను వెలికి తీశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా తిరునల్వేలి తెన్ కాశి పరిసర వాసులకు చెందిన వారు కావడంతో ఇక్కడి కుటుంబాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయి. వర్షం కారణంగా సహాయక చర్యల్లో ఇబ్బందులు తెలత్తుతున్నాయి. మృతదేహాలని వెలికి తీసేందుకు స్నిఫర్ డాగ్స్ ను ఉపయోగిస్తున్నట్లు సిబ్బంది చెప్పారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందితో కలిసి ఫైర్ పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వి. మురళీధరన్ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల సంఘటనాస్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మృతుల్లో అత్యధిక శాతం మంది కైతారు వాసులు కావడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగింది. ఇంకా 50 మేరకు మృతదేహాల కోసం అన్వేషణ సాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 21 మంది జాడ కానరాకపోవడంతో వీరంతా తేయాకు తోటకు కూత వేటు దూరంలో ప్రవహిస్తున్న నదిలో కొట్టుకెళ్లి ఉంటారన్న నిర్ధారణకు సహాయక బృందాలు వచ్చాయి. దీంతో హెలికాఫ్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు.మృతదేహాలను సొంత గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో అక్కడే ఖననం చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్తో రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం మాట్లాడారు. కేరళ సీఎం పినరయి విజయన్తో ముఖ్యమంత్రి పళనిస్వామి ఫోన్లో మాట్లాడారు. మూనారులో సాగుతున్న సహాయక చర్యలు మృతుల్లో తమిళులు ఉండడం గురించి మాట్లాడారు. అవసరమైతే తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.సహాయక చర్యలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని త్వరితగతిన అన్ని వివరాలను తమిళనాడుకు అందజేస్తామని విజయన్ తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలను కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
 TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets