ఆయన అనారోగ్యంతో వందల కోట్లు రిస్క్

0

ఒక వైపు కరోనా కారణంగా నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. ఇప్పటికే సినిమాలు పూర్తి అయ్యి విడుదల కాకపోవడంతో కోట్లల్లో నష్టాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు మద్యలో ఉన్నాయి. వాటి వల్ల కూడా నిర్మాతలకు కోట్లల్లో నష్టం. ఇలా నిర్మాతలు నష్టాల మద్య కొట్టు మిట్టాడుతున్న సమయంలో సంజయ్ దత్ అనారోగ్యం కొందరి నిర్మాతలకు ఆందోళన కలిగిస్తుంది. దాదాపుగా 600 కోట్ల నుండి 750 కోట్ల వరకు రిస్క్ లో పడ్డట్లయ్యింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మద్యలో ఆగిపోయే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం సంజయ్ దత్ కేజీఎఫ్ 2.. షంషేర్.. భుజ్.. పృథ్వీరాజ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే ఆరు నెలలుగా షూటింగ్స్ జరగడం లేదు. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాలనుకుంటున్న సమయంలో సంజయ్ కి క్యాన్సర్ అంటూ నిర్థారణ అవ్వడంతో వీటి షూటింగ్స్ విషయంలో మళ్లీ బ్రేక్ పడ్డట్లయ్యింది. కేజీఎఫ్ 2 చిత్రంలో అత్యంత కీలకమైన అధీరా పాత్రను సంజయ్ దత్ చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ పాత్రకు సంబంధించి ఇప్పటికే కొన్ని రోజుల షూటింగ్ చేశారు. ఇంకా రెండు నెలల పాటు దత్ కేజీఎఫ్ కోసం వర్క్ చేయాల్సిన అవసరం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఇతర హిందీ సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది. సంజయ్ దత్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్తాడనే వార్తలు వస్తున్నాయి. అక్కడ ఎంత కాలం ఆయన ఉంటాడు అనేది తెలియదు. ప్రస్తుతానికి ఇండియాలోనే దత్ ఉన్నారు.

ఈ సినిమాల షూటింగ్ ను ఆయన కంప్లీట్ చేసి ట్రీట్ మెంట్ కోసం వెళ్తాడా అనేది చూడాలి. సంజయ్ దత్ క్యాన్సర్ కారణంగా ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మరియు ఆయనకు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆయన క్యాన్సర్ ను జయించి మళ్లీ కెమెరా ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.