‘వి’ స్టోరీ ఏంటో తెలిసి పోయింది

0

సుధీర్ బాబు హీరోగా నాని నెగటివ్ పాత్రలో నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేశారు. థియేటర్లలో విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఇన్నాళ్లు ఉన్న నిర్మాత దిల్ రాజు ఇక తప్పదు అనుకుని ఓటీటీ లో విడుదల చేసేందుకు రెడీ అయ్యాడు. నాని 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణల కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను ఆయన రూపొందించి ఉంటారని అంతా నమ్ముతున్నారు. ఇక ఇది ఒక రివేంజ్ డ్రామా అంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా కథ అంటూ ప్రస్తుతం ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నాని ఒక సాదారణమైన వ్యక్తి. ఆయన భార్య అయిన అదితి రావు హైదరిని కొందరు చంపేస్తారు. తన భార్య చావుకు కారణం అయిన వారిని నాని చంపేస్తూ అక్కడ వి అనే అక్షరంను వదిలేస్తూ ఉంటాడు. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు సుధీర్ బాబు రంగంలోకి దిగుతాడు. ఇద్దరి మద్య జరిగిన ఆసక్తికర సంఘటనలతో ఈ సినిమా కథ సాగుతుందని చెబుతున్నారు. ‘వి’ స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా నాని నెగటివ్ రోల్ లో నటించడంతో సినిమా స్థాయి పెరిగి పోయింది. తప్పకుండా మంచి స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఈ సినిమాను రూపొందించి ఉంటాడు అంటున్నారు.