బాలీవుడ్ లో అడుగుపెడుతున్న ‘రాక్షసుడు’…!

0

రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొనేరు సత్యనారాయణ నిర్మించారు. తమిళ్ సూపర్ హిట్ ‘రాక్షసన్’ సినిమాకి తెలుగు రీమేక్ గా వచ్చిన ‘రాక్షసుడు’ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. అయితే హిందీ ‘రాక్షసుడు’ చిత్రానికి కూడా రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. రేపు రమేష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన బాలీవుడ్ ఎంట్రీ గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కాగా ‘రాక్షసుడు’ హిందీ రీమేక్ ని తెలుగులో రూపొందించిన కోనేరు సత్యనారాయణ.. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడు. ‘ఒక ఊరిలో’ ‘రైడ్’ ‘వీర’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ ఇప్పుడు ‘రాక్షసుడు’ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన దర్శకులందరూ సక్సెస్ అయ్యారు. మరి రమేష్ వర్మ ‘రాక్షసుడు’తో నార్త్ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసి ఆ డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ అవుతారేమో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు మాస్ మహారాజా రవితేజ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేసాడు రమేష్ వర్మ. ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కోనేరు హవీష్ నిర్మించనున్నారు. హిందీ ‘రాక్షసుడు’ సినిమా కంప్లీట్ అయిన తర్వాత రవితేజ సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం.