Templates by BIGtheme NET
Home >> Telugu News >> విదేశాల నుంచి ఏపీకి వస్తుంటే.. ఈ రూల్స్ ను మర్చిపోవద్దు

విదేశాల నుంచి ఏపీకి వస్తుంటే.. ఈ రూల్స్ ను మర్చిపోవద్దు


నడుస్తున్న పాడు కాలం గురించి తెలిసిందే. చేతిలో డబ్బులు ఉంటే చాలు.. మనసుకు అనిపించినంతనే ఎక్కడికైనా వెళ్లే కరోనా ముందు వరకు ఉండేది. ఎప్పుడైతే మహమ్మారి విరుచుకుపడటం మొదలైందో.. దేశాల సంగతి తర్వాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా కూడా పరిమితులెన్నో. దీంతో.. తరచూ ప్రయాణాలు చేసేటోళ్లకు మహా కష్టంగా మారింది. అన్నింటికి మించి వ్యాపార.. వ్యక్తిగత పనుల్లో భాగంగా జర్నీలు చేయాల్సిన వారికి.. తాము వెళ్లే ప్రాంతంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో తెలుసుకోవాల్సి వస్తోంది.

కరోనా వేళ.. విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారంతా అనుసరించాల్సిన నిబంధనల మీద తాజాగా ఏపీ సర్కారు సరికొత్త ఆదేశాల్ని ఇచ్చింది. లాక్ డౌన్ వేళలో విదేశాల్లో నిలిచిపోయిన వారు.. తర్వాతి కాలంలో వద్దామనుకున్నా.. వివిధ కారణాలతో రాలేకపోయిన వారంతా ఇప్పుడు..ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణ పరిమితులు పెట్టి దగ్గర దగ్గర ఐదు నెలలు కావటం.. పనులు పెండింగ్ లో ఉండిపోవటంతో.. ఇప్పుడు జర్నీలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇలాంటి వేళ.. ఏపీ సర్కారు విదేశాల నుంచి వచ్చే వారి కోసం సరికొత్త మార్గదర్శాల్ని జారీ చేశారు. దీని ప్రకారం.. తాము ఏపీకి రావటానికి 72 గంటల మందు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఎవరికి వారు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పందన యాప్ లోని ఆన్ లైన్ ద్వారా తమ ప్రయాణానికి సంబంధించిన వివరాల్ని ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది.

నిబంధనల ప్రకారం విదేశీ ప్రయాణికులు అవసరమైతే పద్నాలుగురోజుల పాటు క్వారంటైన్ కు అగీకరించేందుకు ఓకే చెప్పాలి. పెయిడ్ క్వారంటైన్ లో ఉండాల్సి వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. తీవ్రమైన జబ్బులు.. గర్భిణులు.. పదేళ్ల లోపు చిన్నారులకు మాత్రం మినహాయింపు ఇస్తారు. అంతేకాదు.. ఎవరైనా ఆత్మీయులు చనిపోతే వారినిచూసేందుకు విదేశాల నుంచి వచ్చే వారికి మినహాయింపు ఇవ్వనున్నారు.

క్వారంటైన్ లేకుండా ఉండాలంటే.. ప్రభుత్వం నిర్దారించిన ల్యాబ్ లలో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకొని రిపోర్టు నెగిటివ్ వచ్చిన వారికే మినహాయింపు ఇస్తారు. ఈ టెస్టు కూడా విమానం ఎక్కటానికి 96 గంటల ముందు చేయించుకొని ఉండాలి. ఒకవేళ.. ఆర్టీపీసీఆర్ రిపోర్టు లేకుంటే మాత్రం ఎయిర్ పోర్టు దగ్గర యాంటీజెన్ టెస్టు చేయించుకునే అవకాశం ఉంటుంది. అందులో నెగిటివ్ వస్తే.. ఇంట్లోనే ఉండి క్వారంటైన్ అయ్యేందుకు వీలుగా అనుమతి ఇస్తారు. మరిన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అందుకే.. విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు ఎవరైనా.. ముందుగా స్పందన యాప్ లో డిటైల్స్ పొందుపర్చటం మాత్రం మర్చిపోవద్దు. లేదంటే.. తిప్పలు తప్పవంటున్నారు.