Templates by BIGtheme NET
Home >> Cinema News >> కారు కొన్నప్పటి కంటే గేదెను కొన్నప్పుడు ఆనందం కలిగింది

కారు కొన్నప్పటి కంటే గేదెను కొన్నప్పుడు ఆనందం కలిగింది


కరోనాకు ముందు వరకు సోనూ సూద్ అంటే ఒక విలన్. ఈ విషయాన్ని అందరు చెప్పుకునే వారు. ఆయన అరుంధతి చిత్రంలో చేసిన పాత్రను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. కాని కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఆయన్ను దేశం మొత్తం రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో ఆయన చేస్తున్న సేవలు ఆయన్ను దేవుడిని చేశాయి. ఆయన వల్ల సాయం పొందిన వారు మాత్రమే కాకుండా అందరు కూడా ఆయన్ను దేవుడు అంటున్నారు.

ఇటీవ బీహార్ రాష్ట్రం చంపారన్ లోని భోలా అనే గ్రామంలో వచ్చిన వరదల్లో ఒక కుటుంబం చిక్కుకుంది. ఆ కుటుంబం తమ కుమారుడిని కోల్పోవడంతో పాటు బతుకు దెరువు ఇచ్చే గేదెను కూడా పోగొట్టుకున్నారు. నిరాశ్రయులు అయిన ఆ కుటుంబం కి సోనూసూద్ సాయం అందించాడు. స్థానికుల ద్వారా సోషల్ మీడియాలో విషయాన్ని తెలుసుకుని అతడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. గేదెను కొని వారికి ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆ కుటుంబంకు గేదెను కొనిచ్చాడు.

గేదెను కొనివ్వడంపై సోనూసూద్ స్పందిస్తూ నా మొదటి కారు కొనుగోలు చేసిన సమయంలో నాకు ఇంత ఆనందం కలుగలేదు. వారికి బతుకుదెరువు ఇచ్చేందుకు గేదెను కొనిచ్చినందుకు చాలా సంతోషించాను అంటూ ఆయన పేర్కొన్నాడు. ఈసారి బీహార్ వెళ్లినప్పుడు ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్లి గేదె పాలు ఒక గ్లాస్ తాగి వస్తానంటూ సోనూసూద్ చెప్పుకొచ్చాడు. ప్రతి రోజు వేలాది రిక్వెస్ట్ లు వస్తున్నా వాటిని సావదానంగా పట్టించుకుంటూ తన అవసరం ఉన్న వారికి సాయం చేస్తూ ఉన్నాడు.