హీరో రామ్ కి ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న?

0

టీడీపీ నుంచి వైదొలిగి వైసీపీకి సపోర్టు చేస్తున్న గన్నవరం ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా టాలీవుడ్ హీరో రామ్ కూ సూటి ప్రశ్న సంధించారు. సినీ హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా..? వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్ ని చెప్పమనండి’ అంటూ వంశీ తనదైన శైలిలో టాలీవుడ్ హీరోకు ప్రశ్నల వర్షం కురిపించారు.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి కారణమైన రమేశ్ ఆసుపత్రికి అనుకూలంగా హీరో రామ్ ఇటీవల ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ రమేశ్ స్వయానా హీరో రామ్ కు బాబాయ్ కావడంతో ఆయనను వెనకేసుకొచ్చేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్న ప్రచారం సాగింది. సీఎం వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించిన రామ్ కు తాజాగా ఎమ్మెల్యే వంశీ ఇలా కౌంటర్ ఇచ్చాడని అనుకుంటున్నారు.

ఇక వంశీ తాజాగా చంద్రబాబును కూడా ఇదే కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కమ్మవారికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపిందా అని ప్రశ్నించారు.

చంద్రబాబుతోనే మా సామాజికవర్గానికి ముప్పు అని.. బాబుకు ఉన్న సమస్యలన్నీ కులానికి రుద్దుతాడని వంశీ ఎద్దేవా చేశారు.