విషమంగానే ఉన్న బాలు ఆరోగ్యం

0

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్య ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందంటూ చెన్నై ఎంజీఎం వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం పది మందితో కూడిన వైధ్య బృందం బాలు గారికి ట్రీట్ మెంట్ అందిస్తుంది. వారు మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రముఖుల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో విదేశాల నుండి ప్రముఖ వైధ్యులు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా ఆయన ఐసీయూలో ఉన్నారు. రెండు మూడు రోజుల క్రితం కాస్త పర్వాలేదు అనిపించినా మళ్లీ ఆయన పరిస్థితి విషమంగా మారిందట.

బాలు గారి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థను చేస్తున్నారు. ఆయన తనయుడు చరణ్ రెగ్యులర్ గా అప్ డేట్ ఇస్తున్నారు. తాజాగా ఆయన నాన్న గారు ఇంకా క్రిటికల్ కండీషన్ లోనే ఉన్నారు అంటూ చెప్పాడు. అయితే ఈసారి ఆయన కాస్త ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు. దాంతో అభిమానులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. మీ ప్రార్థనలు కొనసాగించండి అంటూ చరణ్ వేడుకున్నాడు. ప్రముఖులు దాదాపు అంతా కూడా బాలు గారి ఆరోగ్యం కుదుట పడాలంటూ కోరుకుంటున్నారు. కోట్లాది మంది అభిమానులు కూడా ఆయన త్వరలో కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.