బిగ్ బాస్ హౌస్ లో మైవిలేజ్ షో ‘గంగవ్వ’

0

తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మై విలేజ్ షో వీడియోల్లో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమెను పూరి జగన్నాధ్ వంటి దర్శకుడు కూడా మెచ్చుకుని తన సినిమాలో చిన్న పాత్రను ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ తన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఆమెన భాగస్వామ్యం చేశారు. సమంత మరియు కాజల్ వంటి స్టార్ హీరోయిన్స్ ఆమెతో మాట ముచ్చట చేశారు. సినిమా ఆఫర్లతో పాటు పలు ఓటీటీ ఆఫర్లు కూడా ఆమెకు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో గంగవ్వకు తెలుగు బిగ్ బాస్ టీం నుండి పిలుపు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఖచ్చితంగా నిజం కాకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె వయసు రీత్యా మరియు ఇతరత్ర కారణాల వల్ల ఆమె బిగ్ బాస్ కు అస్సలు సెట్ అయ్యే అవకాశం లేదు. ఒక వేళ ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకున్నా అక్కడ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. సంపూర్నేష్ బాబు మాదిరిగా తాను వెళ్లి పోతాను అంటూ కన్నీరు పెట్టుకుంటుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఒకవేళ ఆమె ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఆమె మాట తీరు సెలబ్రెటీలతో ఎలా ఉంటుంది ఆమె బిగ్ బాస్ లో ఎలా ఉంటుందో చూడాలని ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కాని తెలుగు బిగ్ బాస్ సీజన్ లు మూడు తీసుకుంటే అలాంటి కంటెస్టెంట్స్ ను తీసుకోలేదు. ఈసారి కొత్తగా ఉంటుందని ప్రయత్నించే అవకాశం ఉందా లేదంటే అంతటి సాహసం ఎందుకులే అనుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.