Templates by BIGtheme NET
Home >> Telugu News >> మరో వూహన్ ..తూర్పు గోదావరి జిల్లా !

మరో వూహన్ ..తూర్పు గోదావరి జిల్లా !


ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతూ .. అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెద్ద జిల్లాలో ఒకటైన తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంది. తూర్పు గోదావరి జిల్లా అంటే .. కోనసీమ అందాలు – గోదారమ్మ పరవళ్ళు ప్రశాంతతకు మారుపేరుగా చెప్తారు. కానీప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా జిల్లా అల్లాడిపోతోంది. ముఖ్యంగా జిల్లాలో కీలక నగరాలైన కాకినాడ రాజమహేంద్రవరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం .. ఎంతోమంది కరోనా బారినపడి అవసరమైన వైద్యం వారికీ అందేలోపలే మృత్యువాత పడుతున్నారు.

జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ప్రతిరోజు 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1270 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తూర్పు గోదావరి జిల్లాలో మొత్తంగా 28850 కేసులు నమోదు అయ్యాయి. ఈ గణాంకాలని చూస్తే .. కరోనా తూర్పుగోదావరి జిల్లాను మరో వూహన్ గా మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు చాలా మంది మరణాలకు కారణాలు కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి – అధికార యంత్రాంగం – వైద్య – ఆరోగ్య శాఖ సిబ్బంది… అందరూ విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి ప్రతిరోజు నమోదవుతున్న కేసులే ప్రత్యక్ష నిదర్శనం.

కేసులు భారీగా నమోదు అవుతుండటంతో జిల్లాలోని కాకినాడ సర్వజన ఆసుపత్రి రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆసుపత్రిగా ప్రకటించారు. ఇక జిల్లాలోని చాలా ప్రైవేట్ ఆస్పత్రులు కరుణ రోగుల విషయంలో ముఖం చాటేస్తున్నాయి లక్షల సొమ్మును చెల్లిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిలో అందరికి బెడ్స్ ఇవ్వడం లేదు. డబ్బు ఎవరు కడతారు ..ఎవరు కట్టలేరు అని ముందే ఉహించి .. ముందే కొంచెం డిపాజిట్ చేయించుకొని బెడ్స్ కేటాయిస్తూ ..కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా కార్పొరేట్ దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో ప్రతి ఇంటికి కరోనా చేరేలా కనిపిస్తుంది. జిల్లాలో కరోనా ఇంతలా విజృంభిస్తుంటే ..కొంతమంది ప్రజలు ఏ మాత్రం సామజిక భాద్యతతో వ్యవహరించడం లేదు. గుంపులు గుంపులుగా చేరుతున్నారు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. కాబట్టి సామజిక భాద్యతతో వ్యవహరించి ..కరోనా నుండి బయటపడండి.

ఇది ఇలా ఉండగా మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకు ఊహించని రీతిలో కేసులు పెరుగుతున్నాయి. దానికి తోడుగా మరణాలు కూడా తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో వైరస్ ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా రికార్డులు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 10171 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. తాజాగా వైరస్ తో బాధపడుతూ 94 మంది మృత్యువాత పడ్డారు. ఈ విధంగా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశంలో సామూహిక వ్యాప్తి మొదలైందని వార్తలు వెలువడుతుండడంతో ఏపీలో కూడా ఆ పరిస్థితి ఏర్పడిందా అనేలా కేసులు నమోదవుతున్నాయి.

ఒక్కరోజే 62938 నమూనాలు పరీక్షించడంతో అన్నేసి కేసుల వెలుగులోకి వచ్చాయి. కొత్త పద్ధతిల్లో పరీక్షలు చేస్తుండడంతో కేసులు అమాంతం పెరగడానికి కారణమైంది. తాజాగా 7594 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 84654.. మొత్తం డిశ్చార్జయిన వారి సంఖ్చ 117569… మొత్తం మృతుల సంఖ్య 1842. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పరీక్షలు 2362 270.

ప్రస్తుతం ఏపీలో 84654 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి( 28850) కర్నూలు(24679)–అనంతపురం( 22273) – గుంటూరు(20236) లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి.